Rain Alert: హైదరాబాద్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో మరికాసేపట్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సెంట్రల్ తెలంగాణలోని నాల్గొండ, సూర్యపేట్, యాదాద్రి, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ములుగు, సిద్దిపేట్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి.. ఈ లోపే మీరు ఆఫీసులకు చేరుకోండి. అయితే, సాయంత్రం మాత్రం.. భారీ ట్రాఫిక్ జామ్‌లను చూడాల్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. అందుకు ప్రిపేర్డ్‌గా ఉండండి.
ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోయి నరకయాతన అనుభవించారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దూరంలో ఉన్న వాహనాలు, భవనాలు కూడా కనిపించనంతగా వర్షం పడింది. నాలాలు పొంగి ప్రవహించాయి.
Also Read: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి
ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్ ప్రాంతాల్లో అరగంట వాన పడితే చాలు.. ప్రధాన రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. ఆఫీసుల నుంచి బయలుదేరిన సమయంలో వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ క్లియర్ కావడం లేదు.
బీ అలర్ట్..
నగరమంతటా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు ఎక్కడ ఉన్నవారు అక్కడే సురక్షితంగా ఉండాలని కోరారు. ఏదైనా ప్రమాదానికి గురైతే.. తక్షణ సహాయం కోసం 100కు డయల్ చేయాలని సూచించారు. పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి అనూహ్య వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.