E-Paper
Advertisement

ఉత్తర తెలంగాణ నుండి గులాబీ యాత్ర.. కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఉత్తర తెలంగాణ నుండి గులాబీ యాత్ర.. కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?
Advertisement

BRS Strategy: గత ఎన్నికల్లో దూరమైన వర్గాలను దగ్గర చేసుకునే పనిలో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుందట. తమ హయంలో చేసిన మంచిని ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం కారణంగానే, కొన్ని వర్గాలకు దూరమయ్యామన్న భావనలో గూలబీ నాయకత్వం ఉందనే చర్చ నడస్తోంది. అందుకే గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, దూరమైన వర్గాలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీలపై గులాబీ ఫోకస్ పెట్టిందన్న టాక్ నడుస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వ్యూహాలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది గులాబీ పార్టీ. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆలోచనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉందనే టాక్ నడుస్తోందట. ఆ రిజర్వ్‌డు నియోజకవర్గాలకు సంబంధించి అధిక స్థానాల్లో విజయం సాధించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారంట. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గ పునర్విభజన జరిగి రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు కూడా గణనీయంగా పెరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కలతోనే ఎస్టీ, ఎస్సీ వర్గాలను దగ్గర చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారంట. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వెనబడి వర్గాల అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, డిక్లరేషన్ల విషయంలో వైఫల్యాలను వివరించి వారికి దగ్గర కావాలని బీఆర్ఎస్ హైకమాండ్ ప్లాన్ చేస్తోందని పార్టీ నేతలు అంటున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట. అందులో భాగంగానే భారీ సభలను నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నారంట.

అందరికి అందక పోవడం..

Advertisement

దళిత, గిరిజన వర్గాలు మొదట్లో గులాబీ పార్టీకి అండగా నిలిచినట్లు కనిపించినా, 2023 ఎన్నికల్లో పూర్తిగా దూరం జరిగాయన్న విశ్లేషణలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో ఎస్సీ, ఎస్టీలు కూడా కీలక భూమిక పోషించారని పార్టీ సర్వేల్లోనూ స్పష్టమైందంట. దళిత బంధును పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను హామీ మేరకు అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలు సైతం అందరికి అందకపోవడంతో.. తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో స్పష్టమైందంట. ఆర్భాటంగా ప్రకటించిన సంక్షేమ పథకాల అమలులో కొంతమందికే పెద్దపీట వేశారని, ఎమ్మెల్యేలకే దళితబంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యత అప్పగించడంతో.. వారు ఆ పథకాన్ని తప్పుతోవ పట్టించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అసలే దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. లబ్దిపొందిన అరకొర మంది కూడా ఎమ్మెల్యేల వర్గీయులే అన్న టాక్ ఉంది. దాంతో గ్రామస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వచ్చిందంట.

Also Read: 2018లో అంతరిక్షంలోకి వదిలిన టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? ఏమైంది?

అధికారమే లక్ష్యంగా..

Advertisement

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై ఆ ప్రభావం గట్టిగానే పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో కేవలం 7 నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ విజయం సాధించగలిగింది. సుమారు 24 నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో అధికారం కోల్పోవల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న బీఆర్ఎస్.. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ఇప్పటి నుంచే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందంట. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అన్నట్లు ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ మోసం చేసిందని బురద జల్లడానికి గులాబీ నేతలు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారంట. కాంగ్రెస్ చేసిన చేవెళ్ల డిక్లరేషన్ పచ్చి మోసమని ప్రతి గిరిజన తండాకు, ప్రతి దళితవాడకు తెలియజేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతుందట. త్వరలోనే జిల్లాల్లో సభలు పెట్టేం దుకు సన్నద్దమవుతన్నట్లు తెలుస్తోంది. ఆయా సభల్లో డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే అంశాలను వివరించబోతున్నారట.

ఆ యాత్రలు చేస్తారా..?

మరోవైపు దళిత వర్గాలోని సీనియర్ నేతలతో ప్రచార యాత్రలకు సైతం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచే యాత్ర ప్రారంభించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ జిల్లాల్లో ఎస్సీ నియోజకవర్గాలు 19, ఎస్టీ 12 ఉండటంతో చెన్నూరు నుంచి బీఆర్ఎస్ ప్రచారయాత్రకు శ్రీకారం చుట్టనున్నారంట. ఉత్తర, దక్షిణ తెలంగాణలో రెండు బృందాలతో ఆ యాత్రలు చేస్తారా? లేకుంటే ఒకే బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల వరకు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తారా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ దళిత, గిరిజనులపై ఫోకస్ పెట్టి బీఆర్ఎస్ వేస్తున్న ప్లాన్లు ఎంత వరకు వర్కౌట్ అవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read: సొంత జిల్లాలో సీన్ రివర్స్.. బోత్సకు పీడకలగా మారిన కిమిడి నాగార్జున..?

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×