E-Paper
Advertisement

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?
Advertisement

GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలోనూ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌లోని బర్కత్‌పుర బీజేపీ సిటీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరిగింది.

300 మంది డివిజన్ అధ్యక్షులు..

పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ షెలార్, రాష్ట్ర సహ ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలోని 9 జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు, పదాధికారులతో పాటు 300 మంది డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, డివిజన్లవారీగా పార్టీ పరిస్థితి, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, ఎన్నికల కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

పట్టు కోల్పోయే ప్రమాదం..

Advertisement

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని, లేకపోతే భవిష్యత్తులో హైదరాబాద్‌పై బీజేపీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ మేయర్ పీఠంతో పాటు తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ డబ్బు, ప్రలోభాలు, మాయమాటలతో బీజేపీ గెలవాల్సిన స్థానాలను దక్కించుకుందని ఆరోపించారు. ఈసారి అలాంటి పరిస్థితులకు తావులేకుండా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వాటా విషయంలో..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 20 శాతం కమిషన్లకు పాల్పడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 30 నుంచి 40 శాతం కమిషన్ల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో రెండు పార్టీలదీ ఒకే విధానమని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడిందని ఆరోపించారు. నగరంలో నెలకొన్న తాగునీటి సమస్య, అధ్వానంగా మారిన రహదారులు, మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

Advertisement

Also read: ఇంట్లోనే క్రిస్పీ పప్పు చెగోడీలు..ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ మీ సొంతం!

ఓటరు నమోదు..

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను స్థానిక ప్రజలతో కలిసి ఎండగట్టాలని, ప్రతి డివిజన్‌లో ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల విజయానికి ఓటరు నమోదు కీలకమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా పార్టీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని రాంచందర్ రావు సూచించారు. విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. రానున్న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నికలను కూడా పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు.

మియాపూర్‌లోని 550 ఎకరాల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం

మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో గల 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాంచందర్ రావు గారు స్పష్టం చేశారు. బుధవారం మియాపూర్‌లోని ఎంఏ నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, దీప్తిశ్రీ నగర్ కాలనీలలో ఆయన పర్యటించి, తమ నివాసాలను కోల్పోతామన్న భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనేక ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ 550 ఎకరాల భూమిపై ఇటీవల సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేసి అమ్ముకోవాలని చూడటం దారుణమని అన్నారు.

30 ఏళ్లకు పైగా..

ఈ 550 ఎకరాలలో దాదాపు 150 ఎకరాల భూమిలో 1983 నుండే అధికారిక రిజిస్ట్రేషన్లు, హెచ్ఎండీఏ అప్రూవ్డ్ లేఅవుట్లు, బ్యాంకు లోన్ల ద్వారా మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే జీవో నంబర్ 58, 59, 60 కింద పేదలు క్రమబద్ధీకరించుకున్న 68 గజాల స్థలాలు, బస్తీల్లో దాదాపు 10 నుంచి 15 వేల కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్లకు పైగా వారి స్వాధీనంలో ఉన్న ఈ 150 ఎకరాల భూమి, ఇళ్లు కచ్చితంగా ఆయా కుటుంబాలకే చెందాలని, ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని ఆయన డిమాండ్ చేశారు.

లక్ష సంతకాలతో..

ఖాళీగా ఉన్న మిగిలిన 400 ఎకరాల భూమిని 2,500 నుంచి 5,000 గజాల ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలంలో అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘లక్ష సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, స్వయంగా తానే మొదటి సంతకం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. సేకరించిన లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రవి కుమార్ యాదవ్, మహిపాల్ తదితరలు పాల్గొన్నారు.

Also Read: ముఖేష్ ట్రాప్‌లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?

Tags

Related News

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!

అసంతృప్తుల వేళ అసమ్మతి గోల! కోమటిరెడ్డి వ్యూహమేమిటీ..? పాత, కొత్త కలయికల గ్యాప్‌ను వాడుకుంటున్నారా? పార్టీలో అతనికి మద్దతెలా ఉంది?

సన్నరకాలన్నీ ప్రైవేటు దళారులే ఎగబడి కొంటున్న వైనం..! సిండికేట్‌గా మారి క్వింటాలుకు 3వేలుగా నిర్ణయం..! డెబ్బై శాతం ప్రైవేటుకే అమ్ముకుంటున్న రైతులు..

రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలు ఎక్కడ.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు!

కాంట్రవర్సీలకు కేరాఫ్​‌గా కార్మిక శాఖ.. పీక్స్‌కు చేరిన అంతర్గత పోరు!

‘ఇందిరమ్మ బీమా’పై సర్వత్రా ఆసక్తి! రేషన్‌ కార్డు దారులందరికీ వర్తించేలా పథకం..! రూ. 4వేల కోట్లు కేటాయించిన సర్కార్‌..!

మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాంకుల వరకు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×