BigTV English

Congress on PCC Members: కొత్త పీసీసీ కార్యవర్గంపై కసరత్తు.. ఛాన్స్ ఎవరికంటే..

Congress on PCC Members: కొత్త పీసీసీ కార్యవర్గంపై కసరత్తు.. ఛాన్స్ ఎవరికంటే..

Congress on PCC Members: కొత్త పీసీసీ కార్యకవర్గంపై కసరత్తు ముగింపు దశకు చేరుకున్నట్టేనా? ఈ కార్యవర్గం ఎలాంటి ప్రత్యేకతలతో ముందుకు రానుంది? ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. నూతన కార్యవర్గంలో ఉండేవారెవరు? కార్యవర్గంతో పాటు కొత్తగా ఏర్పడే కమిటీల పరిస్థితేంటి?


టీపీసీసీ కొత్త కార్యవర్గంలో జోరుగా చర్చ

గాంధీ భవన్ లో ఒకరకమైన ఆసక్తికరమైన వాతావరణంటీపీసీసీ నూతన కార్యవర్గం పై గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో లిస్ట్ రానున్నట్టు తెలుస్తోంది. గతంలో మాదిగా జంబో ప్యాక్ తరహాలో కాకుండా.. తగిన ప్రాధాన్యతతో కూడిన తక్కువ మంది సభ్యులతో.. సరిగ్గా అదే సమయంలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యతతో ఒక జాబితా తయారవుతున్నట్టు గాంధీభవన్ సమాచార్.


గతంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఈసారికి నలుగురే

గతే పీసీసీ కార్యవర్గంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. ఈ నూతన కార్యవర్గంలో నలుగురికి మాత్రమే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఎస్సీ సామజికవర్గానికి చెందిన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామజికవర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటాలో.. నాంపల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ కాండిడేట్ ఫిరోజ్ ఖాన్, లేడీస్ కోటాలో సరిత తిరుపతయ్య.. రేస్ లో ఉన్నట్టు టీ- కాంగ్రెస్ టాక్.

జనరల్ సెక్రటరీలుగా జిల్లాకు ఇద్దరు చొప్పున ఎంపిక

ఇక పీసీసీ జనరల్ సెక్రటరీ కి సంబంధించి గత కార్యవర్గం లో జంబో ప్యాక్ లో సుమారు 90 మంది సభ్యులుండే వారు. కానీ ఈ సారి ఆలా కాకుండా పరిమితంగా.. జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం సిన్సియర్ గా పని చేసే వారికీ అవకాశం కల్పించనున్నట్లు గాంధీభవన్ అంతర్గత సమాచారం.. వీటితో పాటు పీసీసీ సెక్రటరీ, స్పోక్స్ పర్సన్స్ విషయంలో కూడా ఆచి తూచి ఎంపిక చేస్తున్నట్టు చెబుతున్నారు.

Also Read: మూసీ కోసం రూ.10వేల కోట్లు కేటాయించండి.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌కు సీఎం రేవంత్ వినతి..

కోర్ కమిటీలో 12- 15 మంది సభ్యులుండే ఛాన్స్

ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డికి ప్రచారం కమిటి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆయన మాత్రం ఈ పదవి పై ఏమంత ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు.. దీంతో పాటు పార్టీ లో కీలకమైన కోర్ కమిటి ని ఏర్పాటు చేయనున్నట్లు.. ఈ కమిటి లో 12 నుండి 15 మంది సభ్యులుండే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ ముఖ్యమైన పొలిటికల్ డిస్కషన్ కమిటి లో పీసిసి ప్రెసిడెంట్, సిఎం, ఏఐసిసి ఇన్ ఛార్జ్, ఏఐసిసి ఇన్ ఛార్జ్ సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు, మాజీ పీసీసీ, సిఎల్పీ నాయకులు, ఇంకా సీనియర్ నాయకుల్లో ఒకరు లేదా ఇద్దరికీ అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది.

గాంధీ భవన్ లో ఒకరకమైన ఆసక్తికరమైన వాతావరణం

మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నూతన పీసీసీ కార్యవర్గం కమిటి.. జాబితా అత్యంత త్వరలో విడుదల కానునుండటంతో.. గాంధీభవన్ లో ఒకరకమైన ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×