BigTV English

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా?

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా?


GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ సారి ఎలాగైనా గెలిచి గ్రేటర్ లో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపిస్తోంది. ఆ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన కాంగ్రెస్ నూతన కమిటీలు వేయడంతో పాటు జిహెచ్ఎంసీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తు పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించి క్యాడర్‌‌ను యాక్టివ్ చేయాలని భావిస్తోంది. అసలు ఇంతకు గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ వేస్తున్న ఎత్తులు ఏంటి…?

జీహెచ్ఎంసీలో పాగా వేయాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్


త్వరలో జిహెచ్ఎంసీలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమాశాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్ జిల్లా పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఆయా నియోజకవర్గ పరిధిలోని నేతల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు జగ్గారెడ్డి తగిన సూచనలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు నివేదికను కూడా అందజేశారు.

ఎంఐఎంతో కలిసి బల్దియా పీఠాన్ని షేర్ చేసుకున్న కాంగ్రెస్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ముఖ్యంగా వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ తిరుగు లేని శక్తిగా ఎదిగింది. ఆనాడు హైదరాబాద్ లో మొత్తం14 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా నాలుగు కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలుగా టిడిపి, బిజెపి టీఆరెఎస్ 6 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. తనకు మిత్రపక్షంగా ఉన్న ఎం.ఐ.ఎంతో కలిసి బల్దియా పీఠాన్ని షేర్ చేసుకుంది.

2014, 18 ఎన్నికల్లో గ్రేటర్‌లో ఖాతా తెరవని కాంగ్రెస్

ఇక రాష్ట్ర విభజన తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. హైదరాబాద్ నగరంలో బలమైన నేతలుగా ఉన్న పి.జనార్దన్ రెడ్డి, ముఖేష్ గౌడ్ మరణించడం పెద్ద మైనస్‌గా మారింది. ఆ తర్వాత మాజీమంత్రి దానం నాగేందర్ గులాబీ పార్టీలో చేరారు. ఇక నగరానికి చెందిన మరో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కస్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు.

రంగారెడ్డి జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయిన కాంగ్రెస్

2023లోను హైదరాబాద్ జిల్లాలో అదే సీన్ రిపీట్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్‌లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్, ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మాత్రం గెలిచింది. ఇక రంగారెడ్డి జిల్లాలో సైతం కాంగ్రెస్ వరుసగా జరిగిన 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేదు. ఇక 2015, 2020 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయింది.

కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్న మేయర్, డిప్యూటీ మేయర్

2025 డిసెంబర్ నాటికి ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈ సారి ఎలాగైనా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ లు కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు . ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పటాన్ చెరు, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు హ్యాండ్ ఇచ్చి హస్తం నీడకకు చేరారు . మాజీమంత్రి, ఖైరతాబాద్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గ్రేటర్ ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మరి కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందంట.

గ్రేటర్ అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

మరోవైపై జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో నగరంలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇక ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ నగరం పక్కనే మరో నగరాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, నాళాల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

మూసీనది పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రయోగం చేయాలని భావిస్తోంది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు హస్తంపార్టీ వైపునకు మొగ్గు చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ రెడీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ నగరంలో మరింత పట్టు పెంచుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ నగరంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ 2014 తర్వాత ఢీలా పడింది. ఇప్పుడు అధికార పార్టీగా తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది..చూడాలి మరి టార్గెట్ గ్రేటర్ అంటున్న కాంగ్రెస్‌ క్యాపిటల్ సిటీలో ఎలా పాగా వేస్తుందో.

Story By Rami Reddy, Bigtv

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×