BigTV English

CM Chandrababu: మహిళలకు బాబు సర్కార్ గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు డేట్ ఫిక్స్

CM Chandrababu: మహిళలకు బాబు సర్కార్ గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సు డేట్ ఫిక్స్

CM Chandrababu: సర్క్యులర్ ఎకానమీ.. జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌.. ప్రాజెక్టులు, పోర్టులు.. ఇలా అనేక అంశాలపై రివ్యూలతో పాటు.. కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అంతేకాదు ఆపరేషన్‌ సిందూర్ కొనసాగుతున్న సమయంలో జవాన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు పథకాల అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ కీ డెసిషన్ తీసుకుంది. అవెంటో చూద్దాం.


12-05-2025 (సోమవారం) ( సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు )
సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలో సైనికుల ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుత సైనికులకు మాత్రమే కాకుండా, ఇప్పటికే పదవీ విరమణ పొందిన సైనికులు, వారి కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ నిర్ణయం వర్తించనుంది. గతంలో ఆర్మీ అనే పదం స్థానంలో డిఫెన్స్‌ అనే పదాన్ని చేర్చింది.

12-05-2025 (సోమవారం) ( ధైర్య సాహసాలకు గుర్తుగా.. )
అమరవీరుడు మురళీ నాయక్ ధైర్య సాహసాలకు గుర్తుగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భావితరాలకు స్పూర్తి కలిగించేందుకు, మురళీనాయక్ మెమోరియల్‌తో పాటు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.


13-05-2025 (మంగళవారం) ( ప్రాజెక్టులు, పోర్టులపై రివ్యూ)
ఏపీ తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏపీలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మితవుతున్న పోర్టుల స్థితిగతులపై చర్చించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్‌, గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌తో కలిపి అభివృద్ధి చేస్తామన్నారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాల భూమి అవసరం అవుతుందని.. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు.

13-05-2025 (మంగళవారం) ( హార్టికల్చర్‌పై రివ్యూ )
ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలన్నారు సీఎం చంద్రబాబు. హార్టీకల్చర్‌పై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ఆదేశించారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ పామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడిమామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి వంటి 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు సీఎం చంద్రబాబు.

13-05-2025 (మంగళవారం) ( డేటా లేక్‌ ఏర్పాటు చేయాలి )
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే అన్ని విభాగాల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బృందం ఉండాలని, AI ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా నుంచి అమ్మకం వరకు రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేయాలని చెప్పారు.

14-05-2025 (బుధవారం) ( పశుసంవర్థకశాఖ టెక్ ఏఐ 2.0 )
విజయవాడలో నిర్వహించిన పశుసంవర్థకశాఖ టెక్‌ ఏఐ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పశుసంవర్థకశాఖ, గ్లోబల్ ఫోరమ్‌ ఫర్‌ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంయుక్తంగా ఈ కాన్‌క్లేవ్‌ను నిర్వహించాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పశుసంవర్ధకానికి దోహదపడుతున్న వారితో మాట్లాడటం బాగుందన్నారు చంద్రబాబు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్‌లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు.

14-05-2025 (బుధవారం) ( ఆర్థిక తోడ్పాటు )
గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు తక్షణమే ఆస్తి, ఇంటి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. బీసీల్లో కులవృత్తులు తగ్గిపోయాయని, యాదవ, కురబలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకల పెంపకం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని 2029 వరకు పొడిగించేందుకు కేంద్రంతో మాట్లాడతానన్నారు సీఎం.

14-05-2025 (బుధవారం) ( పథకాల క్యాలెండర్ )
జూన్ 12న పిల్లల స్కూల్స్ తెరిచే ముందే, తల్లికి వందనం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేసేందుకు ఏర్పాటు చేశారు. త్వరలోనే ఏ నెలలో ఏ పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియ చేస్తూ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ని రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

15-05-2025 (గురువారం) ( సర్క్యులర్ ఎకానమీపై రివ్యూ )
స్వచ్చాంధ్ర.. సర్క్యులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్‌లోనూ, అలాగే జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి.. చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో, లేదా అక్కడ నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదని చెప్పారు. వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు.

