ఎములాడ రాజన్న దగ్గర అదే మాట! కొండగట్టు అంజన్న దగ్గర అదే మాట! ధర్మపురి నరసన్న.. భద్రాచలం రామయ్య, కాళేశ్వరం శివయ్య దగ్గర కూడా.. అదే మాట! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గుడికెళ్లినా.. 100 కోట్లు ఇస్తాం.. అభివృద్ధి చేస్తాం. అదే.. క్యాసెట్! డైలాగ్స్ రిపీట్.! కానీ.. మాటలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ మేటి! పదేండ్లు తెలంగాణ ప్రజలకు ఎట్లా శఠగోపం పెట్టిండో.. అదే పదేండ్లలో.. దేవుళ్లకు శతగోపం పెట్టిండు! గుళ్ల విషయంలో.. గులాబీ బాపు చెప్పిన బక్వాస్ ముచ్చట్లు.. అన్నీ ఇన్నీ కాదు.
పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్నే కాదు.. దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు కేసీఆర్. సాధారణంగా.. భక్తులు ఎవరు గుడికి వెళ్లినా.. పూజారి వారి తలపై శఠగోపం పెట్టి దీవిస్తారు. కానీ.. కేసీఆర్ అలా కాదు! గుడికి వెళ్లి ఏకంగా ఆ దేవుడికే శఠగోపం పెట్టేశారు. గత పదేళ్లలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ.. ఇంతింత పొడుగు డైలాగులు దంచిండు కేసీఆర్. వెళ్లిన చోటల్లా.. వంద కోట్లు మంజూరు చేస్తాం.. ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ తెస్తామంటూ ఒకటే క్యాసెట్‌ని అరిగిపోకుండా.. తిరిగిన చోటల్లా వేశారు. ఒక్క యాదగిరి గుట్టకు తప్ప.. మరే ఆలయానికి కూడా చెప్పినన్ని నిధులు ఇవ్వలేదు కేసీఆర్.
కేసీఆర్ కేటాయిస్తూ వెళ్లిన వంద కోట్లు.. కొన్ని చోట్ల ప్రకటనలకే పరిమితమయ్యాయ్. ఇంకొన్ని చోట్ల.. పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయ్. అయితే.. ఆలయాల అభివృద్ధిపై ఇప్పుడు రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అదే వేములవాడ రాజన్న గుడి నుంచే.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం.. ప్రకటనలతో సరిపెట్టకుండా నేరుగా సీఎం రేవంతే అక్కడికి వెళ్లి.. 127 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఇది.. ఆలయాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్ని పక్కనపెట్టి.. కేవలం యాదగిరి గుట్ట రూపురేఖలు మార్చడం మీదే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు. గుట్టతో పాటు మిగతా ఆలయాల్ని కూడా సమానంగా అభివృద్ధి చేసి ఉంటే.. రాష్ట్రం నలుమూలగా టెంపుల్ టూరిజం బాగా డెవలప్ అయ్యేది. కానీ.. అలా చేయలేదు. పైగా.. యాదగిరి గుట్ట అభివృద్ధిలోనూ ఎన్నో లోపాలున్నాయ్. అవి.. అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయ్. ఒక్కటి చేసి.. మిగతా గుళ్లను వదిలేసి.. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. దీనిపై.. భక్తుల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయ్. ఏడాదికో గుడి తిరిగిన కేసీఆర్.. పదేళ్లలో ఏ గుడిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారనే విమర్శలున్నాయ్.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు ఆలయాల అభివృద్ధిపైనా ఫోకస్ పెట్టింది. వేములవాడ నుంచే.. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది. రాజన్న క్షేత్రంలో సీఎం రేవంత్ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అన్నదాన సత్రం సహా.. మొత్తం 127 కోట్ల 65 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలు, అన్నదాన కేంద్రం ఏర్పాటుకు రూ.76 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రూ.35 కోట్ల 25 లక్షల నిధుల్ని విడుదల చేసింది. అలాగే.. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి దాకా ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు.. రూ.47 కోట్ల 85 లక్షలు మంజూరు చేశారు.
పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్.. దేవుళ్లను కూడా మోసం చేయడంపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఆలయాలకు నిధులు ప్రకటించడం తప్ప.. ఒక్క ఆలయానికి కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయకపోవడంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఒక్క వేములవాడకే.. ఏటా వంద కోట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్.. ఒక్క ఏడాది కూడా పూర్తిగా వంద కోట్లు కేటాయించలేదు. వేములవాడను.. టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి.. కనీసం టెంపుల్ చుట్టూ కూడా అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ.. వేములవాడ ప్రజలతో పాటు రాజరాజేశ్వరస్వామి భక్తులు కూడా బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో.. బుద్ధి చెప్పారు. ఇప్పుడు రాజన్న సన్నిధిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే.. సీఎం రేవంత్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఒక్క వేములవాడ రాజన్న క్షేత్రమే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఏ ఆలయాన్ని.. ఏ విధంగా అభివృద్ధి చేయాలి? భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై.. పక్కా ప్లాన్‌తో ఉంది ప్రభుత్వం. అందులో భాగంగానే.. మొదట వేములవాడ రాజన్న సన్నిధి నుంచి మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో.. మిగతా ఆలయాలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎములాడ రాజన్న దగ్గర అదే మాట! కొండగట్టు అంజన్న దగ్గర అదే మాట! ధర్మపురి నరసన్న.. భద్రాచలం రామయ్య, కాళేశ్వరం శివయ్య దగ్గర కూడా.. అదే మాట! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గుడికెళ్లినా.. 100 కోట్లు ఇస్తాం.. అభివృద్ధి చేస్తాం. అదే.. క్యాసెట్! డైలాగ్స్ రిపీట్.! కానీ.. మాటలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ మేటి! పదేండ్లు తెలంగాణ ప్రజలకు ఎట్లా శఠగోపం పెట్టిండో.. అదే పదేండ్లలో.. దేవుళ్లకు శతగోపం పెట్టిండు! గుళ్ల విషయంలో.. గులాబీ బాపు చెప్పిన బక్వాస్ ముచ్చట్లు.. అన్నీ ఇన్నీ కాదు.
నాకంటే గొప్ప భక్తుడెవరూ లేరు.! నన్ను మించిన భక్తులా మీరు.! అంటూ.. అడ్డం పొడుగు మాట్లాడే కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు ఇస్తామని చెప్పిన వంద కోట్లలో ఒక్క దానికి కూడా పూర్తి స్థాయి నిధులు కేటాయించలేదు. అలా.. దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత.. కేసీఆర్‌కే దక్కింది. 2015 నుంచి 2022 దాకా రాష్ట్రంలో పేరుగాంచిన ప్రధాన ఆలయాలైన వేములవాడ, భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు ఆలయాలను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేశారు. 2015లో వేములవాడ రాజన్నను సతీసమేతంగా దర్శించుకున్న కేసీఆర్.. 3, 4 ఏళ్లలోనే
వేములవాడను టెంపుల్ సిటీగా డెవలప్ చేసి చూపిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు ఏటా రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తామని.. తక్షణమే 100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాజన్న ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మధ్యలోనే వదిలేశారు.
ఇక.. 2016లో శ్రీరామనవమిని పురస్కరించుకొని.. భద్రాచలం ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. కనీసం హుండీలో వంద కూడా వేయలేదనే విమర్శలున్నాయ్. ఆ తర్వాత.. భద్రాద్రి మాస్టర్ ప్లాన్ కూడా తయారుచేశారు. కానీ.. కేసీఆర్ దానిని పక్కన పెట్టేశారు. తెలంగాణ రాకముందు భద్రాచలం ఆలయం ఎట్లుందో.. ఇప్పుడూ అలాగే ఉంది.
2019లో సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్.. ఆలయ పునర్నిర్మాణానికి 100 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి 100 ఎకరాల స్థలం అవసరమవుతుందని కూడా ఆయనే చెప్పారు. కల్యాణ మండపంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ.. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఎంత మారింతో.. అందరికీ తెలుసు. 2019 ఆగస్టులో ధర్మపురి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్.. ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించారు. కానీ.. ఎన్ని కోట్లు మంజూరు చేశారో ఎవ్వరికీ తెలియదు.
Also Read: ఆ మాజీ ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని.. బీఆర్ఎస్ నేతపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆరోపణ
2022 డిసెంబర్‌లో జగిత్యాల బహిరంగ సభలో.. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. తానే స్వయంగా వచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతమైన పుణ్యక్షేత్రం నిర్మిస్తామన్నారు. తర్వాత కొండగట్టు మీద కొత్తగా ఓ షెడ్డు కూడా వేయలేదు.
ఇవే కాదు.. చాలా ఆలయాలకు కోట్లు ప్రకటించి.. కేటాయింని నిధులు చాలానే ఉన్నాయ్. బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి 50 కోట్లు ప్రకటించారు. అవి పూర్తిగా ఇవ్వలేదు. కొమురవెల్లి మల్లన్నకు 30 కోట్లు ప్రకటించారు. ఆ పనులు అసంపూర్తిగానే ఉన్నాయ్. కురవి వీరభద్ర స్వామికి 5 కోట్లు ప్రకటించారు. ఆ నిధులు.. పూర్తిగా ఇవ్వలేదు. ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయ అభివృద్ధికి 1500 కోట్లు ప్రకటించారు. కానీ.. బడ్జెట్‌లో జాడే లేదు. ఇలా.. ఆలయాల అభివృద్ధికి ఇంతిస్తాం.. అంతిస్తామంటూ.. ప్రకటించిన కేసీఆర్.. ఏకంగా దేవుళ్లనే మోసం చేశారు.