OTT Movie : ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా, చాలా ప్రాంతాలలో కనీస వైద్య సౌకర్యాలు లేవు. కొండ ప్రాంతాలలో ఇది మరీ దారుణంగా ఉంటుంది. వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి స్టోరీ నే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఈ మూవీ నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక డాక్టర్ కోసం ఆ గ్రామ ప్రజలు ఏమి చేశారనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime video) లో
2023 ఓ వచ్చిన ఈ తమిళ డ్రామా మూవీ పేరు ‘నాడు’ (Naadu). దీనికి ఎం. సరవణన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కొల్లి హిల్స్ అనే పర్వత ప్రాంతంలో జరిగే, ఒక వాస్తవ సంఘటన నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమాలో తార్షన్ తియాగరాజ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘నాడు’ కథ కొల్లి హిల్స్‌లోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలో ఆసుపత్రులు, వైద్యులు అందుబాటులో ఉండవు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఉన్నప్పటికీ, ఇక్కడ పరిస్థితుల కారణంగా ఎవరూ అక్కడ వైద్యుడిగా పనిచేయడానికి ఇష్టపడరు. దీని వల్ల గ్రామస్తులు వైద్య సహాయం కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. చివరికి గ్రామస్తులు ఇందుకోసంఎం చేశారన్నదే ఈ స్టోరీ. అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడంతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఆమెకు కాలేజ్ లో జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించినప్పటికీ, వైద్య ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతుంది. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సంఘటన గ్రామానికి వైద్య సహాయం లేని దుస్థితిని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో, డాక్టర్ శోభన అనే ఒక అమ్మాయి, నగరంలో చదువుకుని వైద్యురాలిగా ఈ గ్రామంలోని PHCకి బదిలీ అవుతుంది. ఆమె సిటీ జీవనశైలికి అలవాటుపడిన వ్యక్తి కావడంతో, ఈ గ్రామీణ వాతావరణం ఆమెకు పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. మొదట్లో ఆమె ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లాలని అనుకుంటుంది, కానీ గ్రామస్తులు ఆమెను మాటల్లో పెట్టి, అక్కడే ఉండేలా చేయడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. అదే గ్రామంలో మారి అనే ఒక యువకుడు, తన సోదరి మరణం తర్వాత గ్రామానికి వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళతాడు.
శోభనను అక్కడే ఉండటానకి గ్రామస్తులు ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆమెకు పెళ్ళికూడా కుదరడంతో అక్కడినుంచి వెళ్లాల్సిన పరిస్తితి వస్తుంది. గ్రామస్తులు ఇప్పుడు ఒక పధకం వేస్తారు. ఆమెను ప్రేమలో పడేసి,పెళ్లిచేసుకుంటే పొలం బహుమతిగా ఇస్తామంటూ చెప్తారు. అక్కడ ఉన్న యువకులు ఈ ప్రయత్నంలో ఉంటారు. శోభన క్రమంగా గ్రామస్తుల జీవన విధానాలకు అలవాటు పడుతుంది. వారి కష్టాలను అర్థం చేసుకుని వారికి సేవ చేయాలనే ఆలోచన వస్తుంది. చివరికి ఆమె గ్రామంలో ఉంటుందా ? ఆ గ్రామస్తుల కష్టాలు తీరుతాయా ?అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ‘నాడు’ (Naadu) అనే ఈ మూవీని చూడండి.