BigTV English

Dharmapuri Arvind: అధ్యక్ష పదవి నుంచి ధర్మపురి అవుట్.? కారణం ఇదే..!

Dharmapuri Arvind: అధ్యక్ష పదవి నుంచి ధర్మపురి అవుట్.? కారణం ఇదే..!

Dharmapuri Arvind: తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో అర డజనుకు పైగా పేర్లు యమ స్పీడ్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడు ఏ పేరు తెర మీదకు వస్తుందో.. ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారో అంతా సస్పెన్స్ గా తయారైంది. మహిళా అని కొందరు, బీసీ నేత అని కొందరు, కొత్త నేతలు కాదు పాత నేతకే అధ్యక్ష పదవి అంటూ మరికొందరు రకరకాల ప్రచారాలకు తెర లేపుతున్నారు. ఆ క్రమంలో ప్రెసిడెంట్ పదవిపై సస్పెన్స్‌కు తెర దించడానికి ఢిల్లీ పెద్దలు కసరత్తు మొదలు పెట్టారంటున్నారు.. పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఉత్సాహ పడుతున్న నేతలను రేసులో నుంచి ఎలిమినేట్ చేసే పనిలో పడ్డారంట.


తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీకి కసరత్తు

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీపై కాషాయ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. 38 జిల్లాలకు గాను 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి సంస్థాగతంగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు అర్హత సాధించిన రాష్ట్ర బీజేపీ స్టేట్ అధ్యక్ష రేసులో ఉన్న ఆశావహులపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రేసులో ఉన్న ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయనుందనే టాక్ వినిపిస్తోంది.. అధ్యక్షుడు రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, రఘునందన్రావు, మురళీధర్రావు, మహిళా కోటలో డీకే అరుణ లతో పాటు మరికొంత మంది పేర్లు బలంగా వినిపించాయి.


ఇక సంస్థాగత ఎన్నికలు ముగింపు దశకు వచ్చిన నేపధ్యంలో అధిష్టానం ఒక్కొక్కరిని అధ్యక్ష రేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎలిమినేషన్ ఎపిసోడ్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మొదటగా చెక్ పెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది.

2019 ఎన్నికల్లో పసుపు బోర్డు హామీ ఇచ్చిన అరవింద్

2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తాననే హమీతో ధర్మపురి అరవింద్ ఎన్నికలకు వెళ్లి అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితకు చెక్ పెట్ట గలిగారు. అప్పట్లో పార్టీకి సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా బాండ్ పేపర్ రాసి మరీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రచారం చేసుకున్నారు. పార్టీ పరంగా బీజేపీ దానిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ అరవింద్ కేంద్ర పెద్దలను ఒప్పించిపసుపు బోర్డును సాధించడంలో సక్సెస్ అయ్యారు. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయించగలిగారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు బోర్డు చైర్మన్‌గా సైతం ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన వ్యక్తినే కేంద్ర ప్రభుత్వం నియమించడంతో అరవింద్ కు అధ్యక్ష పదవి లేనట్లే అంటున్నారు.

ధీమాగా కనిపిస్తున్న ఈటల రాజేందర్, రామచంద్రరావు

తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.. ఎవరికి వారు అధ్యక్ష పీఠం తమకే దక్కుతుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. అయితే రేసులో ఉన్న వారిని ఒక్కొక్కరి ఈక్వేషన్స్ బట్టి ఫిల్టర్ చేసే పనిలో అధిష్టానం ఉన్నట్టుగా తెలిస్తోంది. అధ్యక్ష రేసులో అధిష్టానం ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పోటీలో ఉన్న వారిలో కొందరు అధిష్టానం దయాదాక్షిణ్యాల కోసం ఆశగా ఎదురు చూస్తుంటే, ఈటల రాజేందర్, రామచంద్రరావులు మాత్రం ప్రెసిడెంట్ పోస్టు తమకే దక్కుతుందని చాలా కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు.

సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు

పోలింగ్ బూత్ స్థాయి నుంచి, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాషాయదళం దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటోంది. జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలకు స్టేట్ ప్రెసిడెంట్లను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది.. రామ మందిరం పేరుతో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పరివారులు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు.

సంస్థగత నిర్మాణంతో పాటు మహిళలను ఆకర్షించడానికి పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ ఫార్ములాతో దేశ వ్యాప్తంగా మహిళా లోకానికి దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే 33 శాతం మహిళా రిజర్వేషన్లను పార్టీ పదవుల్లో కూడా అమలుచేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈనేపథ్యంలో 5 నుంచి 6 రాష్ట్రాలకు మహిళా అధ్యక్షులను నియమించే చాన్స్ కనిపిస్తోంది.

10 జిల్లాలకు మహిళా ప్రెసిడెంట్ల నియామకం

Also Read: తట్టుకోలేకపోతున్నా రాజా సింగ్.. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు

అయితే రాష్ట్రంలో కూడా మహిళలకు పెద్ద పీట వేయాలని నేతలు చెబుతున్నప్పటికీ అవి మాటల వరకే పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33 పర్సెంట్ ఫార్ములా ప్రకారం బీజేపీ సంస్థాగతంగా విభజించుకొన్న 39 జిల్లాల్లో కనీసం 10 జిల్లాలకు తక్కువ కాకుండా జిల్లా అధ్యక్ష బాధ్యతలు మహిళలకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అధ్యక్షలను ఖరారు చేసిన 19 జిల్లాల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు. మరి అధిష్టానానికి మహిళలపై ఉన్న లెక్కలేంటో కాని.. మహిళా కోటాలో తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని డీకే అరుణ నమ్మకంతో కనిపిస్తున్నారు.

అరవింద్ నిజంగానే ఎలిమినేట్ అయ్యారా?

అధ్యక్ష రేసు నుంచి ధర్మపురి అరవింద్ ఎలిమినేట్ అయ్యారని పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నప్పటీ .. అరవింద్ మాత్రం ఆ పదవిపై దింపుడు కళ్లెం ఆశలతోనే కనిపిస్తున్నారు. అలాగే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైతం వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు పార్టీ తన వైపే మొగ్గు చూపుతోందని ప్రగాఢమైన విశ్వాసంతో కనిపిస్తున్నారు. మొత్తం మీద పార్టీ వర్గాలలో జరుగుతున్న చర్చల ప్రకారం తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ రేసు నుంచి అరవింద్ నిజంగానే ఎలిమినేటర్ అయ్యారా? అధిష్టానం దృష్టిలో ఉన్న ఆ ఒక్కనేత ఎవరు? మిగిలిన వారందరిదీ పదవిపై ఉత్తుత్తి ధీమానేనా? తేలాలంటే ఈ నెలాఖరు వరకు వేయిట్ చేయాల్సిందే అంటున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×