Fauji Look Leaked : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ది రాజా సాబ్’ (The Raja Saab)తో పాటు ‘ఫౌజీ’ (Fauji)లో కూడా నటిస్తున్నారు డార్లింగ్. తాజాగా సోషల్ మీడియాలో ఈ మూవీ టెస్ట్ లుక్ కు సంబంధించి, లీకైన పిక్ వైరల్ అవుతోంది.
‘ఫౌజీ’ టెస్ట్ లుక్ లీక్ ?
డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ‘ఫౌజీ’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డార్లింగ్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా కనిపించబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా డార్లింగ్ ఫాన్స్ కి షాక్ ఇచ్చే ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అది ‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ టెస్ట్ లుక్ అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీకైన ఫోటోలో ప్రభాస్ డాషింగ్ లుక్ లో అదిరిపోయాడు. సూటు, బూటు వేసుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న ప్రభాస్ మరింత ఫిట్ గా, సరికొత్త లుక్ లో అదిరిపోయాడు. ఆ ఆరడుగుల అందాన్ని చూసి ‘ఏమున్నాడు రా బాబు’ అని కామెంట్స్ చేస్తున్నారు ఆయన లేడీ ఫ్యాన్స్. కానీ మరోవైపు ఇలా ప్రభాస్ లుక్ లీక్ కావడం ప్రభాస్ అభిమానులను డిసప్పాయింట్ చేస్తోంది.
మేకర్స్ ఇలా లీక్స్ కాకుండా జాగ్రత్త పడితే మంచిదని సలహా ఇస్తున్నారు. అయితే కొంతమంది ఇది ప్రభాస్ ఓల్డ్ లుక్ అంటున్నారు. ప్రభాస్ నటించిన ‘సాహో’ కోసం చేసిన టెస్ట్ లుక్ ఇది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ లుక్ అసలు ఏ మూవీ లోనిది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
‘ఫౌజీ’ కోసం భారీ సెట్ నిర్మాణం
‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది. పలు కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించారు. అయితే ప్రభాస్ గాయపడటం వల్ల కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడినట్టుగా వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ గాయం నుంచి కోలుకోవడంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనికోసం హైదరాబాద్లో ఓ భారీ స్పెషల్ సెట్ ను వేయబోతున్నారు. అందులో ప్రభాస్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడే సన్నివేశాలను షూట్ చేస్తారని అంటున్నారు.
1940లో సాగే వార్ బ్యాక్ డ్రాప్, పీరియాడికల్ డ్రామా, లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతోంది అని అంటున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్ర పోషిస్తున్నారని టాక్ నడుస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద లాంటి నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.