BigTV English

Adani Bribery US: అదానీ సోదరుడి కుమారుడిపై అవినీతి కేసు.. అధికారులకు రూ.2029 కోట్లు లంచం ఆఫర్!

Adani Bribery US: అదానీ సోదరుడి కుమారుడిపై అవినీతి కేసు.. అధికారులకు రూ.2029 కోట్లు లంచం ఆఫర్!

Adani Bribery US| భారతదేశంలో అత్యంత ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా లాంటి చాలా దేశాలకు విస్తరించి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో గౌతమ్ అదానీ సోదరుడి కుమారుడు సాగర్ అదానీపై అమెరికా ప్రభుత్వం బుధవారం నవంబర్ 20, 2024న అవినీతి కేసు నమోదు చేసింది. అమెరికాలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు అదానీ కంపెనీ కోసం చేజిక్కించుకునేందుకు రూ.2029 కోట్ల (265 మిలియన్ డాలర్లు) లంచం ఆఫర్ చేశారు. అమెరికాలో ప్రభుత్వ విద్యుత్ సరఫరా కంపెనీలతో కాంట్రాక్టు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారుల చేత అబద్దం చెప్పించేందుకు వారికి ఈ లంచం ఆఫర్ చేసినట్లు ఆధారాలున్నాయని న్యూయార్క్ నగర అటార్నీ తెలిపారు.


“అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి లక్షల కోట్ల రుణాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులు అదానీ కంపెనీ గురించి అసత్యాలు చెప్పించేందుకు 265 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూశారని ఆరోపణలున్నాయి” అని న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ అటార్నీ తరపున డిప్యూటీ అసిస్టెంట్ జెనెరల్ లీసా మిల్లర్ మీడియా సంస్థల ముందు ప్రకటించారు.

Also Read: లక్షల కోట్ల ఆస్తిని వదిలేసిన ఇన్పోసిస్ వారసుడు.. ఎందుకో తెలుసా.?


ఈ భారీ లంచం ఆరోపణల కేసులో మొత్తం ఏడుగురు నిందితులున్నారు. వారిలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతోపాటు, అదానీ గ్రీన్ ఎనర్జీ సిఈఓ వినీత్ జైన్, అదానీ చెందిన మరో కంపెనీ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ సిఈఓ రంజిత్ గుప్తా, అజూర్ పవర్ కంపెనీ చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులు రూపేష్ అగర్వాల్, సిరిల్ కాబేన్స్ (ఫ్రాన్స్, ఆస్ట్రేలియా పౌరుడు), కెనెడా పెట్టుబడిదారులు అయిన సౌరబ్ అగర్వాల్, దీపక్ మల్హోత్ర ఉన్నారు. వీరంతా 2020-22 మధ్య అధికారులతో జరిపిన సంభాషణల రికార్డులు ఆధారాలుగా ఉన్నట్లు తెలిసింది.

అయితే ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ కంపెనీల ప్రతినిధి త్వరలోనే ప్రకటన జారీ చేస్తారని తెలిపింది. అదానీ గ్రూప్ లో పనిచేసే ఒక ఉన్నతాధికారి స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొన్నవి అన్నీ ఆరోపణలు మాత్రమే అవి ఇంకా నిర్ధారణ కాలేదు. దోషులుగా తేలేవరకూ నిందితులందరూ నిర్దోషులే అని అన్నారు.

మరోవైపు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ బుధవారం గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సిరిల్ కబేన్స్ పై భారీ మొత్తం లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని న్యూయార్క్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసులో అదానీ కంపెనీ భారతదేశంలో చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణల ప్రస్తావన కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని రాష్ట్ర విద్యుత్ సరఫరా కంపెనీలతో ఈ తరహాలోనే భారీ ప్రాజెక్టులు చేజిక్కించుకున్నట్లు న్యూయార్క్ అటార్నీ అసిస్టెంట్ లీసా మిల్లర్ తెలిపారు. అదానీ గ్రూప్ కంపెనీ చైర్మన్ అయిన గౌతమ్ అదానీ  పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత గౌతమ్ అదానీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులతో 15000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ట్రంప్ నకు తెలయజేస్తూ.. ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అమెరికాలో అదానీ కంపెనీలపై అవినీతి కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. జనవరి 2023 నుంచి తమ పార్టీ ఇదే ఆరోపణలు చేస్తోందని.. మొదానీ (మోడీ + అదానీ) స్కాముల గురించి పార్లెమంటు జెపిసి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ జెనెరెల్ సెక్రటరీ జైరామ్ రమేష్ అన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×