BigTV English

Lokam Madhavi VS Bangarraju: నెల్లిమర్లలో సీన్ రివర్స్.. టీడీపీ, జనసేనల మధ్య కోల్డ్‌ వార్‌

Lokam Madhavi VS Bangarraju: నెల్లిమర్లలో సీన్ రివర్స్.. టీడీపీ, జనసేనల మధ్య కోల్డ్‌ వార్‌

ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరింది. టీడీపీకి కంచుకోట లాంటి నెల్లిమర్ల సెగ్మెంట్‌ని పొత్తుల లెక్కల్లో భాగంగా చివరి నిముషంలో జనసేనకు కేటాయించారు. నియోజకవర్గం ఆవిర్భావం నుండి ఇక్కడ టీడీపి హవానే కొనసాగుతూ వచ్చింది. అలాంటి నియోజకవర్గాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మాట కొట్టిపారేయలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వదులుకున్నారు. ఎవరు పోటీ చేసిన అంతిమంగా గెలవాలన్నదే తమ ధ్యేయమని పడే పదే చెప్పుకొచ్చారు కూటమి నేతలు. దానికి తగ్గట్లే నెల్లిమర్లలో కూటమి అభ్యర్ధి అయిన లోకం మాధవి టీడీపీ సపోర్ట్‌తో సునాయాసంగా గెలిచారు .

ముఖ్యంగా నియోజకవర్గ టీడీపీ కేడర్ జనసేనకు పూర్తి స్థాయిలో సహకారం అందించారు. ఎన్నికల ముందు తానే అభ్యర్థినన్న ధీమాతో నెల్లిమర్లలో.. పూర్తిస్థాయి గ్రౌండ్ వర్క్ చేసుకున్న టీడీపీ ఇన్చార్జ్‌ బంగార్రాజు పార్టీ అధిష్టానం నిర్ణయానికి శిరసావహించి ఎన్నకల ప్రచారంలో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. దాంతో లోకం మాధవి విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఇంకా ఏడాది కూడా గడవలేదు . కేవలం 8 నెలలు మాత్రమే పూర్తయ్యాయి . కానీ నెల్లిమర్ల కూటమిలో మాత్రం విభేదాలు రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి .


ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ ఇన్చార్జ్ బంగార్రాజులు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగానే వాగ్యుద్దాలకు దిగారు. నెల్లిమర్ల నగర పంచాయితీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి ఆయన్ని గెట్ అవుట్ అంటూ అవమనపరిచారు. ఈ ఘటనను నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. బంగార్రాజుకి మద్దతు తెలుపుతూ సర్వసభ్య సమావేశం నిర్వహించి మాధవికి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు . టీడీపీ చలవతోనే గెలిచావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మండిపడ్డారు. ఆ తరువాత జనసేన, టీడీపీ పార్టీల క్రమ శిక్షణా సంఘం కమిటీలు మాధవికి, బంగార్రాజుకి ఈ విషయంలో క్లాస్ కూడా తీసుకున్నాయి . చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుపోవాలి తప్ప రచ్చకెక్కడం సరికాదంటూ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాయి .

కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నట్లు కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో సైతం పరిస్థితి అలానే ఉందంట. ఎక్కడా సైకిల్, గాజుగ్లాసు పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి లేదంట. ఇటీవల బూరాడపేట గ్రామంలో జరిగిన ఘర్షణ అందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఓ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ విషయమై రెండు పార్టీల మధ్య పెద్ద యుద్దమే నడిచింది. ఆ పోస్టు టీడీపీ కాకుండా జనసేనకి ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అయ్యారు. రెండు వర్గాల వారు ఒకరిపై ఒక్కరూ పిడిగుద్దులు కురిపించుకోవడంతో పలువురికి గాయలయ్యాయి . దాంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఇదే కాదు నియోజకవర్గంలో నిత్యం పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ ఇన్‌వాల్వ్‌మెంట్ పెరగడంతోనే విభేదాలు వస్తున్నాయని.. రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఓపెన్‌గానే చెప్తున్నారు. పోలింగ్ వరకు టీడీపీ ఇంచార్ బంగార్రాజుతో కలిసికట్టుగా పని చేసిన లోకం మాధవి.. గెలిచిన తరువాత బంగార్రాజుతో పాటు టీడీపీ శ్రేణులను కూడా పట్టించుకోవడం మానేశారని.. అందుకు ఆమె భర్త పెత్తనమే కారణమన్న విమర్శలున్నాయి. స్థానికంగా బలోపేతమవ్వడానికి లోకం మాధవి భర్త వైసీపీ వారిని చేరదీస్తూ.. జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా స్థానిక ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

Also Read: పోసానీ అరెస్ట్.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

ఇప్పుడు తెలుగు తమ్ముళ్లతో కలిసి జనసైనికులు కూడా అదే వాయిస్ వినిపిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. మొదట్లో జనసైనికులకు పెద్ద పీట వేసిన లోకం మాధవి ఇపుడు మెల్లగా వారిని కూడా పక్కకి నెట్టేస్తున్నారట. నెల్లిమర్లకు స్థానికేతురాలైన లోకం మాధవిని పాలన వ్యవహారాల్లో ఆమె భర్త లోకం ప్రసాద్ డామినేట్ చేస్తూ .. అధికార కార్యక్రమాలు, ప్రభుత్వ పనుల్లో చేతివాటం చూపిస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. తాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం అహర్నిశలు పని చేస్తుంటే.. ఎమ్మెల్యే, ఆమె భర్త సొంత ప్రయోజనాల కోసం కార్పొరేట్ రాజకీయం చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.

ఆ క్రమంలో నాన్ లోకల్ వాళ్ళని గెలిపించడం పెద్ద తప్పైందని నెల్లిమర్ల కూటమి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ వారిని ఇప్పటికే దూరం పెట్టేసిన ఎమ్మెల్యేను జనసేన కార్యకర్తలు, ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకుందామంటే కుదరడం లేదంట. ఇంటి దగ్గరకు వెళ్తే మాధవి భర్త పర్సనల్ వ్యక్తులు గేటు దగ్గరే అడ్డుకుంటూ.. ఎపుడు అడిగినా మేడమ్ బిజీ అంటూ తరిమేస్తున్నారంట.

అదలా ఉంటే కూటమి కుమ్ములాటలతో వైసీపీ శ్రేణులు నవ్వుకుంటున్నాయంట. తమను ఓడించి ఇప్పుడు వాళ్ళలోవాళ్ళే కొట్టుకుంటుంటే వైసీపీ కేడర్ తెగ ఎంజాయ్ చేస్తోందంట. ఏదేమైనా ప్రత్యర్ధులను టార్గెట్ చేయాల్సిన కూటమి నాయకులు కొట్లాటలతో వారికి వారే టార్గెట్ అవుతుండటం నెల్లిమర్లలో హాట్‌టాపిక్‌గా మారిందిప్పుడు. చూడాలి మరి భవిష్యత్‌లోనైనా సర్దుకుపోతారో.. లేక వీళ్ళే సర్దేసుకొని, ప్రత్యర్ధులకు పట్టం కడతారో.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×