BigTV English

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీలో రూ.3500 కోట్లతో.. ఏఐ డేటా సెంటర్..

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీలో రూ.3500 కోట్లతో.. ఏఐ డేటా సెంటర్..

CM Revanth Reddy: ఈవారం సింగపూర్ దావోస్ పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజిబిజీగా గడిచింది. తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. మరోవైపు గ్రామసభలు, 4 కొత్త పథకాలకు లబ్దిదారుల ఎంపికతో ఈ వారం ప్రజా ప్రభుత్వం స్పీడ్ పెంచింది.


19-01-2025 ఆదివారం ( సింగపూర్ లో సక్సెస్ )

సింగపూర్ లో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆ క్రమంలో ఈనెల 19న భారీ పెట్టుబడులు సాధించింది. సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, డీబీఎస్ కంట్రీ హెడ్, బ్లాక్‌ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ సహా పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు.


తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్‌ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.

20-01-2025 సోమవారం ( కబ్జాలపై ఉక్కుపాదం )

కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. పర్యావరణంపై ప్రేమ ఉన్న వారు ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తూనే ఉన్నారు. ఈనెల 20న బుద్ధభవన్‌లోని హైడ్రా ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్వయంగా కంప్లైంట్స్ స్వీకరించారు.
ప్రాంతాల వారీగా ఉన్న అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలన్నారు.

ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై గూగుల్‌ మ్యాప్‌, సర్వే ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ఫోటోలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా అమీన్‌పూర్‌ పరిసర ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తుండడంతో ఆ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయి సర్వే చేయిస్తామని రంగనాథ్‌ అన్నారు. ఔటర్‌ వరకు చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం నిర్ధారణ పూర్తయితే ఆక్రమణలకు సంబంధించి చాలా ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. నాలుగైదు నెలల్లో సైంటిఫిక్ మెథడ్ లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

VO: 21-01-2025 మంగళవారం ( సక్సెస్ ఫుల్ గా గ్రామసభలు )

తెలంగాణలో గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అసలు గ్రామసభలను పట్టించుకోలేదు. గ్రామాల్లో జనం ఏమనుకుంటున్నారు.. ఏం కోరుకుంటున్నారన్న విషయాలను అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. అయితే ప్రజాప్రభుత్వం మాత్రం ఏ పథకాలకైనా లబ్దిదారులను జనం మధ్యే ఎంపిక చేయాలనుకుంది. అందుకే 4 కొత్త పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయింది. అందులో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉన్నాయి. వీటికి లబ్దిదారులను గ్రామసభల ద్వారా గుర్తించి అక్కడే ప్రకటించి డ్రాఫ్ట్ లిస్టులను ఫైనలైజ్ చేశారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో గ్రామసభలు జరగడంతో రెస్పాన్స్ భారీగా వచ్చింది.

21-01-2025 మంగళవారం ( తెలంగాణ మీన్స్ బిజినెస్ )

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్‌ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు జయంత్ చౌధరి, చిరాగ్ పాశ్వాన్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇందులోనే ఏర్పాటు చేసిన తెలంగాణ మీన్స్ బిజినెస్ థీమ్ పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుంది.

22-01-2025 బుధవారం ( హైదరాబాద్ నెక్ట్ లెవెల్ )

తెలంగాణ రూపురేఖలు మార్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని నెట్‌ జీరో సిటీగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తామన్నారు సీఎం. ట్రాఫిక్‌ రద్దీ లేని నగరాల్లోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఐఐ – హీరో మోటార్‌ కార్ప్‌ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొని తెలంగాణ రైజింగ్ 2050ని ఆవిష్కరించారు.

ghmc పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, డ్రైపోర్ట్ తో మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో లింకేజ్, వంద కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్‌, హైదరాబాద్‌ Orrకు వెలుపల 360 కిలోమీటర్లతో రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌ను లింక్ చేసేలా రేడియల్‌ రింగు రోడ్లు, వీటికి అనుబంధంగా రైల్వే లైన్.. ఇలాంటి ఆలోచనలను పారిశ్రామిక వేత్తల ముందు ఉంచారు.

22-01-2025 బుధవారం ( వ్యాపారం – పర్యావరణం )

ఒక ట్రిలియన్ మొక్కలు నాటి ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ పెవిలియన్ ను వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ సభ్యులు సందర్శించి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో చెరువుల సంరక్షణ, అలాగే నెట్ జీరో విధానాలతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు విషయాలను సీఎం ప్రస్తావించారు.

23-01-2025 గురువారం ( దావోస్ లో తెలంగాణ హిట్ )

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇవే అత్యధిక పెట్టుబడులు కావడం విశేషం. 16 ప్రముఖ కంపెనీలు సుమారు 1.78 లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈనెల 23న అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, బ్లాక్ స్టోన్, ఉర్సా క్లస్టర్స్, అక్షత్ గ్రీన్‌టెక్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ వంటి ప్రముఖ సంస్థలతో తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరిపింది. ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యంగా ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి.

