India Education Crisis| ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారత దేశంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఫలితంగా దేశ భవిష్యత్తు ప్రమాదంలో కనిపిస్తోంది. ఇండియాలోని విద్యారంగం సువిశాలంగా ఉన్నా.. దేశంలో విద్యార్థులు చదువులో ఫెయిలవుతున్నారు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి కోసం తగిన వనరులు కేటాయించడం లేదు. ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించేందకు చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకునే వారు లక్షమంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతోపాటు దేశంలో పది లక్షల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రిపోర్ట్ లోని ఈ గణాంకాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని.. విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డెల్లాయిట్ యెస్సె (Deloitte YeSSE) 2023-24 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. దేశంలోని స్కూళ్లలో దాదాపు 27 కోట్ల మంది విదార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. వీరిలో 52 శాతం అబ్బాయిలు, 48 శాతం అమ్మాయిలు. మరోవైపు వీరికి బోధించడానికి దేశంలో 11.3 కోట్ల మంది టీచర్లున్నారు. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ లో 16,29,781 మంది టీచర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (913,050), మహారాష్ట్ర (836,261), తమిళనాడు (817,142), మధ్యప్రదేశ్ (686,599) రాష్ట్రాలున్నాయి. చూడడానికి టీచర్లు ఎక్కువ మంది ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పరిశీలన చేస్తే.. నిజం ఆందోళన కలిగించేలా ఉంది. ఎందకంటే దేశంలో పది లక్షలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నీతి ఆయోగ్ రిపోర్ట్. వీటిలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఖాళీలున్నాయి.
Also Read: వారానికి 70 పనిగంటలు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పిన కారణాలు ఇవే..
దీని ఫలితంగానే ప్యూపిల్(స్టూడెంట్)- టీచర్ నిష్పత్తి చాలా అధిక వ్యత్యాసంలో ఉంది. ఈ సమస్య బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 40కు పైగా విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. దీని టీచర్ల విద్యార్థులందరికీ విద్యాబోధనలో సమన్యాయం చేయడం అసాధ్యంగా మారుతోంది. బిహార్ లో అత్యధికంగా 45 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. అదే లదాఖ్ లో మాత్రం అత్యల్పంగా ప్రతి 7 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడుకేషన్ 2023-24 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. గత సంవత్సరం ఒక ఢిల్లీలోనే 9వ తరగతి చదివే పిల్లలు లక్ష మందికి పైగా ఫెయిలయ్యారు.
వీటికి తోడు చాలా మంది టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో టెంపరరీ కాంట్రాక్టులపై పనిచేస్తున్నారు. వీరందరూ ఉద్యోగ భద్రత లేకపోవడంతో చాలా మంది అయిష్టంగా పనిచేస్తూ.. వృత్తి పట్ల 100 శాతం నిజాయితీ చూపించడం లేదు. ఫలితంగా నష్టపోతోంది టీచర్లు మాత్రమే కాదు విద్యార్థులు కూడా. యునెస్కో రిపోర్ట్ ప్రకారం.. మధ్య ప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ స్కూల్ ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. అలాంటి 21,000 స్కూళ్లు ఆ రాష్ట్రంలో ఉన్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. టీచర్లకు జీతాలు తక్కువగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు, వనరులు లేకపోవడం, టీచర్ల భర్తీలకు ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం, టీచర్లకు విద్యాబోధనలో సరైన శిక్షణ (టీచర్ ట్రైనింగ్) ఇవ్వడం.. ఇవే టీచర్ల కొరతకు ముఖ్యకారణాలని విద్యారంగంలో నిపుణులైన ప్రొఫెసర్ జ్ఞానేంద్ర తివారీ, సంజీవ్ రాయ్, డాక్టర్ సంగీత భాటియా అభిప్రాయపడుతున్నారు.
విద్యారంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం పై తెలిపన సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించడానికి పూనుకోవాలి.. ఎందుకంటే సరైన విద్యా రంగం అభివృద్ధి లేనిదే దేశాబివృద్ధి సాధ్యం కాదు.