BigTV English

MLA Raja Singh: తట్టుకోలేకపోతున్నా రాజా సింగ్.. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు

MLA Raja Singh: తట్టుకోలేకపోతున్నా రాజా సింగ్.. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు

గోషామహల్ నుంచి మూడో సారి గెలిచిన రాజాసింగ్

గ్రేటర్ హైదరాబాద్ లో 2014 నుంచి బీజేపీ గెలుస్తున్న సీటు గోషామహల్. పాత బస్తీతో కొంత కలిసి ఉండే ఈ స్థానంలో రాజాసింగ్ బలమైన నేతగా ఎదిగారు. వరుసగా మూడుసార్లు గెలిచారు. స్థానిక ప్రత్యర్థి మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచారు. అయితే, 2023 ఎన్నికల్లో గెలిచన తర్వాత తనకు బీజేపీ శాసన సభా పక్ష నేత పదవి వస్తుందని ఆయన ఆశించారు. ఆ తర్వాత పార్టీ పదవిపైనా ఆశ పెట్టుకున్నారని చెబుతున్నారు. అయితే పదవుల విషయంలో పార్టీ పరంగా ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి ఎలాంటి న్యాయం జరగలేదు. అయినా సైలెంట్‌గా ఉన్న రాజాసింగ్ తాజాగా మరోసారి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.


రాజాసింగ్ ప్రతిపాదనను పట్టించుకోని బీజేపీ

ఇటీవల బిజెపి జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను, తాజాగా మరో నలుగురు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నలుగురి పేర్లలో రాజాసింగ్ సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కారణమైందంట. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడి ఉమా మహేశ్ పేరును అధిష్టానం ప్రకటించడం రాజాసింగ్ కు మింగుడు పడటం లేదంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా రాజాసింగ్ పోటీ చేసినప్పుడు ఉమా మహేశ్ సహకరించలేదంట. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలతో ఉమా మహేశ్ కుమ్మక్కు అయ్యారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.

గోల్కొండ బీజేపీ అధ్యక్షుడిగా ఉమామహేష్

వాస్తవానికి రాజాసింగ్ సూచించిన పేరు కాకుండా ఉమా మహేశ్ పేరు పదిరోజుల క్రితమే పార్టీ అధిష్టనానం ప్రకటించింది. అప్పట్లో రాజాసింగ్ వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం గోల్కొండ జిల్లాను పెండింగ్ లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో గోల్కొండ జిల్లా అధ్యక్షుడుగా ఉమా మహేశ్ పేరును అధిష్టానం మరో మారు ప్రకటించింది. దీంతో రాజాసింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆడియో ఒకటి విడుదల చేశారు. నా అవసరం లేదంటే పార్టీ నుంచి నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ధిక్కారస్వరం వినిపించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల కాక.. ఆ సీట్లో ఎవరు గెలుస్తారంటే

హైదరాబాద్ నుంచి గెలిచిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే

హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే నేతగా రాజాసింగ్‌కు గుర్తింపు ఉంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినప్పటికీ ఆయన్ని ఫక్తు కాషాయ నేతగానే చూస్తారు. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బిజెపి ఆయన్ని గతంలో సస్పెండ్ చేసింది. దాదాపు రెండేళ్లు ఆయనపై సస్పెన్షన్ కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిజెపి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించకపోవచ్చని ప్రచారం జరిగింది. చివరిక్షణంలో ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును బిజెపి ఎత్తేసింది. బిజెపి నుంచి మూడోసారి గెలిచి హట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా రాజాసింగ్ గుర్తింపు పొందారు.

ఒక జిల్లా అధ్యక్షుడి విషయంలో పరాభవం

పార్టీ పరంగా రాజాసింగ్‌కు ఎలాంటి ప్రాధ్యానతా లభించలేదు. హిందుత్వ వాదిగా ముద్ర ఉన్న రాజా సింగ్ హైదరాబాద్ నుంచి గెలిచిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే. ప్రతీ బహిరంగ సభలో తనదైన శైలిలో ప్రసంగాలు చేసే ఆయన ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. ఆఖరికి ఆయన ఫేస్ బుక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ కు సొంత పార్టీలో .. అది కూడా ఒక జిల్లా అధ్యక్షుడి విషయంలో పరాభవం ఎదురవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయంట. మరి ఆ కరుడు గట్టిన హిందుత్వవాది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×