23-01-2025 గురువారం ( కొత్త కొత్తగా పేర్లు )

తెలంగాణ ప్రభుత్వం ఈవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, సింగూరు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి గుర్తుగా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్‌ఐ ప్రాజెక్టుగా నామకరణం చేసింది. అటు సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత కాంగ్రెస్‌ నాయకుడు రాజనర్సింహ పేరు పెట్టింది. సింగూరు ప్రాజెక్టుకు సిలారపు రాజనర్సింహ ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

23-01-2025 గురువారం ( రుణమాఫీపై ఖుషీ ఖబర్ )

2 లక్షలకు పైగా రుణాలుండి ఇంకా మాఫీ అమలు కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్‌ పెట్టి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈనెల 23న చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో మాట్లాడారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లలో ఎవరి జోక్యం ఉండదని, అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు. రేషన్‌ కార్డుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని కూడా చెప్పారు. సో రేషన్ కార్డులు లేవు, రాలేవు అన్న కంప్లైంట్స్ లేకుండా ప్రజా ప్రభుత్వం చూసుకుంటోంది.

24-01-2025 శుక్రవారం ( కొత్త పింఛన్లపై కదలిక )

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా త్వరలో కసరత్తు మొదలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం 11 రకాల పింఛన్లు అందిస్తోంది.

మొత్తం 42 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. పింఛన్ తీసుకుని చనిపోయిన వాళ్ల స్థానంలో కొత్త వారిని చేర్చే అంశంపైనా ఆలోచన చేస్తోంది. కాగా త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో అర్హులను త్వరగా ఎంపిక చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. బడ్జెట్‌లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తే కొత్త పింఛన్లకు రూట్ క్లియర్ అవుతుంది.

24-01-2025 శుక్రవారం ( వినతుల వెల్లువ )

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ ఇలాంటి వాటిపై ఫోకస్ గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముందు భారీ వినతుల లిస్ట్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మొత్త 55 వేల 652 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందులో మెట్రో రైల్ ఫేజ్ – 2కు 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 10 వేల కోట్లు, సివరేజీ మాస్టర్ ప్లాన్ కు 17,212 కోట్లు, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ కు 4,170 కోట్ల ఆర్థిక సహాయం చేయాలన్నారు. అటు తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం భూభాగం అర్బన్ ఏరియా కింద ఉందని, గ్రేటర్ హైదరాబాద్ సహా మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈనెల 24న బేగంపేట ఐటీసీ కాకతీయలో అర్బన్ సెక్టార్, పవర్ సెక్టార్​లపై కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ ​లాల్ ఖట్టర్ రివ్యూ చేశారు. తెలంగాణను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్న సీఎం అర్బన్ మొబిలిటీ, మూసీ రివర్ ఫ్రంట్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సివిక్ సర్వీసెస్, భూభారతి చట్టం, మెట్రోపాలిటన్ డెవలప్ ​మెంట్ ప్లాన్ 2050, బిల్డ్ నౌ, టౌన్ ​షిప్ గ్రోత్ సెంటర్స్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. దావోస్ లో తెలంగాణకు భారీ పెట్టుబడులు రావడంపై కేంద్రమంత్రి ఖట్టర్.. సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా అభినందించారు.

24-01-2025 శుక్రవారం ( గ్రామసభలు సక్సెస్ )

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నాలుగు పథకాలకు.. కొత్తగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే వచ్చిన డ్రాఫ్ట్ లిస్టులను గ్రామసభల్లో చూపించారు. జనం మధ్యే లబ్దిదారులను ఎంపిక చేశారు. పేర్లు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజులుగా చేపట్టిన గ్రామసభల నిర్వహణ శుక్రవారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, పురపాలికల్లోని 2,387 వార్డుల పరిధిలో గ్రామసభలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.

24-01-2025 శుక్రవారం ( ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ )

ప్రయాణికుల మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిచేందుకు ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కూడా బస్సులు కొనుగోలు చేయలేదన్నారు. 3,500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయినా.. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. త్వరలోనే ఖాళీలను గుర్తించి.. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు పొన్నం. స్వశక్తి మహిళా సంఘాల ద్వారా మరో 600 బస్సులను కొంటామన్నారు. హైదరాబాద్‌ పొల్యూషన్ తగ్గించేందుకు అన్నీ ఈవీ బస్సులే నడుపుతామన్నారు. కార్గో సర్వీసుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఆసక్తి ఉంటే డిపోల్లో అప్లై చేసుకోవచ్చన్నారు.

25-01-2025 శనివారం ( అర్హులందరికీ రేషన్ కార్డులు )

జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఎలాంటి సమస్యలు లేకుండా కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా నిధుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాఫీగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు జరగాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. చివరి లబ్దిదారు పేరు చేర్చే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

25-01-2025 శనివారం ( ప్రజా పాలనలో ముందడుగు )

ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణంపై సీఎం రేవంత్ సమీక్షించారు. దీన్ని చాలా ప్రయారిటీగా తీసుకున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ కొత్త హాస్పిటల్ బిల్డింగ్ పై దగ్గరుండి సూచనలు చేశారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో దీన్ని నిర్మించబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటు కీలకమైన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సమావేశమై.. వేగంగా జరగాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×