E-Paper
Advertisement

Karimnagar Politics: పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? జీవన్‌రెడ్డిపై పొన్నం సంచలన కామెంట్స్

Karimnagar Politics: పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? జీవన్‌రెడ్డిపై పొన్నం సంచలన కామెంట్స్
Advertisement

Karimnagar Politics: ఆయనేమో అలకకి అంబాసిడర్.. ఈయనగారేమో ఫైర్ బ్రాండ్.. ఫార్టీ ఈయర్స్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఫైర్ బ్రాండ్ గా పేరున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ మారిందట. తనను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దానికి ఆజ్యం పోసేలా పొన్నం తాజాగా చేసిన కామెంట్స్ వారిద్దరి మధ్య గ్యాప్‌ని మరింత బయట పెట్టింది. ఇన్నాళ్లూ పార్టీలో జీవన్‌రెడ్డి వ్యవహారతీరుపై సైలెంట్ గా ఉన్న పొన్నం సడన్ గా ఎందుకు సడన్‌గా వాయిస్ మర్చారు? అసలు పొన్నం చేసిన కామెంట్స్ ఏంటి?

పార్టీపై గత రెండేళ్లుగా అలకల

అధికార హస్తం పార్టీకి ఫిరాయింపుల విషయంలో కొరకరాని కొయ్యలా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే కాస్త ఎక్కువగానే పార్టీని ఇరుకున పెడుతున్నారు పెద్దాయన. అవకాశం దొరికిన ప్రతిసారి సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారు. జగిత్యాలలో మారిన పొలిటికల్ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్. వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్ కాంగ్రెస్ కి చేరువ కావడం మింగుడు పడటం లేదట జీవన్ రెడ్డికి దీంతో పార్టీపై గత రెండేళ్లుగా అలకల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. ప్రారంభంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సీనియార్టీని గౌరవిస్తూ.. కాస్త రియాక్ట్ అయిన కాంగ్రెస్ ముఖ్యలు బజ్జగించడానికి ప్రయత్నిపించారు. అయితే ఎప్పటికప్పుడు జీవన్‌రెడ్డి అదే ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో పార్టీ పరంగా ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. ఆ క్రమంలో ప్రస్తుతం ఎలాంటి పదవిలో లేని జీవన్‌రెడ్డి, మరింత ఫ్రస్టేట్ అయ్యి పార్టీపై తిరుగుబాటు ప్రకటించి ఇటీవలి ఎన్నికల్లో స్వతంత్రులను బరిలోకి దింపి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయింది. అటు సంజయ్ ఇటు జీవన్ రెడ్డి ల మధ్య వార్ వల్ల జగిత్యాల నియోజక వర్గంలోని మరో.మున్సిపాలిటీ రాయికల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయం పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారట… అయినా జీవన్ డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట.

Advertisement

Also Read: Eggs: ఎండాకాలంలో ఎగ్స్ తింటున్నారా ? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు

పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తారా?

జీవన్ విషయంలో పార్టీ సీరియస్ గా ఉన్నట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అవసరాల రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తారా? పార్టీ సైలెంట్ గా ఉందంటే చేతగాని తనమో అలసత్వమో అనుకోవద్దని పొన్నం చురకలు అంటించారు. పార్టీ సరైన సమయంలో కచ్చితంగా స్పందిస్తుందని జీవన్ ఎపిసోడ్ పై మంత్రి పొన్నం కామెంట్ చేశారు. అయితే మాజీ మంత్రికి, ప్రస్తుత మంత్రికి మధ్య గత కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోందట… మొదటి నుంచి కూడా వీరిద్దరి మధ్య అంత సఖ్యత ఏమి లేదు… అయితే సంజయ్ పార్టీకి దగ్గర కావడంతో జీవన్ అలకపాన్పు ఎక్కినప్పుడు మరో మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు పెద్దాయనకు అండగా నిలిచారట… వారి బుజ్జగింపులతోనే అప్పట్లో మెత్తబడ్డారట జీవన్… అందరూ వచ్చి పలుకరించినా పొన్నం మాత్రం జీవన్ తో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారు.

Advertisement

పైగా జీవన్ పార్టీపై కామెంట్స్ చేసిన ప్రతీసారి పార్టీ రాష్ట్ర నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం అన్నట్టు సమాచారం. సీనియర్ల మద్దతు జీవన్ కి దక్కినప్పటికి.. పొన్నం నుంచి మాత్రం సపోర్ట్ దక్కలేదు… జీవన్ కి ఎమ్మెల్సీ రెన్యూవల్ విషయంలో, క్యాబినెట్ స్థాయి పదవి కల్పన విషయంలో చర్చలు జఠిగిన సందర్భంలో పొన్నం అడ్డుపడ్డారని జీవన్ రెడ్డి పలుమార్లు బాహాటంగానే అనుచరుల ముందు వాపోయారట.. అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అయినా రాజ్యసభ స్థానాల్లో తమ నేతకు ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం చేసుకున్నారు జీవన్ అనుచరులు… సరిగ్గా ఇదే సమయంలో మంత్రి పొన్నం క్రమశిక్షణా చర్యలు అంటూ కామెంట్ చేయడం సరికొత్త చర్చకు తెర తీసిందట.. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరును పార్టీకి గుర్తు చేసేందుకే పొన్నం ఈ కామెంట్స్ చేశారనే చర్చలు సాగుతున్నాయి… పెద్దలు జీవన్ రెడ్డి ని పెద్దల సభకు వెళ్లకుండా చేసేందుకు పార్టీకి పొన్నం హింట్ ఇచ్చారనే టాక్ కూడా నడుస్తోంది.

పార్టీ మారుతున్నారన్న ప్రచారం

ఈ నేపధ్యంలో జీవన్‌రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం మళ్లీ మొదలైంది. ఆ క్రమంలో ఆ పెద్దాయన మీడియా ముందుకొచ్చి పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై స్పందించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే పరిస్థితి గురించి చెప్పానని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనేది ఆలోచించాల్సి ఉందని అప్పుడే చెప్పానన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, “చూద్దాం… లెట్ ఇట్ సీ” అంటూ పార్టీ మారడంపై ప్రశ్నను దాటవేశారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జీవన్‌రెడ్డిపై గౌరవం ఉందంటున్న జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఏ స్టెప్ తీసుకుంటారు..? పొన్నం, జీవన్ మధ్య వార్ మరింత ముదురుతుందా అనేది చూడాలి.

Also Read: BR Naidu missing: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ.. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఫ్లెక్సీ కలకలం.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×