SSMB 29:దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటూ మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ వరల్డ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా గురించి పలు రకాల వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో హాలీవుడ్ బ్యూటీ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ను మహేష్ బాబు సరసన తీసుకున్నారని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రా తో పాటు మహేష్ బాబు సరసన మరో హీరోయిన్ కూడా నటించబోతుందని సమాచారం.
ప్రియాంక చోప్రా తో పాటు మరో హీరోయిన్..
ఇకపోతే ఈ సినిమాలో థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్ వర్త్ తో పాటు ఇంకొంతమంది హాలీవుడ్ నటీమనులు ఇందులో నటిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై చిత్ర బృందం అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరొకవైపు ఇందులో ఇంకో హీరోయిన్ తీసుకోవడం వెనుక పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి
ముఖ్యంగా మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించబోతోంది అని వార్తలు వస్తున్నప్పటి నుండి మహేష్ బాబు అభిమానుల నుండి కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ఎప్పుడు మిల్క్ బాయ్ గా కనిపించే మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా వయసులో పెద్దదిగా m కనిపిస్తుందని, అందుకే మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రాన్ కాకుండా ఇంకొక అందమైన అమ్మాయిని హీరోయిన్గా తీసుకోబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి రహస్యంగా ఉంచబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రాను ఒక కీలక పాత్ర కోసం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎస్.ఎస్.ఎం.బి 29 గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు అభిమానులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అడ్వెంచర్ మూవీగా ఎస్ ఎస్ ఎం బి 29..
ఇక ఈ సినిమా విషయానికే వస్తే.. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారు చేశారు. ముఖ్యంగా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని, ఇప్పటికే ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) తెలిపారు. ప్రత్యేకించి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలోనే ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్లు కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన చిత్ర బృందం, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు నిన్న తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షూటింగ్ అప్డేట్ గురించి కూడా ఒక వీడియో షేర్ చేశారు రాజమౌళి. అందులో సింహాన్ని లాక్ చేసి పాస్పోర్ట్ చూపిస్తూ ఒక వీడియో షేర్ చేశారు. దీనికి మహేష్ బాబు కూడా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని ఆ వీడియో కింద కామెంట్ చేశారు. మహేష్ బాబు అలాగే నమ్రతా, ప్రియాంక చోప్రాలు కూడా స్పందించారు. మొత్తానికైతే పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.