Intinti Ramayanam Today Episode March 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయ శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పల్లవి శ్రీకరు అవనీ వెళ్లడం చూసి శ్రియ కు ఫోన్ చేసి అసలు విషయం చెప్తుంది. మన భర్తలు మనకన్నా ఎక్కువగా వాళ్ళ వదినని ప్రేమిస్తారు వాళ్ళ వదిన అంటే దేవత అని చాలా విషయాల్ని శ్రీయను తన ప్లాన్ వైపు తిప్పుకునేలాగా చెప్తుంది. మనం ఏం చేసినా తప్పే వాళ్ళ వదిన మాత్రమే దేవత ఆస్తి రాయించుకోవాలని చూసిన కూడా వదినే దేవత అని చాలా విధాలుగా చెప్పి శ్రీయను ట్రాప్ చేస్తుంది. అభినయక్క ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమె కోసం మన భర్తలు ఏవేవో చేస్తారు ఒక్క మాట కూడా అననివ్వరు ఆమె చేసింది తప్పేమీ కాదు అని పల్లవి శ్రియకు నూరిపోస్తుంది. పల్లవి మాటలను నమ్మిన శ్రీయ ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..శ్రీయ బర్త్ డే ను సెలబ్రేట్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరు శ్రీకర్ కోసం వెయిట్ చేస్తుంటారు. శ్రీకర్ ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్తే బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా చేసేవాళ్లం కదా అని కమల్, అక్షయ్ అంటారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఒక అరగంటలోనే మనం హాల్లో డెకరేట్ చేసి శ్రీయ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్గా చేద్దామని అంటారు.. అప్పుడే శ్రీకర్ఇంటికి వస్తాడు. శ్రియకు బర్త్డే గిఫ్ట్ తీస్తే దాన్ని విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది.. శ్రీయా బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే శ్రీకర్ కూడా రూమ్ లోకి వెళ్తాడు..
నేను ఎందుకు రాలేకపోయాను అర్థం చేసుకోవచ్చు కదా శ్రీయ బిజీగా ఉంటే తప్ప నేను ఏ రోజు నేను పట్టించుకోకుండా ఉండలేదు కదా అని శ్రీకర్ అంటాడు. నువ్వు రాను రా నువ్వు పల్లవి లాగా తయారవుతున్నావు కొంచెము ఆలోచించు అని అనగానే అక్కడ నెక్లెస్ చూసి ఈ నెక్లెస్ నీకు ఎవరు ఇచ్చారు అని శ్రీకర్ అడుగుతాడు నాకు పల్లవి గిఫ్ట్ గా ఇచ్చిందని శ్రియ అంటుంది. దాంతో కోపంతో రగిలిపోయిన శ్రీకర్ బయటకు వచ్చి పల్లవి దగ్గర నెక్లెస్ విసిరి కొడతాడు. ఎందుకు నువ్వు శ్రియకు నెక్లెస్ ఇచ్చావు మీ ఇద్దరి మధ్య అంత క్లోజ్ గా ఎప్పుడు బంధం ఏర్పడింది అని శ్రీకర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
నువ్వు నన్ను ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావ్ నేనేమైనా నీ పెళ్ళాన్నా.. నేనేమైనా మీ పెళ్ళానికి కావాలని ఇచ్చానా నీ పెళ్ళాన్ని అడుగు ఎవరిచ్చారు ఈ నెక్లెస్ అని.. చెప్పు శ్రియ నీకు ఈ నెక్లెస్ ఇచ్చింది ఎవరు? పల్లవినా లేకపోతే నువ్వే వెళ్లి తీసుకున్నావా అసలు ఏం జరుగుతుంది. చెప్పు శ్రీయ అని శ్రీకర్ అడిగిన కూడా శ్రియ చెప్పదు. దానికి పల్లవి ఈ నెక్లెస్ నేనే శ్రీయకు ఇచ్చాను అంటే చెప్పు నేను ఇంట్లోంచి ఇప్పుడే ఇంటికి బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అంటుంది. శ్రీయ మాత్రం నేనే నెక్లెస్ ని పల్లవి దగ్గర నుంచి తీసుకున్నానని అబద్ధం చెప్తుంది. అందరూ ఒకరి నుంచి వెళ్ళిపోతారు పల్లవి శ్రియ నా బుట్టలో పడిపోయింది బకరాలాగా బలైపోయింది అని సంబరపడిపోతుంది.
రాజేంద్రప్రసాద్ పార్వతి ఇంట్లో ఏమవుతుందో అసలు అర్థం కావట్లేదు పార్వతి ఈ గొడవలు ఎప్పుడు ఆగుతాయో తెలియట్లేదు ఇంట్లో ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు వీటన్నిటిని చూస్తుంటే నా గుండె పగిలిపోవాలి అనిపిస్తుంది అని బాధపడతాడు. అటు భానుమతి కమలాకర్ ఫోటో చూసి తన మనసులో నీ ప్రేమను బయటపెడుతుంది. కమల్ అదే అదునుగా చూసుకొని భానుమతిని ఆట ఆడుకుంటాడు. ఇక అక్షయ్ మాత్రం అవని కోసం బాధపడుతూ ఉంటాడు ఆరాధ్య అవనికి ఫోన్ చేయమని అడుగుతుంది.
ఆరాధ్య దయాకర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది అవనికి ఇవ్వమని అడుగుతుంది. అవనితో అక్షయ్ ఫోన్ మాట్లాడుతాడు. ఆ తర్వాత అవని మాటలు విని అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అందరూ గుడికి వెళ్తారు. ప్రణతికి పెళ్లి ఫిక్స్ అయిందని అవనికి తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..