15-05-2025 (గురువారం) ( లక్ష్యం.. జీరో వేస్ట్‌ )
జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి పంచాయతీలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని ఆదేశించారు. వ్యవసాయ వ్యర్ధాలతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్ధాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ రూపొందించాలని.. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్‌ మోడల్‌ను పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు.

15-05-2025 (గురువారం) ( SIPBపై కీలక నిర్ణయాలు )
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 6వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 33 వేల కోట్లకు పైగా విలువైన 19 ఇండస్ట్రీయల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉండనున్నాయి. వీటి వల్ల దాదాపు 35 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా.

16-05-2025 (శుక్రవారం) ( తిరంగా ర్యాలీ)
ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైన సందర్భంగా తిరంగా ర్యాలీని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు కొనసాగిన ఈర్యాలీలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉగ్రవాదులు ఎవ్వరూ దేశంలో అడుగుపెట్టినా.. వారికి అదే చివరి రోజన్నారు చంద్రబాబు. ఆపరేషన్ సిందూర్ అనేది ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక అని.. దేశం కోసం మనమంతా ఏకం కావాలన్నారు చంద్రబాబు. మహిళల సిందూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ నిరూపించిందన్నారు.

16-05-2025 (శుక్రవారం) ( గిట్టుబాటు ధరలపై సమీక్ష )
పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధరలను అందించడంతో పాటు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై దృష్టి పెట్టి వారి వివరాలు సేకరించాలని సూచించారు. బర్లీ పొగాకును క్వింటాల్‌కు12 వేల 500 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. అలాగే కోకో గింజలను కూడా కిలోకు 500 తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

16-05-2025 (శుక్రవారం) ( కొనుగోళ్లను ఆపొద్దు )
ఏపీలో పొగాకు పండించిన రైతులు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోకూడదన్నారు సీఎం చంద్రబాబు. పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. తాను రైతులు, పరిశ్రమలు-సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని, అలా అని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని తెలిపారు. ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేది లేదని.. చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

16-05-2025 (శుక్రవారం) ( యోగాంధ్ర-2025 )
అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలో జూన్‌ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. యోగాంధ్ర-2025 థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలిలని.. దీని కోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్‌ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు.

16-05-2025 (శుక్రవారం) ( యోగాంధ్ర-2025 )
ఆర్‌కే బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 68 ప్రాంతాల్లో 2 లక్షల 58 వేల 948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్‌కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. 2023లో సూరత్‌లో లక్షా 53 వేల మందితో నిర్వహించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు ఎక్కింది. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.

17-05-2025 (శనివారం) ( స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర )
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నేడు జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీ క్యాంప్ లోని రైతుబజార్‌ను సందర్శించి అక్కడి రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో సంభాషించారు. రైతుకు ఆదాయం.. వినియోగదారుడికి ఆదా లక్ష్యంతో ప్రారంభించిన రైతు బజార్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయన్నారు చంద్రబాబు. రైతు బజార్‌లో స్థానిక విక్రేతల నుంచి సరుకులు కొని డిజిటల్ పేమెంట్ చేశారు సీఎం చంద్రబాబు.

17-05-2025 (శనివారం) ( ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్)
మరో ఎన్నికల హామీ అమలుకు ముహూర్తం నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ప్రతి ఏడాది 3 వేల 182 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు.

17-05-2025 (శనివారం) ( ఘనంగా యోగా డే వేడుకలు )
ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీకి వస్తున్నారని తెలిపారు. యోగా డేను నెలరోజులపాటు నిర్వహిస్తామని.. ప్రజలకు శిక్షణ ఇస్తామన్నారు.

17-05-2025 (శనివారం) ( మార్గదర్శులకు సన్మానం)
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతుంది. పేద కుటుంబాలను ఆదుకోవడానికి చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శులను సన్మానించారు చంద్రబాబు.

17-05-2025 (శనివారం) ( స్కూల్స్ తెరిచేలోపు తల్లికి వందనం )
ప్రజావేదిక సభలో మరో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో స్కూల్స్ తెరిచేలోపు తల్లికి వందనం ఇచ్చి తీరుతానన్నారు. ఎన్ని కష్టాలున్నా తాము భరిస్తామని.. కానీ ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారు ఆయన.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×