OTT Movie : ప్రేమ గుడ్డిది అని ఎందుకు అంటారో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను చుస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో 60 ఏళ్ల వృద్ధుడు, 16 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడతాడు. అంతేకాదండోయ్ పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటాడు. మరి ఈయన గారి కోరిక నెరవేరిందా ? ఈ సినిమా పేరు ? ఏ ఒటిటిలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ కొరియన్ ఆర్ట్‌హౌస్ డ్రామా ఫిల్మ్ పేరు ‘The Bow’. దీనికి కిమ్ కి-డుక్ దర్శకత్వం వహించారు. ఇందులో హాన్ యో-రియమ్ (యువతి), జియోన్ సంగ్-హ్వా (వృద్ధుడు) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సముద్రంలో ఒక ఫిషింగ్ బోట్‌లో జరిగే అసాధారణ ప్రేమ కథ. సైకలాజికల్ డ్రామా, సింబాలిజంతో ఈ కథనం ఉంటుంది. విజువల్స్, ఎమోషన్స్ కథని నడిపిస్తాయి. దీనికి IMDbలో 7.1/10, Rotten Tomatoesలో 78% రేటింగ్ ఉంది. సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. Mubi, Amazon Prime Video లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక 60 ఏళ్ల వృద్ధుడు (జియోన్ సంగ్-హ్వా) సముద్రంలో ఒక చిన్న ఫిషింగ్ బోట్‌లో ఒంటరిగా జీవిస్తుంటాడు. అతనితో ఒక 16 ఏళ్ల అమ్మాయి (హాన్ యో-రియమ్) కూడా ఉంటుంది. ఆమెను అతను 10 ఏళ్ల క్రితం, ఆమె 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే, ఒక ద్వీపం నుంచి తీసుకొస్తాడు. వీళ్లిద్దరూ బోట్‌లో ఐసోలేటెడ్ లైఫ్ గడుపుతుంటారు. ఈ వృద్ధుడు బోట్‌ని ఫిషర్‌మెన్‌కి అద్దెకిచ్చి, ఆ డబ్బుతో జీవనం సాగిస్తాడు. అమ్మాయి బోట్‌లోనే సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఆమె కళ్లలో ఎమోషన్స్, క్యూరియాసిటీ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ వృద్ధుడు ఆమెను ప్రేమగా చూసుకుంటాడు. కానీ ఆమె 17వ పుట్టినరోజున ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అతని ప్లాన్ ఒక అబ్సెసివ్, కంట్రోలింగ్ నేచర్‌ని చూపిస్తుంది. ఈ వృద్ధుడు ఒక విల్లుని ఉపయోగించి, ఆమె ఫ్యూచర్‌ని జోస్యం చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. ఇక ఈ అమ్మాయి బయటి ప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా, దాదాపు మాట్లాడకుండా బోట్‌లోనే జీవిస్తుంటుంది. కానీ ఆమెలో ఒక ఇన్నోసెంట్ క్యూరియాసిటీ, స్వేచ్ఛ కోసం తపన కనిపిస్తాయి.
ఇక కథలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక యువకుడు ఫిషింగ్ ట్రిప్ కోసం బోట్‌కి వస్తాడు. అతను ఈ అమ్మాయితో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఆమెకు హెడ్‌ఫోన్స్ ఇచ్చి మ్యూజిక్ వినిపిస్తాడు. బయటి ప్రపంచం గురించి కొంచెం ఆలోచనలు రేకెత్తిస్తాడు. ఈ యువకుడి రాకతో అమ్మాయిలో కొత్త ఫీలింగ్స్ మొదలవుతాయి. ఈ వృద్ధుడు ఈ యువకుడిపై జెలసీ, యాంగ్జయిటీ ఫీల్ అవుతాడు. అమ్మాయిని ఇంకా గట్టిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ అమ్మాయి 17వ పుట్టినరోజు సమీపిస్తుండగా, వృద్ధుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఒక సింబాలిక్ వెడ్డింగ్ సీన్‌లో, అతను ఆమెను వైట్ డ్రెస్‌లో రెడీ చేస్తాడు. కానీ అమ్మాయి ఈ బంధం నుంచి బయటపడాలని అనుకుంటుంది. ఒక ఎమోషనల్ సీన్‌లో, ఆమె వృద్ధుడి విల్లుని తీసుకుని సముద్రంలోకి దూకుతుంది. ఆమె స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని రిస్క్ చేస్తుంది. వృద్ధుడు ఆమెను వెతుకుతూ సముద్రంలోకి వెళ్తాడు. కానీ ఆమె ఆచూకీ లభించదు. అమ్మాయి స్వేచ్ఛను ఎంచుకుందా ? సముద్రంలో కొట్టుకుపోయిందా ? ఈ వృద్ధుడు బోట్‌లో ఒంటరిగా మిగిలిపోతాడా ? అనే విషయాలను ఈ సినిమాను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : ఒక్క కేసులో ఇన్ని ట్విస్టులా… తండ్రి ముందే కూతుర్ని… ఎంతకీ తెగని ఉత్కంఠ