BigTV English

BJP Vs Congress: బీజేపీని తట్టుకొని కాంగ్రెస్ నిలబడాలంటే ఈ స్ట్రాటజీ తప్పనిసరి

BJP Vs Congress: బీజేపీని తట్టుకొని కాంగ్రెస్ నిలబడాలంటే ఈ స్ట్రాటజీ తప్పనిసరి

BJP Vs Congress: ఒక పార్టీకి హవా పెరిగితే ఆపే శక్తి ఎవరికీ ఉండదు. అయితే ఆ హవా తీసుకురావడమే కీలకం. కాంగ్రెస్ అంటేనే ఒక అపవాదు ఉంటుంది. ఎవరికి వారే ఉంటారు. ఎవరి ఆట వారే ఆడుతారని. అలాంటి కాంగ్రెస్ లో అందరినీ ఒక్కతాటిపైకి తేవడం కీలకం. అప్పుడే విజయానికి దగ్గరి దారి సాధ్యమన్న సూచనలు వస్తున్నాయి. ప్రతి ఓటమి విజయానికి మెట్టుగా చేసుకుంటేనే భవిష్యత్ అంటున్నారంతా. మరి హస్తం పార్టీ స్ట్రాటజీలు మారుస్తుందా?


కింద పడిన ప్రతిసారీ అంతకు రెట్టింపు వేగంతో లేవాలి. ఫస్ట్ కాంగ్రెస్ లో ఇది అలవాటు చేసుకోవాలన్న సూచనలు పెరుగుతున్నాయి. లక్ పైనే అన్ని ఆశలు పెట్టుకోవడం ఆపేయాలని, మైనస్ పాయింట్స్ ను గుర్తించడం, తమ తప్పుల్ని సరి చేసుకోవడం, కిందిస్థాయి నాయకత్వానికి స్వేచ్ఛ ఇవ్వడం, ప్రజలకు భరోసా వస్తేనే ఆశీర్వదిస్తారన్నది గుర్తుంచుకోవడం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి.

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. కేరళ, పంజాబ్, తెలంగాణ, నాగాలాండ్, మేఘాలయ, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అదనపు సీట్లు వచ్చాయి. బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొన్న చోట వెనుకబడిపోయింది. సార్వత్రిక ఎన్నికల నుంచి కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హర్యానాలో ఓటమి, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్‌లో పేలవప్రదర్శన ఓ సవాల్ గా మారింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి కింద పోటీ చేసిన 101 సీట్లలో కేవలం 16 స్థానాల్లో మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. స్ట్రైక్ రేట్ 16 శాతంగానే ఉండిపోయింది. అదే లోక్‌సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో 76 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. అక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కూడా ఓడిపోయారు. మహారాష్ట్రలో పోటీ చేసిన 17 ఎంపీ సీట్లలో 13 గెలుచుకుంది. దానికి, ఇప్పటి అసెంబ్లీ ప్రదర్శనకు పూర్తి రివర్స్ గా ఫలితం వచ్చింది. సో దీన్ని కచ్చితంగా డీకోడ్ చేసుకోవాలంటున్నారు.


జార్ఖండ్‌లో INDIA కూటమి విజయం సాధించినా.. క్రెడిట్ ఎక్కువగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు దక్కింది. ఎందుకంటే పోటీ చేసిన 43 సీట్లలో 34 గెలిచి 79 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. అటు కాంగ్రెస్ 30 సీట్లలో పోటీ చేసి 16 సీట్లను గెలుచుకుని 53 శాతం స్ట్రైక్ రేట్‌ను మాత్రమే సాధించింది. నిజానికి మహారాష్ట్ర వంటి వ్యూహాత్మకంగా ముఖ్యమైన రాష్ట్రంలో ఓటమి అంటే పెద్ద ఎదురు దెబ్బే. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నవంబర్ లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండూ కాంగ్రెస్ కు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. అప్పటికైనా సెట్ అవ్వాలంటే ఇప్పటి నుంచే దీర్ఘకాల వ్యూహాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read:  సీఎం అయితే ఏంటి..? కాంగ్రెస్‌లో సీతయ్య

కేవలం అదానీ ఇష్యూ, కులగణన, బీజేపీ అవినీతి చేస్తోందని ఇలాంటివి పట్టుకుని వెళ్తే ఉపయోగం ఉండబోదని, ప్రజా మద్దతును ఎన్నికల విజయాలుగా మార్చగల బలమైన సంస్థాగత నిర్మాణం అవసరం అంటున్నారు. సో ఇలాంటి సూచనలు పెరగడంతో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల తర్వాత భారీ సంస్థాగత పునర్నిర్మాణం చేపట్టాలని డిసైడ్ కూడా అయింది. 2022లో ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో అలాగే 2023లో జరిగిన రాయ్‌పూర్ ప్లీనరీలో కాంగ్రెస్ తాము ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించింది.

ప్రచారంలో క్రియేటివిటీ పెంచడం, కొత్త కొత్త పథకాలకు ఆలోచన చేయడం, అందరి సలహాలు సూచనలు తీసుకోవడం ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. సమాచార ప్రసారం రెండువైపుల నుంచి ఉండేలా చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కొత్త జెనరేషన్ వస్తోంది. సో మారిన జెనరేషన్ కు తగ్గట్లుగా వ్యూహాలు ఉండాలి. అడ్వాన్స్ డ్ గా ఆలోచిస్తేనే ఏ విజయమైనా సాధ్యమవుతుంది. ప్రజలకు ఏది అవసరమో కూడా చూడడం.. గట్టిగా కౌంటర్ చేయడం ఇవన్నీ కీలకమే. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయ పోరాటంలో దిగి వయనాడ్ లో భారీ విజయం సాధించారు. ఒకరు నార్త్, ఇంకొకరు సౌత్ కు రిప్రజెంటేటివ్. అన్నా చెల్లెలు జోడీ కాంగ్రెస్ దశ దిశను మార్చేలా సాగాలంటున్నారు. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి స్ట్రాటజీలు కూడా మారాల్సిన టైం వచ్చేసిందంటున్నారు. చేసింది చెప్పుకోకపోవడం కూడా కాంగ్రెస్ కు మైనస్ అవుతోందన్న వాదన ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ చౌరస్తాలో ఉంది. విజయమార్గంవైపు వెళ్లే దారి కూడా ఆ పార్టీ చేతిలోనే ఉంది. అయితే ఆ విజయ రహస్యాన్ని పట్టుకోవాలంతే.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×