PVNS Rohit..ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2023వ సంవత్సరానికి గానూ .. మొత్తం 15 విభాగాలలో నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. ఉత్తమ నటుడు మొదలుకొని ఉత్తమ సింగర్స్ వరకు ఇలా చాలామందికి నేషనల్ అవార్డ్స్ లభించాయి. అలా ఈసారి నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ (Balakrishna) ‘భగవంత్ కేసరి’ నేషనల్ అవార్డు అందుకోగా.. ఇటు బేబీ(Baby ) చిత్రానికి కూడా రెండు విభాగాలలో నేషనల్ అవార్డ్స్ లభించాయి. అందులో ఒకటి బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు. అలా నేషనల్ అవార్డు అందుకొని అందరి దృష్టిలో పడ్డ ప్లే బ్యాక్ సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ (PVNS Rohit) .. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధం అయిపోయారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు..
సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వంలో ఎస్కేఎన్ (SKN ) నిర్మాణంలో చిన్న సినిమాగా తెరకెక్కిన చిత్రం బేబీ (Baby ). ఇందులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anandh Deverakonda), విరాజ్ అశ్విన్, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ప్రతి పాట కూడా యువతను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో “ప్రేమిస్తున్న” అనే పాట అటు నేషనల్ అవార్డ్స్ జ్యూరీ5 మెంబర్స్ ని కూడా మెప్పించింది. ఈ పాటను పాడిన పీవీఎంఎస్ రోహిత్ కి ఏకంగా నేషనల్ అవార్డు లభించింది.
ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రోహిత్..
ఇలాంటి సంతోషకరమైన సమయంలో రోహిత్ మరో శుభవార్త తెలిపారు. ఇన్ని రోజులు తాను ప్రేమించిన అమ్మాయి డాక్టర్ శ్రేయను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. శ్రేయతో నిశ్చితార్థమైన తర్వాత ఆ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..”నా లక్కీ గర్ల్ ని నిశ్చితార్థం చేసుకున్నాను” అని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సింగర్ రోహిత్ కి పలువురి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే మొన్న నేషనల్ అవార్డు.. నేడు నచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం నీ అదృష్టం మామూలుగా లేదు గురూ అంటూ పలువురు నెటిజన్స్ కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
సింగర్ రోహిత్ కెరియర్..
ఇక రోహిత్ కెరియర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలకు సింగర్ గా పని చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో “మనసా మనసా” పాటకు తన గాత్రాన్ని అందించిన రోహిత్.. కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో కూడా అనుదీప్ తో కలిసి “ఓ బాటసారి” పాటకు పాడాడు .అలాగే కొండపొలం, సరిపోదా శనివారం, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్, జయమ్మ పంచాయతీ, ప్రేమ కథ చిత్రం 2, ప్రియురాల, కౌసల్య తనయ రాఘవ ఇలా పలు చిత్రాలకు అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ALSO READ: Actor Shot dead:కాల్పుల్లో హీరో మృతి… సాయం చేయడానికి వెళ్లి పరలోకానికి