Mla Adinarayana Reddy: వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ చివరి దశకు చేరుకుందన్నారు. దశాబ్దంపాటు సఖ్యతగా ఉన్న ఏ-1, ఏ-2 మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయన్నారు. విజయసాయిరెడ్డి తప్పించుకోలేని తప్పులు చేశారన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని వైసీపీ నేతలు బయటకు రావాలని సూచన చేశారు.
ఆదివారం కడపలో ఆయన మీడియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీరి విభేదాల తర్వాత సాయిరెడ్డి అన్ని పార్టీల చుట్టూ తిరిగి ఉంటారని, ఆయన్ని ఎవరూ ఆహ్వానించలేదని మనసులోని మాట బయటపెట్టారు. విజయసాయిరెడ్డి బాటలో చాలా మంది ఉంటారని, ఇక వైసీపీ నిలబడడం కష్టమేనని మనసులోని మాట బయటపెట్టారు.
విజయసాయి రెడ్డి బయటకు వచ్చినందుకు హృదయ పూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. వివేకా హత్యపై ఆయన నిజాలు చెప్పారని, బాబాయికి గొడ్డలి పోటు ఉంటే గుండె పోటని ఎలా చెప్పారని ప్రశ్నించారు. పులివెందులలో డీఎస్పీ మురళీ నాయక్‌ను జగన్ బెదిరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జగన్-భారతీకి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు.
జగన్ తప్పుల మీద తప్పులు చేస్తుంటే అది తట్టుకోలేక వీఎస్ఆర్ బయటకువచ్చారన్నారు బీజేపీ ఎమ్మెల్యే. జగన్ లండన్ నుంచి ఏపీలో దిగే సరికి ఆ పార్టీ నేతలంతా లండన్ చేరడమే మిగిలివుందన్నారు. రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగారన్నారు. మార్చి తరువాత ఆరు పథకాలు తప్పకుండా అమలు అవుతాయిని వెల్లడించారు.
ALSO READ: ఏపీలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్