Big Tv Live Originals: చరిత్రలో ఎన్నడూ జరగని అరుదైన ఘటన.. మరణించిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.. 1940 లో యూఎస్ లోని ఒహియో ప్రాంతంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చార్లెస్ బి టేలర్ అనే వ్యక్తి పోటీ చేశారు. అయితే ఓటింగ్ రోజున అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినప్పటికీ ఆయన పేరు బ్యాలెట్‌పై ఉండటంతో.. ఓటర్లు అందరూ అతనికి ఓటు వేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎన్నికల్లో గెలిచారు.
ఈ సంఘటన అమెరికాలోని ఒహియో ప్రాంతంలో చోటుచేసుకుంది. చార్లెస్ బి టేలర్ అనే వ్యక్తి గౌరవనీయమైన వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ.. అక్కడ ప్రజల మనసులను గెలుచుకున్నారు. పేదలకు విద్య, వైద్యం, స్వయం ఉపాధి, విపత్తు నివారణలో గణనీయమైన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో చార్లెస్ గుండెపోటుతో మృతి చెందారు. అయితే బ్యాలెట్లలో ఆయన పేరు ఉండడంతో తొలగించే అవకాశం లేకుండా పోయింది. అయినా కూడా చాలా మంది ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ.. చార్లెస్‌కు ఓట్లు వేశారు.
కాగా ఒహియో ప్రాంతంలోని స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. చార్లెస్ బి టేలర్ భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు తేలింది. ఈ న్యూస్ అప్పట్లో స్థానికంగా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయంగా మారింది. అయితే చట్ట ప్రకారం.. మృతి చెందిన వ్యక్తి పదవిని చేపట్టలేరు కాబట్టి.. ఆ స్థానంలో మరొక వ్యక్తిని అధికారులు నియమిస్తారు. కొందరు దీనిని ఓటర్ల నిరసనగా భావించగా.. మరి కొందరు చార్లెస్ టేలర్ పట్ల ప్రజలకున్న అభిమానంగా చూశారు.
Also Read: మతి స్థితిమితం లేని యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు.. 10 రోజులుగా కోమాలో..
ఈ సంఘటన ఎన్నికల చరిత్రలోనే ఒకటిగా నిలిచింది. ఆ రోజుల్లో ఎన్నికల నిర్వహణ సమయంలో టెక్నికల్ గా కొన్ని పరిమితులు ఉండేవి. ఇవి ఇలాంటి అసాధారణ ఫలితాలకు దారితీశాయి. చార్లెస్ టేలర్ కథ ఈరోజుకి కూడా చరిత్రలో ఓ అధ్యయనంగా మిగిలిపోయింది. ఒక సామాన్య వ్యక్తి.. తన మరణంతో కూడా సమాజంలో శాశ్వత ముద్ర వేయగలడని ఈ సంఘటన నిరూపించింది. ఈ కథ ఓటు శక్తిని, ప్రజల భావోద్వేగాలను, చరిత్రలోని అనూహ్య మలుపులను గుర్తు చేస్తుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకోబడును.