BigTV English

Jagan Angry: ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా? జగన్ రుసరుసలు

Jagan Angry: ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా? జగన్ రుసరుసలు

Jagan Angry: మాజీ సీఎం జగన్ కష్టాలు ఇంటి కష్టాలు మొదలయ్యాయా? జగన్ చెప్పినట్టు ఎవరూ వినడం లేదా? అవినాష్‌కు ఫోన్ చేసి ఎందుకు రుసరుసలాడారు? పార్టీ పరువు పోతుందనే కారణమా? అసలు అంతఃపురంలో ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


జగన్‌కు కష్టాలు తీవ్రమయ్యాయి. ఓ వైపు పార్టీ సమస్యలు.. ఇంకోవైపు ఇంటి కష్టాలు. వీటి నుంచి బయటపడలేక నానాఇబ్బందులు పడుతున్నాడు. ఒక్కోసారి ఫ్యామిలీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులపై లోతుగా తవ్వి తీస్తోంది కూటమి సర్కార్.

ఆ గండం నుంచి బయటపడేందుకు నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.. మరికొందరైతే బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై పార్టీ కూడా చేతులెత్తేయడంతో ఏం చెయ్యాలో తెలియక నేతలు, కార్యకర్తలు వలస పోతున్నారు.


పార్టీలో ఎలాంటి కష్టాలు వచ్చినా కడప ప్రజలు వైఎస్ఆర్ ఫ్యామిలీని ఆదరిస్తూ వచ్చారు.. వస్తున్నారు కూడా. గడిచిన ఐదేళ్లు వైసీపీ పాలన చూసిన ప్రజలు ఈసారి రూటు మార్చారు. ఏళ్ల తరబడి జరుగుతున్న పనులు, నేతల వ్యవహారశైలి గమనించారు ప్రజలు. రీసెంట్‌గా పులివెందులలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ మొత్తం కైవశం చేసుకుంది.

ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. అలవెన్స్ పై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

సింపుల్‌గా చెప్పాలంటే వైసీపీ చేతులెత్తేసిందన్నమాట. పట్టుసాధించేందుకు వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. చివరకు ఫ్యాన్ పార్టీ చేతులెత్తేసింది. కడప జిల్లాలో మొత్తం 203 నీటి సంఘాలు ఉండగా, అందులో 202 సంఘాలు కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ కోట బద్దలవుతోంది.

పులివెందుల నియోజకవర్గంలో 32 సంఘాలను సైకిల్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇక అసలు విషయానికొద్దాం. ఈ క్రమంలో కడప కార్పొరేషన్‌పై కన్నేసింది టీడీపీ. దానికి వెనుక నుంచి చకచకా పావులు కదుపుతున్నారు బీటెక్ రవి. వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో మంతనాలు సాగించారు.

కడప జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంపై జగన్‌ తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరిన 11 మంది కార్పొరేటర్లతోపాటు మరో 11 మంది గోడ దూకేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం జగన్ చెవిలో పడింది. వెంటనే అలర్టయిన అధినేత, అవినాష్‌రెడ్డికి ఫోన్ చేశారని సమాచారం.

ఎవరూ పార్టీని వీడకుండా చూడాలని కాసింత గట్టిగానే చెప్పాడట. ఇంత జరుగుతున్నా..  ఇన్నాళ్లు ఏం చేస్తున్నావని మందలించారట. కడప కార్పొరేషన్ టీడీపీ చేతిలోకి వెళ్తే దాని ప్రభావం ఏపీ వ్యాప్తంగా పడుతుందని చెప్పారట జగన్. మిగతా కార్పొరేటర్లు గోడ దూకకుండా చూడాలని అవినాష్‌కు సీరియస్‌గా చెప్పారట.

ఈ గండం నుంచి గట్టెందుకు తీవ్రపయత్నాలు చేస్తున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. తనకున్న పరిచయాలతో నేతలు వెళ్లిపోకుండా చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని అవినాష్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పివాపోయారట.  ఐదేళ్లుపాటు అధికార పార్టీతో కష్టాలు పడే బదులు వలస పోవడమే బెటరని అంటున్నారు. కడప కార్పొరేషన్ వైసీపీ చేయి జారిపోతే, ఇక కూటమికి తిరుగుండదని అంచనాలు మొదలయ్యాయి. మొత్తానికి ఈ గండం నుంచి అవినాష్‌రెడ్డి ఎలా గట్టెక్కుతాడో చూడాలి.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×