E-Paper
Advertisement

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!
Advertisement

సభంతా ఒకెత్తయితే.. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన చివరి మాటలు సిద్దిపేట సభను కాక రేపాయి. అంతకు ముందు కవిత చేసిన ఆరోపణలను దాదాపుగా రేవంత్‌ కూడా కంటిన్యూ చేశారు. కుటుంబ పాలన అవినీతి, వ్యక్తిగతంగా ఎవరెవరు ఎలా సంపాదించుకున్నారో సిద్దిపేట వేదికగా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. లబ్బరు చెప్పులతో వచ్చినోడికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని మొదలుపెట్టిన రేవంత్‌.. హరీశ్‌ రాజకీయ నేపథ్యాన్ని, అవినీతి మరకలను ఏకరువు పెట్టారు.

కేసీఆర్‌కు విశ్వాసం లేదని, వెన్నుపోటు రాజకీయాలకు ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని ఉదాహరణలను వివరించిన ఆయన.. చివరకు హరీశ్‌ చేతిలో అదే వెన్నుపోటుకు గురై అంతమయ్యే పరిస్థితులు రాబోతున్నాయని జోస్యం చెప్పడం రాజకీయంగా చర్చకు తెర లేపింది. ఎన్నికల దాకా బీఆరెస్‌లో హరీశ్‌ రావు ఉండబోరని తేల్చేశారాయన. బీజేపీ నేతలతో చీకటి రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, వారితో అంటకాగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం.

Advertisement

పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోని నెత్తి పోశమ్మ కొట్టిందని సామెత చెప్పిన రేవంత్‌.. చివర ప్రసంగంలో అక్కడి సిద్దిపేట ఎల్లమ్మ మహత్యాన్ని, ప్రాముఖ్యతను, అక్కడి ప్రజల నమ్మకాన్ని గుర్తు చేశారు. సిద్దిపేట ఎల్లమ్మ మీద ఒట్టేసి హరీశ్‌.. తను బీజేపీ నేతలతో అంటకాగడం లేదని చెప్పగలడా? అని సవాల్ విసిరారు. మహిమ గల ఎల్లమ్మ తల్లి ప్రస్తావన తెచ్చి మరీ హరీశ్‌రావుకు, బీజేపీ నేతలకు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందనే అంశాన్ని ప్రజలకు నమ్మకంగా చేరవేయడంలో రేవంత్‌ వేసిన పాచిక పారిందనే చెప్పాలి.

ఆయన రాజకీయ వ్యూహంలో హరీశ్‌ చిక్కుకున్నారనే కామెంట్స్‌ వస్తున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాలకు పోయి మంత్రాలు చేశాడని సీఎం ఆరోపించిన అంశంపై బీఆరెస్‌ ఇరకాటంలో పడింది. అంత రహస్యంగా పూజలు ఎందుకు చేపించావని అడిగిన ప్రశ్నలకు అనివార్యంగా జవాబులు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది హరీశ్‌కు. ఇప్పుడు రేవంత్‌.. హరీశ్‌కు కంచుకోటగా ఉన్న సిద్దిపేట అడ్డాగా మామకు వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అయ్యారని , బీజేపీలో చేరబోతున్నారని చేసిన కామెంట్స్, ఎల్లమ్మ తల్లి మీద ఒట్టు వేయాలనే ఇరకాటంలో పెట్టే వ్యూహంతో హరీశ్‌ డిఫెన్స్‌లో పడినట్టేనంటున్నారు.

Advertisement

హరీశ్‌.. ఒట్టు వేయలేడు.. రేవంత్‌ మాట అబద్దమని చెప్పే ప్రయత్నమూ జరగదు. అంటే వారు మౌనాన్నే ఆశ్రయించడం పరోక్షంగా .. రేవంత్‌ చేసిన బీజేపీ నేతలతో హరీశ్‌ అంటకాగే వ్యవహారం పరోక్షంగా నిజమేనని ఒప్పుకోవడమే అవుతుంది. కేసీఆర్‌కు వెన్నుపోటు రాజకీయాలు మాత్రమే తెలుసునన్న రేవంత్‌.. కత్తి పట్టినోడు.. చివరకు ఆ కత్తి వేటుకే బలైనట్టు.. హరీశ్‌ చేతిలో కేసీఆర్‌ రాజకీయం ఖతం కాబోతుందని స్పష్టం చేశారు.

