PSL – IPL: టీమిండియా ( TEAM iNDIA) వర్సెస్ పాకిస్తాన్ (PAKISTHAN )మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం తమ దేశానికి రావాల్సిందేనని టీమిండియా పై ఒత్తిడి తెస్తోంది పాకిస్తాన్ జట్టు. కానీ తాము అసలు పాకిస్తాన్ కు వచ్చేది లేదని టీమిండియా ఇప్పటికే చెప్పేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలిని దెబ్బకొట్టేందుకు…. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PAKISTHAN CRICKET BOARD ) స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: Dhanashree Verma: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాహల్ భార్య ధనశ్రీ.. ఆ హీరోతో సినిమా ?
Also Read: Virat Kohli: కోహ్లీ సంచలన పోస్ట్.. అనుష్కకు విడాకులు అంటూ అభిమానుల ఆందోళన ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్కు పోటీగా పాకిస్తాన్ క్రికెట్ లీగ్ PSL ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరిగే సమయంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోందట. వాస్తవంగా ఐపిఎల్ వేలం 2025… ఈనెల 24, 25 తేదీల్లో జరగనుంది. ఇలాంటి… తరుణంలో మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) ప్రారంభమవుతుంది. 2025లో మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరగనుంది అన్నమాట.
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !
అయితే ఐపీఎల్ 2025 టోర్నమెంటు జరిగే సమయంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆలోచనచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో… నిర్వహించాలని అనుకుంటున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి సమయంలో ఛాంపియన్ ట్రోఫీ ఉండటంతో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) … ఎప్పుడు నిర్వహిస్తారో అప్పుడే… పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా నిర్వహించాలని అనుకుంటున్నారట.
Also Read: Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ..వీడియో వైరల్
ఆ దిశగా కొత్త కుట్రలు చేస్తున్నారట ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యులు. ఈ లీగ్ లో విదేశీ ప్లేయర్లను… బర్లోకి దింపనున్నారు. రెండు లీగ్ లు ఒకేసారి జరిగితే విదేశీ ప్లేయర్లకు ఏది ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎక్కువ సంపాదిస్తారు విదేశీ ప్లేయర్లు. విదేశీ ప్లేయర్లే కాకుండా మన టీమిండియా ప్లేయర్లు కూడా… ఐపీఎల్ ద్వారా బాగానే డబ్బులు అర్జిస్తున్నారు.
కాబట్టి ఐపీఎల్ జరిగేటప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL పెట్టుకున్నా… పాకిస్తాన్ ఎంత పెద్ద స్కెచ్… వేసినా కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( B C C I) వనికేది లేదని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. సింహం ముందు పిల్లి డాన్స్ చేయడమే అంటూ ఉన్నారు.