BigTV English

Akhanda 2 Update : బాలయ్య పని అయిపోయింది… ఇక మిగిలింది పవన్‌తో ఫైటింగే

Akhanda 2 Update : బాలయ్య పని అయిపోయింది… ఇక మిగిలింది పవన్‌తో ఫైటింగే

Akhanda 2 Dubbing Completes: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2 Movie). గతంలో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకున్నాయి. అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో బాలయ్య డ్యుయోల్ రోల్ పోషించాడు. అఘోరిగా అదరిగొట్టారు. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా బాలయ్య బోయపాటి కాంబో అంటే ఫ్యాన్స్ కి పూనకాలే అనడంలో సందేహం లేదు.


అఖండ 2 అప్డేట్

ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వదిలింది మూవీ. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుతోంది మూవీ టీం. ఇందులో భాగంగా ఇటీవల అఖండ 2 బాలయ్య డబ్బింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. తెలుగులోనే కాదు హిందీలో బాలయ్య అఖండ 2 డబ్బింగ్ (Akhanda 2 Dubbing) చెప్పారట. ఇది తెలిసి ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. మరోవైపు అఖండ 2 నిర్మాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదేమైన సెప్టెంబర్ 25న వచ్చేస్తున్నామంటూ మూవీ టీం పేర్కొంది.


డబ్బింగ్ పూర్తి

ఈ అప్డేట్ అఖండ 2 విడుదలపై వస్తున్న రూమర్స్ మూవీ టీం చెక్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ కూడా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. అదే డేట్ కి అఖండ 2 రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. దీంతో బాక్సాఫీసు వద్ద పవన్, బాలయ్య వార్ ఉంటుందా? ఎవరైనా వెనక్కి తగ్గుతారా? అనే వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో ఓజీని సెప్టెంబర్ 25నే తీసుకువస్తామని నిర్మాత డీవీవీ దానయ్య స్పష్టం చేశారు. దీంతో అఖండ 2 వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అఖండ 2 టీం కూడా సెప్టెంబర్ 25న బాక్సాఫీసు దుమ్ములేపాస్తామంటుంది.  దీంతో బాక్సాఫీసు వద్ద ఓజీ, అఖండ 2 ల పోటీ తప్పదని, ఇందులో ఎవరిది పై చేయి అవుతుందా? ఆడియన్స్, ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

డిసెంబర్ లో అఖండ 2?

మరోవైపు ఓజీ, అఖండ 2లో ఏ సినిమా అయినా వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో అఖండ 2నే వెనక్కి వెళుతుందంటున్నారు. సెప్టెంబర్ 25న ఓజీని, డిసెంబర్ 5న అఖండ 2 విడుదల అయ్యే అవకాశం ఉందట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర్ మూవీ నవంబర్, ప్రభాస్ రాజాసాబ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచన ఉన్నారట. ఇలా అయితే వరుసగా పెద్ద హీరోల  సినిమాలతో బాక్సాఫీసు సందడి ఉండగా.. ఎలాంటి క్లాష్, పోటీ లేకుండ కూల్ హీరోలు వచ్చి వెళ్లిపోతారని అంటున్నారు.

Related News

Actor Satya Dev: మూడ్ సరిగ్గా లేకపోతే చేసేది ఆ పనే… వ్యసనంలా మారిపోయిందంటున్న సత్య దేవ్!

Ntr Dragon: తారక్‌కు క్లైమాక్స్ ఇచ్చేశాడు… నీల్ మావా ప్లాన్ మామూలుగా లేదుగా

Ankita Singh: 3 లక్షలు ఇస్తే 15 నిమిషాలు టైం ఇస్తా… హీరోయిన్ ఓపెన్ ఆఫర్

Lokesh Kanagaraj: నటుడుగా లోకేష్ కనగరాజ్, అందుకే ఇన్ని గెటప్స్

Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది

Rashmika: రష్మికపై డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయిస్తుంది ఎవరు.. ?

Big Stories

×