Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప 2 మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించాడు. దాదాపు 1800 కోట్లకు పైగా వసూలు సాధించి అరుదైన రికార్డ్ని సొంతం చేసుకుంది. ఒకవైపు విమర్శలు ఎదురవుతున్న సరే సినిమా కలెక్షన్లలో మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ఈ మూవీ తర్వాత తమిళనాడు డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్లోకి ఎంట్రీ పోతున్నారంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఆ సినిమాలో స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని టాక్..
బాలీవుడ్ మూవీలో అల్లు అర్జున్..
ఈమధ్య స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇద్దరు హీరోలతో సినిమా రావడంతో జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ సింగిల్గానే సినిమాలు చేశాడు.. మొదటిసారి మరో స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అలాగే ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్, కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తుంది.. అయితే ఈ కాంబోలో పాన్ఇండియా స్థాయిని మించి తెరకెక్కనుందని సమాచారం. ఇందులో బన్నీకి పోటీగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించబోతున్నారంటూ టాక్.. హొంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ఈ కాంబోను ఒప్పించే పనిలో పడిందట. ఈ ప్రాజెక్ట్ పై చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read: రజినీకాంత్ మనసు బంగారమే మామా.. 350 మందికి సాయం..
అట్లీ- అల్లు అర్జున్ మూవీ..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ పై రూపొందుతుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరెకెక్కిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే షారుఖ్ కింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట బన్నీ.. ఒకవేళ ఈ సినిమా గానీ ఓకే అయితే మాత్రం ఈ డికేడ్ లోనే భారీ యాక్షన్ సినిమా అయ్యే ఛాన్స్ ఉందనీ బన్నీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.. అల్లు అర్జున్ కు పుష్ప మూవీతో మంచి క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఏ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. అటు బాలీవుడ్ లోనూ.. బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేస్తున్నారు..