Soundarya : తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉంటారు. అందులో కొందరికి మాత్రమే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలనాటి తార సావిత్రి తర్వాత ఆ స్థానం హీరోయిన్ సౌందర్యకు దక్కింది. ఎన్నో వందల సినిమాల్లో నటించింది. అప్పటిలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఈమె అందరు స్టార్ హీరోలతో జోడి కట్టింది. 1993 నుంచి 2004 వరకు నిర్విరామంగా సినిమాలు చేసింది. ఆమె కెరీయర్ లో 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సౌందర్య. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. దక్షిణాది చిత్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే సౌందర్య చిన్న వయస్స్ లోనే తుదిశ్వాస విడవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఆమె చనిపోయి చాలా ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా యాక్సిడెంట్ మిస్టరీగానే ఉంది. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఆమె డెత్ గురించి షాకింగ్ విషయాలను ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సౌందర్య మరణం.. తీరని లోటు..
సౌందర్య కన్నడ బ్యూటీ.. అయిన తెలుగు అమ్మాయిలాగా ఉండేది. అందుకే తెలుగు ప్రజలు ఆమెకు నిరాజనం పలికేవారు. ఆమె సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరిచేవారు. అయితే సినిమాలే కాదు. రాజకీయాల్లో కూడా రాణించాలనే ఉద్దేశ్యంతో అటుగా అడుగులు వేసింది. కానీ దేవుడు ఆ రాత ఆమెకు రాయలేదు . రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే ప్రాణాలను తీసేశాడు. 2004, ఏప్రిల్ 17 న ఆమె మరణించింది. ఎయిర్ క్రాఫ్ట్ పేలడంతో చనిపోయింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో తన సోదరుడు అమర్నాథ్ కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటన బెంగళూరు జరిగింది. పొలిటికల్ క్యాంపెయిన్ కు వెళ్తున్న సమయంలో ఇలా ఘోర ప్రమాదం జరగడం అందరినీ కలిచి వేసింది. సౌందర్య లాంటి గొప్ప నటిని కోల్పోయినందుకు సినీ లోకం విచారం వ్యక్తం చేసింది. నేటి సౌందర్య ఈ లోకాన్ని విడిచి 21 ఏళ్లు అయ్యింది. కానీ ఆమె డెత్ పై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమె మరణానికి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ సీనియర్ హీరోయిన్ సంచలన విషయాలను బయట పెట్టింది.
Also Read : చిరంజీవి మెంటాలిటీ ఇదే.. అందుకే సినిమా క్యాన్సిల్.. తప్పు ఎవరిది..?
ఎవరికి తెలియని నిజాలు ఇవే..
తమిళ స్టార్ హీరోయిన్ నటి వెన్నిర ఆడై నిర్మల సౌందర్య మరణం గురించి సంచలన నిజాలను బయట పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో నిజాలను సౌందర్య మరణం గురించి బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. సౌందర్య నన్ను సొంత తల్లిలాగా చూసుకొనేది. మా ఇంట్లో కూడా ఆమె అలాగే ఉండేది. తాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చనిపోయే టైం లో ఆమె మూడు నెలల గర్భవతి.. ఆ ఘోర ప్రమాదం ఇంకా నా కళ్ల ముందే ఉంది.. ఆ రోజు ఆగింటే సౌందర్య బ్రతికి ఉండేది. అంటూ లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకుంది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..