Kapil Dev On IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పహల్గమ్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యండ్ ఇవ్వడం లేదు టీమిండియా క్రికెటర్లు. అటు ఆసియా కప్ కూడా రెండుసార్లు వదిలేసింది టీమిండియా. 2025లో ఛాంపియన్ గా నిలిచిన సూర్య సేనతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మొహ్సిన్ నఖ్వీని ఛీ కొట్టి ట్రోఫీ తీసుకోలేదు. ఈ రెండు సంఘటనలో నేపథ్యంలో టీమిండియా, బీసీసీఐ తప్పుందని కొందరు అంటుంటే, నఖ్వీనే ట్రోఫీ చోరీ చేసాడని మరికొందరు వాదిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని భారత క్రికెటర్లపై కేంద్ర సర్కార్ ఒత్తిడి పెట్టిందని బాంబ్ పేల్చారు. ఈ తరుణంలోనే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడమే కాకుండా ట్రోఫీలు కూడా వదిలేసుకున్నారని తెలిపారు.
షేక్ హ్యాండ్ విషయంలో భారత సర్కార్ తీసుకున్న నిర్ణయానికి టీమిండియా ప్లేయర్లు కట్టుబడి ఉండాల్సిందేనని వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లతో చేతులు కలపకూడదని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే, ప్లేయర్లకు మరో మార్గం ఉండబోదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే, ఆటగాళ్లు కూడా అదే ఫాలో కావాల్సిందేనని తేల్చి చెప్పారు.
ప్రభుత్వ ఒత్తిడి ఉన్న తరుణంలో టీమిండియా క్రికెటర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, గుడ్డిగా ఫాలో కావాల్సిందేనన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం, సర్కార్ కఠిన చర్యలు తీసుకోవడం గ్యారెంటీ అన్నారు. సోషల్ మీడియాలో కూడా దారుణంగా ట్రోల్ చేస్తారని హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ లు ఆడుతున్న క్రమంలో ప్లేయర్ల వ్యక్తిగత అభిప్రాయాల కంటే, దేశ విధానమే ప్రాధాన్యమైనదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు కపిల్ దేవ్. మైదానం బయట ఇతర దేశాల ప్లేయర్లతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కేంద్రం గీసిన గీత దాటొద్దని తెలిపారు కపిల్ దేవ్.
ఏడాది కింద పహల్గమ్ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాదులు.. ఇండియాలో చొరబడి పహల్గమ్ మారణకాండకు కారణం అయ్యారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ భారత సర్కార్ తగిన బుద్ధి చెప్పింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ క్రీడాకారులకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో షేక్ హ్యాండ్ పై ఇంత రాద్ధాంతం జరుగుతోంది.