E-Paper
Advertisement

CM Chandrababu warns MLAs: ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం

CM Chandrababu warns MLAs: ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం

CM Chandra Babu warns MLAs:  దారి తప్పుతున్న ఎమ్మెల్యేలను సెట్ రైట్ చేయాల్సింది ఇంచార్జ్ మంత్రులే. 50 వేల మెజార్టీ వచ్చింది కదా అని సైలెంట్ గా ఉంటే వచ్చే ఎన్నికల్లో 10 వేల మెజార్టీ కూడా రాదు. వచ్చే కేబినెట్ నాటికి అంతా సెట్ కావాల్సిందే. లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇది కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన క్లాస్. ఎమ్మెల్యేలు చెబితేనే పనులు అవుతున్నాయని.. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పొలిటికల్ గవర్నెన్స్ కు అర్థం మార్చేస్తున్నారంటూ పవన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు వరుసగా క్లాస్ లు తీసుకుంటున్నప్పటికీ.. ఎమ్మెల్యేల పనితీరులో ఎందుకు మార్పు రావట్లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఎమ్మెల్యేలపై సీఎం తీవ్ర అసహనం

ఎస్.. కూటమి ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనంగా ఉన్నారట. ఎన్నిసార్లు చెప్పినా వినారా.. ఇక మారరా అని మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్వహించిన మీటింగ్ లో ఘాటుగా కామెంట్ చేశారట.
కేబినెట్ మీటింగ్ తర్వాత జరిగిన మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై.. పాలనాపరమైన సమన్వయం లోపం, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల జోక్యం వంటి అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలతో చర్చ ఊపందుకుంది.

పొలిటికల్ గవర్నెన్స్ లక్ష్యంపై ఆందోళన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదేపదే చెబుతున్న పొలిటికల్ గవర్నెన్స్ లక్ష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆందోళనను సీఎం చంద్రబాబు ముందుంచారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయన్నారు. దానిని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్‌కు.. ప్రజాపాలనకు అర్థం మారిపోతుందన్నారట. ఎమ్మెల్యేల జోక్యం కారణంగా పరిపాలనా యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పరోక్షంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారట. పార్టీల ప్రాధాన్యత కంటే ప్రజలకు సేవ చేయడమే ప్రధాన ఎజెండాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారట.

సీఎం గట్టి చర్యలు తీసుకోవాలని కోరిన పవన్

కేబినెట్ అజెండాలో కీలకమైన రెవెన్యూ సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చ వచ్చినప్పుడు, పవన్ కల్యాణ్ మరింత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారట. రెవెన్యూ వివాదాలు, ముఖ్యంగా భూవివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారట. ఈ తరహా జోక్యం సమస్యల పరిష్కారాన్ని అడ్డుకుంటుందని, దీనిపై సీఎం గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారట. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలోని సుమారు 60 నుంచి 70 శాతం సమస్యలు రెవెన్యూ వివాదాలేనని, వాటిని పరిష్కరించకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై చులకన అవుతామని పవన్ స్పష్టం చేశారట.

అత్యుత్సాహం గురించి ప్రస్తావన

ఈ సందర్భంగానే కొందరు ప్రజాప్రతినిధుల అత్యుత్సాహం గురించి ప్రస్తావించినట్టు చర్చ జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల ఆస్తిలో అడ్డంగా తల దూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. కొన్ని వివాదాల్లో బాధితులు రాజీ కుదుర్చుకుందామని వేడుకుంటున్నా… ఆ ఎమ్మెల్యేలు దానికి అడ్డుపడుతున్నారని పవన్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లారట. అలా వ్యవహరించిన ఒక ఎమ్మెల్యేను తాను స్వయంగా మందలించానని గుర్తుచేసినట్టు సీఎం చెవిలో వేశారట. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే విడిచి పెట్టొద్దని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని పవన్ …ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.

క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్న సీఎం

పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పాలనలో మెరుగుదలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేస్తుంటే, వారిని సరిదిద్దే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నాయకత్వంలో 400 రెవెన్యూ సమస్యలను పరిష్కరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.50,000 మెజార్టీ వచ్చింది కదా సైలెంట్ గా ఉంటే…వచ్చే ఎన్నికల్లో 10వేల ఓట్లు కూడా రావని చెప్పిన చంద్రబాబు..

అసెంబ్లీలో అనుచిత చర్యలు, పెరోల్ సిఫార్సులు

కేబినెట్ మీటింగ్ లోనో.. లేక ఆ తర్వాత మంత్రుల వద్ద సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరును ప్రస్తావించడం ఇది మొదటి సారి కాదు. గతంలోను ఇలాంటి ఆదేశాలే సీఎం చంద్రబాబు జారీ చేశారు. ఆగస్టు 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుచిత చర్యలు, పెరోల్ సిఫార్సులు, ఇతర వివాదాల్లో చిక్కుకున్న సంఘటనలు ఈ చర్చకు దారితీశాయి. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. గుంటూరు ఈస్ట్, అనంతపురం అర్బన్, అమదలవాలస, శ్రీశైలం, నెల్లూరు రూరల్, గూడూరు మొదలైన నియోజకవర్గాల ఎమ్మెల్యేల విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇక, అక్టోబర్ 3న జరిగిన మరో సమావేశంలో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు, ప్రవర్తనలపై ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, క్రమశిక్షణ కాపాడాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోతే ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగుతుందన్నారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశాలు

రెండు రోజుల క్రితం పార్టీ కార్యక్రమాల అమలుపై జరిపిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. 48 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనే సమాచారం ఉందన్నారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యక ర్తల బీమా లేఖలు ఇంకా అందజేయని శాసనసభ్యుల వివరాలు తనకు ఇవ్వాలని, పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి తాను క్రమం తప్పకుండా హాజరవుతున్నానని, అయినా పలువురు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాలకు గైర్హాజరు అవతుండటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా నాయకులూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయ కులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోనని హెచ్చరించారు.

ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు

పార్టీ, ప్రభుత్వ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఒకటికి రెండు సార్లు చెప్పి చూస్తున్నారు. అవకాశాలు కల్పిస్తున్నారు. మారేందుకు సమయం ఇస్తున్నారు. ఆ విషయం వారు కనిపెట్టి తమను తాము మార్చుకుంటే.. చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని వారిపై తమ అభిప్రాయం మార్చుకుంటారు. తమ సొంత బలంతోనే గెలిచామని అనుకునేవారికి.. ముందుగానే ఆ బలంతోనే.. రాజకీయాలు చేసుకోమని బయటకు తోసేసే అవకాశాలు ఉన్నాయట. చంద్రబాబు గురించి బాగా తెలిసిన సీనియర్లు ఇది కరెక్టే అంటున్నారట. ఓవరాల్ గా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల తీరు మారకపోవడంపై సీఎం చంద్రబాబు పదేపదే సీరియస్ అవుతున్నా, పరిస్థితి మారడం లేదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఎప్పటికప్పుడు షాట్ రిపోర్టులను తెప్పించుకుంటూ, పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కేబినెట్‌లో లేవనెత్తిన ఈ అంశాలు, కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకుంటున్న ఇంటర్నల్ చర్యల్లో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు.

Story by Venkatesh, Big Tv

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×