BigTV English

Walking After Eating: తిన్న తర్వాత 15 నిమిషాలు నడిస్తే.. మతిపోయే లాభాలు

Walking After Eating: తిన్న తర్వాత 15 నిమిషాలు నడిస్తే.. మతిపోయే లాభాలు

Walking After Eating: భోజనం తర్వాత 15 నిమిషాల నడక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల కూడా బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జనరల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని రుజువైంది.


నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ఫిట్‌గా ఉండటం చాలా కీలకం. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టడం చాలా అవసరం అని చాలామంది నమ్ముతారు. కానీ నిజం ఏమిటంటే ఒక చిన్న అలవాటు కూడా మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. భోజనం తర్వాత కేవలం 15 నిమిషాల నడక బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి ప్రతి రోజు తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ క్రియ మెరుగుదల:
భోజనం తర్వాత నడవడం వల్ల కడుపు, ప్రేగుల పనితీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది మెరుగైన జీర్ణక్రియకు దారితీస్తుంది. ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.


రక్తంలో చక్కెర నియంత్రణ:
పరిశోధనల ప్రకారం, భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడం వల్ల మధుమేహ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బరువు తగ్గడం కోసం వాకింగ్ :
తిన్న తర్వాత నడవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీరు మీ బరువును నియంత్రించుకోవాలనుకుంటే భోజనం తర్వాత నడవడం అలవాటు చేసుకోండి. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా అదనపు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

గుండె ఆరోగ్యం:
భోజనం తర్వాత నడవడం వల్ల రక్తపోటును నియంత్రించబడుతుంది. అంతే కాకుండా సమతుల్య కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ గుండెను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.

మెరుగైన నిద్ర:
రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది మీరు హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.

Also Read: 30 ఏళ్ల తర్వాత ఇలా చేస్తే.. ఫిట్‌గా ఉంటారట !

గమనించవలసిన అంశాలు:

తిన్న తర్వాత నడిచినప్పుడు మీరు పొత్తికడుపులో అసౌకర్యాన్ని అనుభవిస్తే, మీ నడకను తిరిగి ప్రారంభించే ముందు 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

నెమ్మదిగా నడవండి. క్రమంగా టైం , వేగాన్ని పెంచండి.
ఎక్కువగా తిన్నప్పుడు భోజనం తర్వాత చాలా వేగంగా నడవకూడదు.
భోజనం తర్వాత 15 నిమిషాల నడక అనేది మీ మొత్తం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచే ప్రభావవంతమైన అలవాటు. ఇది జీర్ణక్రియ నుండి గుండె ఆరోగ్యం, లనిద్ర వరకు అనేక ప్రయోజనాలను అందించే సులభమైన మార్గం. కాబట్టి ఈరోజు నుండే ఈ మంచి అలవాటును అలవర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి!

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×