ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో.. నిన్న లాహోర్లోని గడాఫీ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన కీలక వన్డే మ్యాచ్ రద్దు కావడం జరిగింది. మధ్యాహ్నం పూట వాతావరణం అనుకూలించినప్పటికీ… ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలోనే వర్షం బీభత్సంగా కొట్టింది. ఈ తరుణంలో లాహోర్లోని స్టేడియం మొత్తం… వరద నీటితో నిండిపోయింది. అక్కడ సరైన టెక్నాలజీ లేకపోవడంతో.. అవుట్ ఫీల్డ్ ను వెంటనే రెడీ చేయలేకపోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పడిన వర్షం అలాగే అవుట్ ఫీల్డ్ లో నిలిచిపోయింది. వర్షం దంచి కొట్టడం.. అక్కడ అధునాతన సౌకర్యాలు లేకపోవడం… ఇలా రకరకాల కారణాలవల్ల మొత్తం మూడు మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. దీంతో గ్రూప్ బి లో ఏ జట్టు సెమీఫైనల్ వెళ్తుందో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఆస్ట్రేలియా అయితే అధికారికంగా వెళ్ళినప్పటికీ మిగతా రెండు జట్లు మాత్రం పోటీ పడుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ లాహోర్ స్టేడియంలో ( Lahore stadium )… పనిచేసే స్టేడియం వర్కర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్.. గా మారడం జరిగింది. వర్షపు నీటిని బయటికి పంపించే ప్రయత్నంలో… గ్రౌండ్ మైన్లు… చాలా కష్టపడ్డారు. ఎంతో కష్టపడి వర్షం నీటిని బయటికి పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలోనే ఓ గ్రౌండ్ మాన్…. జారిపడ్డాడు. అలా జారి పడినప్పటికీ మ్యాచ్ కోసం… పైకి లేచి మళ్లీ వరద నీటిని పంపించే ప్రయత్నం చేశాడు. చాలా డెడికేషన్ తో వర్క్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అటు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. వర్షం పడితే గ్రౌండ్లను సిద్ధం చేయలేని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఛాంపియన్స్ ట్రోఫీ అవసరమా అంటూ సెటైర్లు పెంచుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఒక ఐసీసీ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అవుతాయా? ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా చూశారా? కేవలం పాకిస్తాన్లోనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసేలా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు.