BigTV English

Bank Holidays: 14 రోజులు బ్యాంకులకు సెలవు.. పనిచేసేది సగం రోజులేనా..

Bank Holidays: 14 రోజులు బ్యాంకులకు సెలవు.. పనిచేసేది సగం రోజులేనా..

కొత్త ఏడాదిలో మూడోనెల మార్చి రానే వచ్చింది. ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా. ఉంటే ఈ వార్త గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంకు సెలవుల (March 2025 Bank Holidays) గురించి మీరు తెలుసుకుని వెళితే ఇబ్బంది లేకుండా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి నెలలో కూడా అనేక మంది లోన్స్ లేదా చెల్లింపులు, చెక్స్ డిపాజిట్ వంటి పలు రకాల సేవల కోసం వెళ్తుంటారు. అయితే ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సమాచారం ప్రకారం వీటిలో రెండో శనివారం, ఆదివారంతోపాటు పండుగల సెలవులు కూడా ఉన్నాయి.


మార్చి 2025 బ్యాంకు సెలవుల జాబితా

మార్చి 2 (ఆదివారం) – దేశవ్యాప్తంగా సెలవు
మార్చి 7 (శుక్రవారం) – చాప్చర్ కుట్ సందర్భంగా మిజోరాం ఐజ్వాల్లో బ్యాంకులకు హాలిడే
మార్చి 8 (రెండో శనివారం) – దేశవ్యాప్తంగా హాలిడే
మార్చి 9 (ఆదివారం) – దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
మార్చి 13 (గురువారం) – హోలిక దహన్, అట్టుకల్ పొంగళ నేపథ్యంలో (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ ప్రాంతాల్లో బ్యాంకులకు హాలిడే
మార్చి 14 (శుక్రవారం) – హోలీ సందర్భంగా (దేశంలో చాలా రాష్ట్రాల్లో సెలవు, కానీ త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్‌లలో బ్యాంకులు తెరిచే ఉంటాయి)
మార్చి 15 (శనివారం) – హోలీ యోసంగ్ డే సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులకు హాలిడే
మార్చి 16 (ఆదివారం) – వారపు సెలవు
మార్చి 22 (నాలుగో శనివారం) – దేశవ్యాప్తంగా హాలిడే
మార్చి 23 (ఆదివారం) – వారాంతపు సెలవు
మార్చి 27 (గురువారం) – షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులకు సెలవు
మార్చి 28 (శుక్రవారం) – జుమాత్-ఉల్-విదా నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులకు హాలిడే
మార్చి 30 (ఆదివారం) – వారపు సెలవు
మార్చి 31 (సోమవారం) – రంజాన్ ఈద్ సందర్భంగా (దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సెలవు, కానీ మిజోరాం, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు తెరిచే ఉంటాయి)

Also Read: India’s Q3 GDP : మూడో త్రైమాసిక వృద్ధి రేటు విడుదల – ట్రంప్ సుంకాలు కొంపముంచనున్నాయా?


సెలవు ఉన్నా కూడా..

ఈ నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు అంటే 14 రోజులు పనిచేయవని చెప్పవచ్చు. ఈ క్రమంలో సెలవుల రోజులను చూసుకుని బ్యాంకు కస్టమర్లు వారి పనులు నిర్వహించుకుంటే బెస్ట్. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఆన్ లైన్ లావాదేవీలు మాత్రం నిర్వహించుకోవచ్చు. దీంతోపాటు పలు ఏటీఏం కేంద్రాల వద్ద మనీ డిపాజిట్స్ చేసుకోవడంతోపాటు విత్ డ్రా వంటి సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

మార్చి 31న సెలవు లేదా..

మరోవైపు మార్చి 31న ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపు చివరి రోజు అయిన క్రమంలో ప్రభుత్వ చెల్లింపులు, సెటిల్‌మెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్చి 31న బ్యాంకులు తెరిచి ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

Related News

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Big Stories

×