OTT Movie: క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న మలయాళం సినిమాలు, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలు చివరి వరకు ట్విస్టులతో ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఒక సినిమా నటుడు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ఒక అమ్మాయి డబ్బుకోసం కిడ్నాప్ చేస్తుంది. ఆ తరువాత స్టోరీ ట్విస్టులు, టర్న్ లతో ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
అధి శంకర్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సూపర్‌స్టార్‌గా ఉండి, ఇప్పుడు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి ఉంటాడు. అతనికి అప్పులు భారీగానే ఉంటాయి. అప్పు ఇచ్చిన వాళ్ళు అతని వెంట పడుతుంటారు. అతని అహంకారం, మహిళలతో సంబంధాలు, సినీ నిర్మాతలను అవమానించడంవల్ల అతనికి శత్రువులు ఎక్కువయ్యారు. అయితే అతను అయిషు అనే అమ్మాయితో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. అదే సమయంలో సహనటి కార్తీక లక్ష్మితో కూడా సంబంధం కొనసాగిస్తాడు. ఒక రోజు అధి కారు పాడైపోవడంతో, అంజలి అనే అమ్మాయిఅభిమానిగా పరిచయం చేసుకుని లిఫ్ట్ ఇస్తుంది. అయితే ఆమె అతన్ని మోసం చేసి, ఒక ఫ్లాట్‌లో అతన్ని బంధిస్తుంది.
అంజలి తండ్రి ఆనందన్ తన ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటాడు. బ్యాంక్ వాళ్ళు ఇంటిని జప్తు చేయడానికి వస్తారని, డబ్బు కోసం తన బాయ్‌ఫ్రెండ్ శరత్ సహాయంతో అధిని కిడ్నాప్ చేస్తుంది. వాళ్ళు అధి బాగా ధనవంతుడని భావించి ఇలా చేస్తారు. అతని స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి, స్వేచ్ఛగా ఉన్నట్లు బయటి ప్రపంచానికి చూపిస్తారు. చివరికి అధి నుంచి అంజలి డబ్బులు వసూలు చేస్తుందా ? అధి ఈ కిడ్నాప్ నుంచి బయట పడతాడా ? అతని అప్పులు తీరుతాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : వీడెక్కడి సైకోనండి బాబు, పాట పాడకపోతే మనుషుల్ని చంపేస్తున్నాడు … మతిపోయే ట్విస్టులు ఉన్న మలయాళం థ్రిల్లర్
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇన్నాలే వారే’ (Innale Vare). 2022 లో విడుదలైన ఈ సినిమాకు జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. మాథ్యూ జార్జ్ దీనిని నిర్మించారు. ఈ ఇందులో అసిఫ్ అలీ, నిమిషా సజయన్, ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక సినీ నటుడు అధి శంకర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.