ఈ శాస్తి కేసీఆర్‌కు జరగాల్సిందేనని తీర్మానించేశారాయన. అంతే కాదు.. బీఆరెస్‌కు ఓటేస్తే బానిసత్వానికి ఓటేసినట్టేనని ప్రజల ముందు ఓ కొత్త వాదన ఉంచారు సీఎం. తెలంగాణ జనం ఆత్మగౌరవం కోసం ఏదైనా చేస్తారని, దాని కోసం ఎంతదాకైనా వెళ్తారన్న సీఎం.. కేసీఆర్‌ పాలనలో ప్రజలను బానిసలుగా చూశారని, అది అందరి అనుభవంలో ఉందన్నారు. మరి కేసీఆర్‌ను మళ్లీ రాజకీయంగా బతికించడమంటే మనం బానిసత్వాన్ని కోరుకున్నట్టేననే రేవంత్‌ వాదన పట్ల కూడా ఓ చర్చైతే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

చెల్లెను మెడలు పట్టి బయటకు గెంటేసిన అన్న.. తెలంగాణ ఆడబిడ్డల గురించి ఆలోచిస్తాడా? వారి మంచి కోరుతాడా? అని కేటీఆర్‌ను నిలదీసిన వైనం… నైతికంగా ఆ పార్టీని, కేటీఆర్‌ పొలిటికల్‌ కెరీర్‌ను డ్యామేజీ చేసే అస్త్రంగా ప్రయోగించారని తెలుస్తోంది. ఈ కామెంట్ జనాల్లోకి కూడా బలంగా వెళ్తోంది.

ఇంకా చేయాల్సినవి చాలనే ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు. చెప్పండి.. అన్నీ చేస్తానని ప్రజల వద్ద తప్పు ఒప్పుకున్నట్టే బెండ్‌ అయి మాట్లాడిన రేవంత్‌.. అన్నీ చేసి చూపిస్తానని, మళ్లీ అధికారం ఇవ్వాలనే అభ్యర్థనను చేసుకున్నారు. అంతే కాదు.. రెండు పర్యాయాలు అధికారం ఇచ్చే ఇక్కడి ప్రజల నైజాన్ని గుర్తు చేయడం వల్ల.. మాకూ రెండోసారి ఇస్తారని నమ్ముతున్నాననే విధంగా వారి మనసులో ఓ ఫీలర్‌ వదిలారు.

Tags

Related News

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!

అసంతృప్తుల వేళ అసమ్మతి గోల! కోమటిరెడ్డి వ్యూహమేమిటీ..? పాత, కొత్త కలయికల గ్యాప్‌ను వాడుకుంటున్నారా? పార్టీలో అతనికి మద్దతెలా ఉంది?

సన్నరకాలన్నీ ప్రైవేటు దళారులే ఎగబడి కొంటున్న వైనం..! సిండికేట్‌గా మారి క్వింటాలుకు 3వేలుగా నిర్ణయం..! డెబ్బై శాతం ప్రైవేటుకే అమ్ముకుంటున్న రైతులు..

రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలు ఎక్కడ.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు!

కాంట్రవర్సీలకు కేరాఫ్​‌గా కార్మిక శాఖ.. పీక్స్‌కు చేరిన అంతర్గత పోరు!

‘ఇందిరమ్మ బీమా’పై సర్వత్రా ఆసక్తి! రేషన్‌ కార్డు దారులందరికీ వర్తించేలా పథకం..! రూ. 4వేల కోట్లు కేటాయించిన సర్కార్‌..!

Big Stories

Advertisement
×