BigTV English

Kavitha : కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి!.. కేసీఆర్ కు కవిత స్ట్రోక్!!

Kavitha : కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి!.. కేసీఆర్ కు కవిత స్ట్రోక్!!

Kavitha : కవిత ఇష్యూ తెలంగాణలో కాక రేపుతోంది. చెప్పుతో కొడతా.. కొట్టికొట్టి చంపుతా.. అంటూ ఎంపీ అర్వింద్ కు కవిత మాస్ వార్నింగ్ ఇవ్వడం మామూలు విషయమేమీ కాదు. కవిత కాంగ్రెస్ లో చేరేందుకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ధర్మపురి అర్వింద్ చెప్పడమే ఆమెకు అంతటి ఆగ్రహం తెప్పించింది. ఇంతదానికే అంత కోపమా? అనేది కొందరి అనుమానం.


బీజేపీ వాళ్లు కవితను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారని కేసీఆర్ ఆరోపించడం.. మూడు రోజుల గ్యాప్ లోనే ఆ వ్యాఖ్యలకు కంప్లీట్ ఆపోజిట్ గా కవితనే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ట్రై చేశారంటూ అర్వింద్ బాంబు పేల్చడంపై రాజకీయంగా రచ్చ నడుస్తోంది. అర్వింద్ ను కవిత అంతగా తిట్టినా.. ఆమె అనుచరులు అర్వింద్ ఇంటిని ధ్వంసం చేసినా.. ఈ ఎపిసోడ్ పై టీఆర్ఎస్ నేతలెవరూ పార్టీ తరఫున అసలేమాత్రం స్పందించకపోవడం ఆసక్తికరం. అంటే, అంతా అంటున్నట్టు కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి రాజుకుందా? కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు నిజమేనా? కేసీఆర్ ఎవరి సైడ్?

ఎంపీ అర్వింద్ ఓ లాజిక్ ప్రశ్న సంధించారు. కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కవితను ఎందుకు పిలవలేదని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే, కవిత అలిగారని.. తనను పక్కన పెట్టేశారనే ఉద్దేశంతోనే ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారనేది అర్వింద్ చెబుతున్న మాట.


కేవలం అర్వింద్ వ్యాఖ్యలకే కవితకు అంత కోపం వచ్చిందని అనుకోలేమంటున్నారు. కేసీఆర్ మీద అసహనంతోనే.. కవిత ఇలా రెచ్చిపోయారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటులో తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని రగిలిపోతుండగా.. ఇలాంటి సమయంలో తాను కాంగ్రెస్ లో చేరబోతున్నానంటూ తన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసే ప్రయత్నం అర్వింద్ చేయడంతో.. ఆమె కోసం కట్టలు తెంచుకుందని అంటున్నారు. అందుకే పరుష పదజాలంతో పాటు అర్వింద్ ఇంటిపై తన అనుచరులతో దాడి చేయించి.. తన అసహనాన్నంతా వెల్లగక్కారని తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే.. టీఆర్ఎస్ శ్రేణులెవరూ ఆమెకు మద్దతుగా నిలవకపోవడంతో.. కల్వకుంట్ల ఫ్యామిలీలో సంథింగ్ సంథింగ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీకి దాడులు చేసే సంస్కృతి మొదట్లో ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎక్కడా భౌతిక దాడులు చేసిన చరిత్ర లేదు. తరుచూ మాటల దాడి మాత్రమే కానీ, చేతులకు పని చెప్పిన ఘటనలు చాలా తక్కువే. అయితే, బీజేపీ దూకుడుతో కారు పార్టీ కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని.. ఈమధ్య తరుచూ అవుటాఫ్ కంట్రోల్ అవుతున్నారని అంటున్నారు. గతంలో బండి సంజయ్ ను పలు సందర్భాల్లో అడ్డుకునే ప్రయత్నం చేయడం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై రెండుసార్లు దాడులకు తెగబడే ప్రయత్నం చేయడం.. వారి అభద్రతా భావానికి నిదర్శనం అని ఆరోపిస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×