HHVM: శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం (AM Ratnam) భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). ఈయన వారసుడు జ్యోతి కృష్ణ (Jyoti Krishna)ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)హీరోయిన్ గా, అనసూయ (Anasuya)స్పెషల్ సాంగ్ లో చేసిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య జూలై 23న ప్రీమియర్ షోతో ప్రారంభమైంది ఈ సినిమా. ఇక నిన్న అనగా జులై 24వ తేదీన విడుదలైన మొదటి షోతోనే భారీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్..
మొదటి రోజే దాదాపు రూ.50 నుండి రూ.70 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని విశ్లేషకులు కూడా చెప్పుకొచ్చారు. అటు ప్రీమియర్స్ ద్వారా సుమారుగా రూ.20 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యం చెప్పేశారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ఒక్క నైజాం ఏరియాలోనే సుమారుగా రూ. 3.36 కోట్లు ప్రీమియర్స్ ద్వారా వచ్చినట్లు, అటు వరల్డ్ వైడ్ రూ.66 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను తప్పించిన చిత్ర బృందం..
ఇక ఈ సినిమా సక్సెస్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్గా “గ్రాండ్ సక్సెస్” పేరిట మీడియా మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక అంతా బాగానే ఉన్నా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ కి అన్యాయం జరిగిందనే ఒక వార్త తెరపైకి వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. హరిహర వీరమల్లు సినిమాలో మొదట బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) ను ఒక పాత్ర కోసం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెను తప్పించి నోరా ఫతేహి (Nora fatehi) ను తీసుకున్నారు.
హరిహర వీరమల్లులో కనిపించని నటీనటులు..
అంతేకాదు నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) కూడా ఈ సినిమాలో ఉందని వార్తలు వచ్చాయి. ఇందులో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో నర్గీస్ ఫక్రి కనిపించాల్సి ఉంది. కానీ ఆమె కనిపించలేదు. దీనికి తోడు నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని చిత్ర బృందం పలుమార్లు ప్రస్తావించింది కూడా.. అయితే సినిమా చూశాక ఇద్దరూ ఈ సినిమాలో కనిపించలేదు. ఇక దీనికి తోడు బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కూడా ఈ సినిమాలో ఉన్నారు అని యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ ఆయన కూడా ఈ సినిమాలో కనిపించలేదు.
వీరంతా సెకండ్ పార్ట్ లో భాగం కాబోతున్నారా?
ఇక హరిహర వీరమల్లు పార్ట్ 2 సినిమా దాదాపు 30% షూటింగ్ పూర్తయిందని చెబుతున్నారు. కాబట్టి వీరంతా సెకండ్ పార్ట్ లో భాగం కాబోతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.. ఇక నిజంగానే వీరందరినీ సెకండ్ భాగంలో చూపించబోతున్నారా లేక వీళ్ళ సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేసారా అన్నది తెలియాల్సి ఉంది.మొత్తానికి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ బాలీవుడ్ స్టార్స్ ముగ్గురికి కూడా హరిహర వీరమల్లు లో భారీగా నష్టం జరిగింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.