BigTV English
Advertisement

Govt Officers: మేం లోకల్.. కూటమి నేతల్ని లెక్క చేయని అధికారులు..!

Govt Officers: మేం లోకల్.. కూటమి నేతల్ని లెక్క చేయని అధికారులు..!

Chittoor Dist Govt Officers: మేము శాశ్వతం.. మీరు తాత్కాలికం.. అందుకే మీరు చెప్పే సలహాలు సూచలను మాకు అవసరం లేదని చిత్తూరు జిల్లా అధికారులు కూటమి నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారంట. మీ సిఫార్సులు మాకు అసలు అక్కరలేదు.. మాకు సీఎం ఒక్కరి అశీస్సులు ఉంటే చాలు.. మిగతా వారితో సంబందం లేదంటూ నాయకుల మాటలను అసలు లెక్క చేయడం లేదంట. అంతా మా ఇస్టం అన్నట్లు వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లాలోని ఉన్నతాధికారులు అసలు కూటమి నేతలను లెక్క చేయడం లేదంట. దాంతో అసలు తాము అధికారంలో ఉన్నామా? అన్న సంశయం కలుగుతోందంట అధికారపక్షాల నేతలకి.


అధికారుల తీరుపై సీరియస్ అవుతున్న టీడీపీ నేతలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసీపీ హాయంలో పనిచేసిన అఖిల భారత సర్వీసు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వారు కూటమి ప్రభుత్వం అంటే లెక్క లేనట్లు వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉందని నాయకులు వాపోతున్నారట. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వ్యవహారిస్తున్న తీరుతో అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదని క్యాడర్ వాపోతోంది. సీఎం వచ్చినప్పుడు మాత్రం తల ఊపి తర్వాత తమదైన రీతిలో ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎంఓలోని కొంతమంది అధికారుల సహకారంతో వారు ఆడింది అట పాడింది పాటగా తయారైందంట.


ఎస్పీపై విమర్శలు చేసిన అమర్‌నాథ్ రెడ్డి

చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తీరుపై బహిరంగంగా విమర్శలు చేసారు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి. పుంగనూరులో టిడిపి కార్యకర్త రామకృష్ణను వైసీపీ కార్యకర్తలు, నాయకులు కలసి హత్య చేశారు. దానిపై అమర్‌నాథ్ మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఇప్పటికి వైసీపీ తొత్తులుగా ఉన్న పోలీసులను కొనసాగిస్తున్నారని విమర్శించారు. దాన్ని మనసులో పెట్టుకొని ఎస్పీ ఏకంగా వందలాది పోలీసులను ఇష్టానుసారం బదిలీలు చేసారని తాజాగా అమర్నాథ్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని బదిలీ చేయమంటే అందరిని బదిలీ చేసి వారి పెళ్ళాం పిల్లల చేత తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫార్సులు బుట్ట దాఖలు

బదిలీల సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధుల ఇచ్చిన సిఫార్సులను బుట్ట దాఖాలు చేసారట. క్షేత్ర స్థాయిలో డిఎస్పీ, సీఐలను కనీసం వారి గురించి ఏమాత్రం డేటా తీసుకోకుండా నాలుగు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల స్టాండింగ్ పేరుతో బదిలీ చేశారని, దాంతో పాటు మహిళ పీఎస్‌లో రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని తీసుకెళ్ళి సమస్యాత్మక స్టేషన్‌లకు పంపారంట. మొత్తం మీదా కావాలనే టిడిపికి చెడ్డ పేరు వచ్చే విధంగా అయన చేశారని అంటున్నారు.

చెవిరెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు

జిల్లాలో రెవెన్యూతో పాటు ఇతర శాఖలలో కూడా ఇదే పరిస్థితి ఉందంట. గత ప్రభుత్వంలో కీలక శాఖలలో కొనసాగిన వారికి ఇన్ చార్జ్ బాధ్యతలు ఇచ్చి కొనసాగిస్తున్నారంట. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇచ్చారని ఒక ఎమ్మెల్యే సీఎంఓ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంట. అదే విధంగా తిరుపతి నగరపాలక సంస్థలో కమిషనర్ కూటమి నేతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసారట. గతంలో డిప్యూటేషన్ పై వచ్చిన నగర పాలక సంస్థ డిప్యూటి కమిషనర్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

కూటమి నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని జాయింట్ కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్ కూటమి నేతలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదంటున్నారు. తంబల్లపల్లి, మదనపల్లిల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు దందాలకు పాల్పడుతున్నారనే అరోపణలు ఉన్నాయి. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు కొంతమంది అధికారుల తీరుతో విసిగి పోతున్నామని కార్యాకర్తలు వాపోతున్నారు. వారందరు సిఎంఓ తమకు అండగా ఉందని అంటున్నారట. నాయకుడు ఎవరైనా ప్రశ్నిస్తే సిఎంఓలోని ఓ అధికారి పేరు చెబుతున్నారంట. గతంలో తిరుపతి నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ఎంపికలో టిడిపికి చెందిన న్యాయవాదికి కాకుండా మరో వ్యక్తి కి ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పుడు నిలదీస్తే కమిషనర్ సిఎంఓలోని ఒక అధికారి పేరు చెప్పి బెదిరించారంట.

వైసీపీ నానుభూతిపరులా పనిచేస్తున్న ఆర్డీఓలు

గతంలో డిప్యూటేషన్ మీద వచ్చిన అర్డీఓలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. వారంత వైసీపీ సానుభూతిపరులన్న ఆరోపణలున్నాయి. చివరకు పదవి విరమణ పొందిన అధికారిని సైతం సలహాదారుగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన వారిని బయటకు పంపడానికి మీనామేషాలు లెక్కిస్తున్నారట. మొత్తం మీద ఎన్నికలలో తాము కష్ట పడి పనిచేసామా? లేకా అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేసారా అని నాయకులను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. మరో వైపు గత 9నెలలుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నాయకులు గళం విప్పడానికి సిద్ధమవుతున్నారట. అత్మాభిమానం చంపుకుని అధికారుల పెత్తనంలో బతకడం కంటే రాజకీయాలకు దూరం కావడం మేలని చాలామంది సీనియర్ కార్యకర్తలు, పార్టీ అవిర్బావం నుంచి పనిచేసిన వారు అభిప్రాయపడుతున్నారు.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×