IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… జరుగుతున్న మ్యాచ్లు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ లో పూర్తి అయ్యాయి. ఇవాళ మరో మ్యాచ్ కూడా జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్ల్లో హై స్కోరింగ్, అదే సమయంలో ఉత్కంఠ భరిత మ్యాచ్ లు జరిగాయి. ఈ తరుణంలోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన పాయింట్స్ టేబుల్ కూడా వైరల్ గా మారింది.
Also Read: PBKS VS GT: సాయి సుదర్శన్ పోరాటం వృధా.. పంజాబ్ తొలి విజయం
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ దే పై చేయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇప్పటివరకు ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడింది. 10 జట్లు ఉంటే.. ఒక్క టీంకు ఒక్క మ్యాచ్ జరిగినట్లే. ఇక ఈ తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన పాయింట్ల పట్టిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఒక్క మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ టీం… మొదటి మ్యాచ్ గెలుచుకొని రెండు పాయింట్లు సాధించింది. అలాగే 2.20 నెట్ రన్ రేట్ తో దూసుకు వెళ్తోంది సన్రైజర్స్ హైదరాబాద్.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పైన గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు పాయింట్లు తో పాటు 2.14 రన్ రేట్ కలిగి ఉంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తర్వాత పంజాబ్ కింగ్స్ నిన్నటి మ్యాచ్ విజయంతో టాప్ 3కి వచ్చింది. నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టు చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ రెండు పాయింట్లు తో పాటు 0.55 రన్ రేట్ కలిగి ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జటను దాటి మూడవ స్థానానికి ఏగబాకింది.
ఇక పంజాబ్ కింగ్స్ జట్టు తర్వాత నాలుగవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్… రెండు పాయింట్లు తో పాటు 0.49…. రన్ రేట్ కలిగి ఉంది ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో నిలిచింది. లక్నో జట్టు పైన గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండు పాయింట్లు తో పాటు 0.37 రన్ రేట్ కలిగి ఉంది.
ఓడిపోయిన ఐపీఎల్ జట్లు
లక్నో సూపర్ జెంట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు… ఒక్కో మ్యాచ్ ఓడిపోయి చివరన నిలిచాయి. ఈ ఐదు జట్లు మైనస్ రన్ రేట్ కలిగి ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం పదవ స్థానంలో నిలిచింది.