OTT Movie : కొరియన్, జపనీస్ సినిమాలను మన ప్రేక్షకులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కొరియన్ వెబ్ సిరీస్ లకు మన ప్రేక్షకుల వల్లే ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మంచి కంటెంట్ తో సరదాగా సాగిపోయే, ఒక జపనీస్ మూవీ గురించి తెలుసుకుందాం. టీచర్, స్టూడెంట్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ జపనీస్ డ్రామా మూవీ పేరు ‘గోకుసెన్’ (Gokusen). ఒక కాలేజీలో స్టూడెంట్స్ ని దారిలో పెట్టడానికి, ఒక టీచర్ని అపాయింట్ చేస్తారు. టీచర్, స్టూడెంట్ ల మధ్య మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక కాలేజీలో టీచర్గా ఆ పాయింట్ అవుతుంది. ఆ కాలేజీలో స్టూడెంట్స్ చాలా దారుణంగా ఉంటుంది. చదువు కంటే గ్యాంగ్ గా తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చిన హీరోయిన్ ఒక గ్యాంగ్ స్టర్ కూతురు. ఆమెకు అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ లో ఎక్కువగా ఉంటుంది. కొద్దిరోజుల క్రితమే ఒక విమానం హైజాక్ అయినప్పుడు, హీరోయిన్ హైజాకర్లను కొట్టి అందర్నీ కాపాడుతుంది. ఈ విషయం తెలిసే స్కూల్ ప్రిన్సిపాల్, ఆమెను టీచర్గా అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు స్టూడెంట్స్ ని దారిలో పట్టే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్. అయితే అదే సమయంలో అక్కడ ఉండే ఒక స్టూడెంట్ కి, డ్రగ్స్ అమ్మే గ్యాంగ్ లకు ఒక గొడవ జరుగుతుంది. ఆ గ్యాంగ్ పై స్టూడెంట్ చేయి చేసుకోవడంతో, వాళ్లు మరి కొంతమందిని తీసుకొని అతన్ని కొట్టడానికి వస్తారు. ఈలోగా ప్రిన్సిపాల్ పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు.
మరోసారి స్టూడెంట్స్ తో ఇలా ప్రాబ్లం వస్తే ఉద్యోగం నుంచి తీసేస్తానని హీరోయిన్తో చెప్తాడు ప్రిన్సిపాల్. ఈ విషయం విని స్టూడెంట్ ఆ గ్యాంగ్ స్టర్ దగ్గరికి వెళ్తాడు. ఒంటరిగా వెళ్లాడని తెలుసుకున్న హీరోయిన్ అతన్ని కాపాడడానికి వెళుతుంది. స్టూడెంట్ ని రౌడీ గ్యాంగ్ దారుణంగా కొడుతుంటారు. హీరోయిన్ వాళ్లతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కాలేజీ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చి వాళ్లను తరిమేస్తారు. అప్పట్నుంచి స్టూడెంట్స్ టీచర్ తో మంచిగా ఉండటం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అదే స్టూడెంట్ కనిపించకుండా పోతాడు. వీళ్లంతా అతన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ఆ స్టూడెంట్ ఎందుకు కనిపించకుండా పోయాడు? గ్యాంగ్ స్టర్ లను హీరోయిన్ ఎలా ఎదుర్కొంటుంది? ఆ స్కూల్లో అందరూ మంచి పొజిషన్ కి వస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే.