BigTV English

Beaches in India: గోవా ఈజ్ ఓల్డ్.. ఈ ప్రాంతాలు కూడా బీచ్ పార్టీలకు ఫేమస్, ఇండియాలోనే!

Beaches in India: గోవా ఈజ్ ఓల్డ్.. ఈ ప్రాంతాలు కూడా బీచ్ పార్టీలకు ఫేమస్, ఇండియాలోనే!

Beaches in India: బీచ్ పార్టీస్, లేట్ నైట్ మ్యూజికట్ నైట్, వైన్ పార్టీ అనగానే చాలా మందికి గోవానే గుర్తొస్తుంది. అసలే సమ్మర్ కదా..? వర్క్ నుంచి లాంగ్ బ్రేక్స్ తీసుకొని అలా చిల్ అవ్వడానికి బీచ్‌కి వెళ్లాలని అనుకుంటారు. కానీ, అందరు వెళ్లిన ప్రదేశానికే వెళ్తే ఏం బాగుంటుంది. అందుకే గోవా మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న కొన్ని ఫేమస్ బీచ్‌ల వివరాలను తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


గోకర్ణ, కర్ణాటక
కర్ణాటక తీరంలో ఉన్న గోకర్ణ కూడా గోవా లాగానే రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్. ఒకప్పుడు గోకర్ణ అనగానే గుళ్లు, గోపురాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు గోకర్ణ కూడా కాస్త ట్రెండ్ మార్చిచ బీచ్ పార్టీలు, ఫైర్ షోలు, చిల్లింగ్ ప్లేసెస్‌కి హాట్‌స్పాట్‌గా మారింది. బీచ్ వైబ్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వారు ఇక్కడ ఉండే కుడ్లే బీచ్ లేదా ఓం బీచ్‌కి వెళ్లడం బెటర్ ఆప్షన్. వైన్ తాగుతూ చిల్ అవ్వాలి అనుకునే వారి కోసం అక్కడ బార్‌లు కూడా లేట్ నైట్ వరకు తెరిచే ఉంటాయట. మెలో సెట్‌లతో DJలు కూడా అందుబాటులో ఉంటాయట.వర్కాల, కేరళ
కేరళలో ఉన్న వర్కాలలో క్లిఫ్‌సైడ్ కేఫ్‌లు, ఓషన్ బ్రీజ్, సన్‌సెట్ కాక్‌టెయిల్స్ చాలా ఫేమస్. మరీ గోవా రేంజ్‌లో కాకపోయినా ఇక్కడ కూడా క్లిఫ్-టాప్ కేఫ్‌లు, నైట్ లైవ్ మ్యూజిక్, ఫైర్ ప్రదర్శనలు, చిల్అవుట్ DJలతో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని ప్రదేశాలలో ఆల్కహాల్ లభిస్తుంది. పార్టీలను ఇష్టపడే వారికి వాతావరణం కొంచెం ప్రశాంతంగా, మనోహరంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా నార్త్ క్లిఫ్ నుండి బ్లాక్ బీచ్ వరకు అద్భుతమైన వ్యూ చూడొచ్చు.

పాండిచ్చేరి, తమిళనాడు
ఇండియాన్ బీచ్‌లో వెస్టర్న్ స్టైల్ పార్టీ వైబ్ కావాలంటే తమిళనాడులో ఉన్న పాండిచ్చేరికి వెళ్లడం బెస్ట్. రూఫ్‌టాప్ బార్‌లు, కేఫ్‌లు, సముద్రతీర పార్టీలను కూడా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా రాక్ బీచ్, సెరెనిటీ బీచ్ సమీపంలో నైట్ పార్టీస్ జరుతాయి. ఇక్కడ ఆల్కహాల్ కూడా చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతుందట. అంతేకాకుండా వీకెండ్స్‌లో మ్యూజిక్, ఆర్ట్ షోలు, థీమ్ నైట్స్‌తో పార్టీ వైబ్స్ గట్టిగేనే ఉంటాయి.


అలీబాగ్, మహారాష్ట్ర
చల్లటి వేదర్.. తీరప్రాంతం.. రిలాక్స్ అవ్వడానికి ప్రైవేట్ విల్లాస్.. హాలిడే ఎంజాయ్ చేయడానికి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి…? మహారాష్ట్రలో ఉన్న అలీబాగ్‌కు వెళ్తే సేమ్ ఇలాంటి వైబ్ ఉంటుంది. ఈ ప్లేస్ కూడా ఎంతో దూరంలో లేదు. ముంబై నుండి జస్ట్ ఒక చిన్న రైడ్‌లోనే ఇక్కడికి చేరుకోవచ్చు. వీకెండ్ బీచ్ పార్టీలు, విల్లా టూర్స్‌కి వెళ్లడానికి అలీబాగ్ బెస్ట్ డెస్టినేషన్. పబ్లిక్ నైట్ లైఫ్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఫన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రైవేట్ బీచ్ హౌస్‌లలో చాలా పార్టీలు జరుగుతాయి. ఇక్కడ DJలు, పూల్ పార్టీలు సన్‌డౌన్‌లు రాజ్యమేలుతాయి. ఫ్రెండ్స్‌ లేదా గ్రూప్స్‌తో వెళ్లే వాళ్లు ముందే విల్లా బుక్ చేసుకోవడం మంచిది.

ALSO READ: జీవితంలో ఒక్కసారైనా ఈ ప్లేస్ చూడాలి..?

కోవలం, కేరళ
రెట్రో వైబ్‌ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే వారు కేరళలో ఉన్న కోవలం వెల్లడం మంచిది. 70లలో ఇండియాలో బీచ్ అంటే కోవలం వెళ్లేవారట. ఈ గోవా ట్రిప్స్ ఎక్కువైపోవడం వల్ల మెల్లగా కోవలం కాస్త ఓవర్ రేటెడ్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ ప్లేస్ కూడా మళ్లీ గాడిలోకి వస్తోంది. ఇక్కడ కూడా లైట్‌హౌస్ బీచ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీచ్‌సైడ్ బార్‌లు, లేట్ నైట్ పార్టీలు జరుగుతాయి. అంతేకాకుండా కోవలంకు దగ్గర్లో ఉన్న త్రివేండ్రంలో ట్రెండీ పబ్‌లతో నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

కసోల్&తోష్, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో ఉండే కసోల్&తోష్‌ని మరో గోవా అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో బీచ్ లేనప్పటికీ అక్కడ ఉండే వైబ్ మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఇక్కడ కూడా లేట్ నైట్ పార్టీలు జరుగుతాయి కాబట్టి గోవా కల్చర్ ఎక్కువే కనిపిస్తుంది. కసోల్&తోష్‌లో ఓపెన్-ఎయిర్ కేఫ్‌లు, ఫారెస్ట్ రేవ్‌లు, గ్లోబల్ బ్యాక్‌ప్యాకర్ క్రౌడ్‌లు అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మ్యూజిక్, చిల్ వైబ్‌ల ఉంటాయి కబాట్టి ఎక్కువే ఎంజాయ్ చేయొచ్చు.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×