BigTV English

MLC Elections 2025: బీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షగా.. ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC Elections 2025: బీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షగా.. ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC Elections 2025: ఎమ్మెల్యే కోటాలో తెలంగాణలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే నెలాఖరుతో ఖాళీ అవుతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఆ అయిదు స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ దక్కించుకోనుంది. ఆ క్రమంలో బీఆర్ఎస్‌లో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఈ సారి ఎవరికి అవకాశం ఇస్తారు? ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారికే రెన్యూవల్ చేస్తారా? అనే చర్చమొదలైంది. అయితే పలువురు సీనియర్లు కూడా ఆ సింగిల్ పోస్టు కోసం పోటీ పడుతున్నారంట..ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిఫెన్స్ లో పడేసేలా గులాబీ బాస్ ఈ ఎన్నికలను వాడుకోవాలని చూస్తున్నారంట.


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం బీఆర్ఎస్‌లో పోటాపోటీ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్‌లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో పదవీ కాలం ముగియనుంది. ఆ క్రమంలో బీఆర్ఎస్ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఈ సారి ఎవరికి అవకాశం ఇస్తారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారిలో ఒకరికే ఛాన్స్ ఇస్తారా? అన్న చర్చమొదలైంది. అయితే పార్టీలోని కొంత మంది సీనియర్లు కూడా ఆ పదవిపై బోల్డు ఆశలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసినా.. గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దాంతో వారిని మళ్లీ ఎమ్మెల్యే కోటాలో సిఫార్సు చేస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తమ్మీద కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది అంతుపట్టకుండా తయారైంది.


మార్చి 29కి ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే నెల 29న ఖాళీ అవుతున్నాయి. అందులో బీఆర్ఎస్‌కి చెందిన ఎమ్మెల్సీలు శేరి శుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీల పదవీ కాలం ముగుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎగ్గే మల్లేషం, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ల పదవీకాలం కూడా పూర్తికానుంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

కేటీఆర్, హరీష్ రావు, కవితను కలిసి విజ్ఞప్తులు

బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి వారుగా ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవితను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొంతమంది నేతలు నేరుగా ఫాం హౌజ్ కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారంట. నోటిఫికేషన్ వెలుబడబోయే ఈ 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకస్థానం మాత్రమే దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

అసెంబ్లీలో 28కి పడిపోయిన బీఆర్ఎస్ బలం

ఉపఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ బలం 38మందికి చేరింది. అందులో 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంలో అసెంబ్లీలో గులాబీ పార్టీ బలం 28కి పడిపోయింది. త్వరలో జరుగబోయే శాసనసభ్యుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సగటున 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య సమన్వయంతో ఎంఐఎంకు ఒక స్థానం, మూడు కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మూడు స్థానాలుదక్కనున్నాయి. ఆ క్రయంలో బీఆర్ఎస్ ఆ ఒక్కస్థానాన్ని ఎవరికి ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యో కోటా ఎమ్మెల్సీగా బీసీ నేతలకు అవకాశం కల్పిస్తారా?

బీఆర్ఎస్ పార్టీ బీసీ వాదం అందుకుంది. బీసీలకు రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ 42శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తెరమీదకు తెచ్చింది. కులగణన తప్పుల తడకగా అభివర్ణిస్తుంది. మరోవైపు బీసీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతుంది. అయితే త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బీసీ నేతలకు అవకాశం కల్పిస్తారా? కల్పిస్తే ఎవరికి ఇస్తారు? అన్న చర్చ జరుగుతోంది.

ఎస్సీని సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్

బీఆర్ఎస్ బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా? అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి . రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రచారం చేసుకున్న కేసీఆర్.. చివరికి ఏం చేశారో గుర్తు చేసుకుంటున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదంతో వెళ్లి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలంటే ఈ ఎమ్మెల్సీ కూడా కీలకం కానుంది. పార్టీకి దక్కనున్న ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీకి కేటాయిస్తే.. చిత్తశుద్ది నిరూపించుకున్నట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఎస్టీ సామాజికవర్గం నుంచి పాతినిధ్యం వహిస్తున్న సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి మండలిలో ప్రాధాన్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీలకు ప్రభుత్వ పథకాలను అందించ లేదని ఆ వర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారు గులాబీ పార్టీకిదూరమైనట్లు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఫలితాలు స్పష్టం చేశాయి. ఆ వర్గాలను మళ్లీ దగ్గరకు చేర్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో మళ్లీ ఎమ్మెల్యే కోటాలో సత్యవతి రాథోడ్ కు రెన్యూవల్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 4న సత్యవతి రాథోడ్ ను శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్ గా ప్రకటించారు. ఆమె ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోతే విప్ పదవి నెలరోజుల ముచ్చటగానే మారనుంది.

విప్ తో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ఆలోచన

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఆ 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు విప్ జారీ చేసి, వారు ఓటింగ్ లో పాల్గొని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే కోర్టులోదానిని అస్త్రంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. దాంతో వారిపై వేటు తప్పదని భావిస్తుంది. మొత్తమ్మీద బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×