BigTV English

Rashmika Mandanna : పుట్టిన ఊరు మరిచిపోతే ఎలా రష్మిక? మెట్టినింటిపై అంత ప్రేమా..?

Rashmika Mandanna : పుట్టిన ఊరు మరిచిపోతే ఎలా రష్మిక? మెట్టినింటిపై అంత ప్రేమా..?

Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరస హిట్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించిన రష్మికకు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ మూవీ నేషనల్ వైడ్ గా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో అమ్మడుకి క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. గతంలో బాలీవుడ్ లో యానిమల్ సినిమాలో నటించి మంచి సక్సెస్ ను అందుకోవడంతో అక్కడ వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం హిందీలో రష్మిక నటించిన ఛావా మూవీ నిన్న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ప్రీమియర్ షోలో రష్మిక మాట్లాడిన వ్యాఖ్యల పై ట్రోలింగ్ జరుగుతుంది..


Also Read : ఆర్జీవికి మోహన్ బాబు అంటే ఎందుకంత కోపమో తెలుసా..?

తాజాగా రష్మిక మందన్న, విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో రష్మిక తనది హైదరాబాద్ అని చెప్పుకుంటున్న వీడియో వైరల్ కావడంతో కొందరు కన్నడిగులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.. తెలుగు సినిమాలతోనే పాపులర్ అయింది. తెలుగు నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే ఇప్పుడామె ఎక్కడికి వెళ్లినా తనది హైదరాబాద్ అని చెప్పుకుంటోంది. తాజాగా ఛావా మూవీ ప్రమోషన్లలో భాగంగా కూడా రష్మిక మాట్లాడుతూ.. నేను ఒక హైదరాబాదీని అన్నది. కానీ ఇక్కడికి ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు నేను కూడా మీ కుటుంబంలో ఒకరని అనుకుంటున్నాను. థ్యాంక్యూ అని రష్మిక చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రస్తుతం ఆ పై అటు కన్నడి అభిమానులు, ఇటు తెలుగు ఫ్యాన్స్ ఆమెను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట కావడం విశేషం. అందుకే ఆ అభిమాని అలా కామెంట్ చేశారు. ఇక మరొకరు స్పందిస్తూ.. ఇన్నాళ్లూ నిన్ను అందరూ ట్రోలింగ్ చేస్తుంటే వాళ్లను తప్పుబట్టాను కానీ.. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే వాళ్ళ తప్పేమి లేదు.. నువ్వు అలా అంటున్నావు..  అందుకే అందరు అలా అనుకుంటున్నారు అని ట్వీట్ చేశారు. ఇక నెటిజన్లు మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తెలుగులో పుష్ప 2 మూవీలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. తాజాగా విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విక్కీ, రష్మిక నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి ఈ మూవీ కూడా హిట్ అయ్యింది. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ మూవీలో నటిస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×