BigTV English

Nirmala Sitharaman: అందరిదీ ఒకే రాగం.. నిర్మల ఇచ్చేనా వరం?

Nirmala Sitharaman: అందరిదీ ఒకే రాగం.. నిర్మల ఇచ్చేనా వరం?
Nirmala Sitharaman

బడ్జెట్ వస్తోందంటే చాలు… ఈసారైనా పన్నులు తగ్గిస్తే బాగుంటుందని, వేతన జీవి నుంచి బడా కార్పొరేట్ సంస్థల దాకా అంతా ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తమ రంగంలోని సవాళ్లను వివరిస్తూ… కేంద్ర ఆర్థికమంత్రికి ఎన్నో వినతులు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా పన్నుల తగ్గింపు కోసం వివిధ రంగాల నుంచి నిర్మలకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.


మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్‌ అసెంబ్లీలపై పన్నులను క్రమబద్ధీకరించాలని… ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌-ఐసీఈఏ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు వినతిపత్రం ఇచ్చింది. ఎక్కువ రేటున్న ఫోన్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించాలని కోరింది. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని… ఒక్కో ఫోన్‌పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేసింది.

వచ్చే బడ్జెట్‌లో… లాజిస్టిక్స్‌ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్‌మ్యాప్‌ రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలు అనుసరించాలని ఆపరేటర్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు జీఎస్టీని తొలగించాలని… ఫెడెక్స్‌ విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ జీఎస్‌టీ, వీఏటీ చట్టాల్లో… సరుకు రవాణా సేవలు చాలా వరకు జీరో–రేట్‌లో ఉన్నాయని తెలిపింది. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పటిష్టతకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్‌ కోరింది.


పరిశోధన, అభివృద్ధిపై చేసే ఖర్చులపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని… 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ అయిన ‘క్రాప్‌లైఫ్‌ ఇండియా’ డిమాండ్‌ చేసింది. టెక్నికల్‌ రా మెటీరియల్, ఫార్ములేషన్స్‌ రెండింటికీ… 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీని కొనసాగించాలని కోరింది. ఆగ్రో కెమికల్‌ కంపెనీల R&D వ్యయాలపై 200 శాతం వెయిటెడ్‌ డిడక్షన్‌ను అందించాలని సూచించింది.

ఉద్యోగ కల్పన, కార్మిక చట్ట సంస్కరణలు, స్టాఫింగ్‌ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని… ప్రముఖ హెచ్‌ఆర్‌ సేవల సంస్థ రాండ్‌స్టాడ్‌ ఇండియా కోరింది. పీఎల్‌ఐ స్కీమ్, మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి కార్యక్రమాల ద్వారా…. ఉద్యోగాల కల్పనకు కేంద్రం ఊతమిస్తున్నా… దేశంలో ఇప్పటికీ ఉపాధి కల్పన సవాల్‌గానే మిగిలిపోయిందని రాండ్‌స్టాడ్‌ ఇండియా అభిప్రాయపడింది.

సిగరెట్ల అక్రమ రవాణా ద్వారా ఏటా దేశ ఖజానాకు ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని, దాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్‌ కేంద్రాన్ని కోరింది. సిగరెట్‌ స్మగ్లింగ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×