తిరుపతిలో రాజకీయాలు మరోసారి రంజుగా మారనున్నాయి. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక.. క్యాంపు రాజకీయాలకు వేదికగా మారిందనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు డిప్యూటీ మేయర్ పదవికి అభినయరెడ్డి రాజీనామా చేశారు. పిబ్రవరి మూడో తేదీన డిప్యూటీ మేయర్ ఎంపికకు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. వారిని క్యాంపునకు తరలించే యత్నాలు సాగుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని వైసీపీ ప్రకటించగా.. కూటమి నుంచి TDPకి చెందిన మునికృష్ణయ్య అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారని సమాచారం. రహస్య ఓటింగ్ ఉండాలని కూటమి నేతలు అడిగుతుంటే.. చేతులెత్తి ఎంపిక చేయాలంటూ వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.
వైనాట్ 175 నివాదంలో గత ఎన్నికల్లో జనాల్లోకి వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. తర్వాత కాలంలో చాలాచోట్ల.. వైసీపీ నుంచి కూటమి వైపు నేతలు జంప్ కొట్టారు. అవకాశం ఉన్నవారు తెలుగుదేశంలో చేరగా.. కొందరు మాత్రం జనసేన, బీజేపీకి దగ్గరయ్యారు. కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం సెలైంట్‌గా ఉన్నారు. మరోవైపు.. ఎన్నికల తర్వాత వైసీపీకి పలువురు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్‌లో భరోసా నింపేందుకు జగన్ తీవ్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనంటూ శ్రేణుల్లో ధైర్యం నింపేయత్నం చేస్తున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఎన్నికల్లో గెలుపు మాత్రం మాదేనంటూ కూటమి నేతలు ధీమాతో ఉన్నారట. దీంతో.. అధికార పార్టీ నేతలు ఎలాంటి ఎత్తుగడ వేస్తారోననే భయంలో ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఉందట.
2019 ఎన్నికల్లో గెలిచాక.. వైసీపీ అధికారం చేపట్టింది. అందులో భాగంగా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలో ఇద్దరు డిప్యూటీలను పెట్టారు. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా డిప్యూటీ మేయర్లుగా ముద్రా నారాయణ, డిప్యూటీ-2 గా వైసీపీ యువనేత భూమన కరుణాకర్ రెడ్డి కూమారుడు అభినయ్ రెడ్డిని ఎంపిక చేశారు. పేరుకు మేయర్ అయినా.. పెత్తనం మొత్తం అబినయ్‌దే నడిచిందనే టాక్ అప్పట్లో నడిచింది. అనేక విషయాల్లో అభినయ్‌రెడ్డి వివాదాల్లో ఇరుక్కున్నారట. మాస్టర్ ప్లాన్ రహదారులు, డబుల్ డెక్కర్ బస్సు కొనుగోళ్ల అంశాలతో ఆయన వివాదంగా మారారనే చర్చి సాగింది. 2024 శాసనసభ ఎన్నికలలో తిరుపతి నుంచి MLA అభ్యర్థిగా పోటీ చేయడానికి వీలుగా.. డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ పదవికి అభినయ్ రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అభినయ్ సైలెంట్ అయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగిన సమయంలో.. 50 స్థానాలకు గానూ.. 49 చోట్ల ఎన్నికలు జరిగాయి.. అక్కడ నామినేషన్ల తిరస్కరణతో సగానికి పైగా ఏకగ్రీవం అయ్యాయని.. అప్పట్లో తెలుగుదేశం నేతలు ఆరోపణ చేశారు. ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణయ్య గెలిచారు. ఒక స్థానంలో నామినేషన్ పత్రాల తిరస్కరణపై.. కోర్టుకు వెళ్ళడంతో ఎన్నిక ఆగింది. వారిలో ఒకరు మరణించారు.ఒక రాజీనామాతో మొత్తం మూడు కార్పొరేటర్లు ఖాళీగా ఉన్నాయి. అయితే.. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి అన్నా రామచంద్రయ్య కుటుంబంలో.. ఇద్దరు కార్పొరేటర్లతో పాటు మరో నలుగురు.. తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మరో నలుగురు జనసేనలోకి జంప్ అయ్యారు.
Also Read: వైసీపీకి కోలుకోలేని దెబ్బ.. కంబ్యాక్ కోసం జగన్ తంటాలు
ఫలితాల తర్వాత డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముద్ర నారాయణతో పాటు నరసింహాచారి అనే కార్పోరేటర్.. సిద్దారెడ్డి గ్రూపుతో కలసి టీడీపీలో చేరడానికి చర్చలు జరిపారట. ఐతే.. వారి రాకను తెలుగుదేశం నేతలు వ్యతిరేకించడంతో ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వాయిదా వేశారు. ఎవరైతే.. కరుణాకర్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చారో.. వారు మాత్రం ప్రస్తుతానికి వైసీపీకు దూరంగా ఉన్నారట. మొత్తం మీద వైసీపీ బలాన్ని చూస్తే.. ఎక్స్ అఫీషియో మెంబర్లైన.. MLC, ఎంపీతో పాటు 30 మంది ఉన్నారు. దీంతో విజయం మాదే అనే ధీమాలో ఫ్యాన్ పార్టీ ఉందట. ఆ లెక్కలతోనే 42 డివిజన్‌కు చెందిన కార్పొరేటర్.. శేఖర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పాటు క్యాంప్ రాజకీయాలకూ తెరలేపారట. దీనిలో భాగంగా గోవా, పాండిచ్చేరి ట్రిప్‌తో పాటు ప్రతి ఒక్కరికీ.. పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. కూటమి నేతలు మాత్రం తమదే.. డిప్యూటీ మేయర్ పీఠం అని ధీమాతో ఉన్నారట. మేయర్ పీఠం పై కన్నేసిన అన్నా రామచంద్రాయ్య.. తన కూమార్తెల్లో ఒకరిని మేయర్ చేయాలని చూస్తున్నారు. ముందుగా డిప్యూటీ మేయర్ గా కూటమి అభ్యర్థిని గెలిపిస్తే.. సులభంగా తన కూమార్తె.. మేయర్ అవుతుందని యోచనలో ఆయన ఉన్నారట. గత ఎన్నికలలో కూటమి తరుపున గెలిచిన ఒకే ఒక్క కార్పొరేటర్.. ముని క్రిష్ణయ్యను మేయర్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఈ అంశాన్ని వివాదం చేసి.. రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలోనే మంత్రి అనగాని సత్య ప్రసాద్ తిరుపతికి పరిస్థితిని సెట్ చేస్తారని అంటున్నారు.
కూటమి నేతలు ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాకముందే.. వైసీపీ మాత్రం తన పని తాను చేసుకుపోతోందని పాలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పోయిన మర్యాదను కాపాడుకోవటం సహా జనం నుంచి సింపతీ పొందడానికే హడావిడి చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి తోడు భూమన విడుదల చేసిన వీడియో కూడా సంచలనంగా మారిందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
మొత్తం వ్యవహారంలో కూటమి నేతలు ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నా.. వైసీపీ మాత్రం ముందే కూసిన కోయిలా పరిస్థితి మారిందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఫిబ్రవరి 3న జరిగే డిప్యూటీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ.. అటు ఉమ్మడి జిల్లాతో పాటు ఇటు రాష్ట్రంలోనూ నెలకొంది.