BigTV English
Advertisement

RK Roja : పాలిటిక్స్ లో ఐరన్ లెగ్.. అవినీతి ఆరోపణలు.. ఇప్పుడు పారిస్ లో మాజీ మంత్రి

RK Roja : పాలిటిక్స్ లో ఐరన్ లెగ్.. అవినీతి ఆరోపణలు.. ఇప్పుడు పారిస్ లో మాజీ మంత్రి

RK Roja and Anil Kumar Yadav: పరాజయం తర్వాత వాస్తవలోకం వచ్చిన మాజీ బూతు మంత్రులు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు. సొంతపార్టీలోనే పెద్దఎత్తున ప్రత్యర్ధులను తయారుచేసుకున్న మాజీలు.. ఇక రాజకీయ భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకున్నట్లు.. నియోజకవర్గం నుంచి పరారయ్యారు. రోజా, అనిల్ కూమార్‌యాదవ్‌లు ఇప్పుడు స్టేట్లో లేరు. రోజా అయితే ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా నగరిలో మాత్రం కనిపించడం లేదు. విదేశాల్లో ఫ్యాన్సీ డ్రస్‌లు వేసుకుని విహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆమె ఫొటోలు చూస్తూ రెండు సార్లు ఆమెను గెలిపించిన నగరి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.


మాజీ మంత్రి రోజా.. వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా బానే ఫోకస్ అయ్యారు. మహిళలని కూడా మర్చిపోయి తనదైన హావభావాలతో.. అభ్యంతరకర భాషతో తెగ చెలరేగిపోయారు. 2014లో మొదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు.. అదే వైఖరి కారణంగా అసెంబ్లీ నుంచి దీర్ఘకాలం సస్పెండ్ అయ్యారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి.. ఆమె మంత్రి అయ్యాక మరింత దూకుడు ప్రదర్శించారు. టీడీపీ, జనసేన అధినేతల్ని తీవ్ర పదజాలంతో టార్గెట్ చేస్తూ.. తన జగనన్న కళ్లలో ఆనందాన్ని వెతుక్కుంటూ కాలం గడిపేశారు.

అయితే అదే పైర్ రివర్స్ అయింది. రెండు సార్లు బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కిన రోజారెడ్డి.. మూడో సారి 45 వేల ఓట్ల తేడాతో ఘోరపరాజయం పాలయ్యారు. అటు వైసీపీ కూడా కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు పార్టీ ఓటమికి రోజా నోటి దూకుడు కూడా ఒక కారణమని వైసీపీ సీనియర్ల నుంచి కార్యకర్తల వరకు నమ్ముతున్నారు. ఆ క్రమంలో నగరి వైసీపీలో ఆమెపై ఉన్న వ్యతిరేకతతో ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు వైసీపీ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలతో కూటమి శ్రేణులకు ఆమె కనిపించే అవకాశం లేకుండా పోయింది.


Also Read : బీజేపీలో విలీనం లేదు? కేటీఆర్ మాస్ వార్నింగ్ వెనుక అర్థమేంటీ?

సినిమాల్లో ఫర్లేదు అనే ఇమేజ్ సొంతం చేసుకున్న రోజా పాలిటిక్స్‌లో మాత్రం పూర్తి నెగిటివ్ ఇమేజే దక్కించుకున్నారు. ప్రత్యర్ధులను స్థాయీ బేధం లేకండా విమర్శిస్తూ అభాసుపాలయ్యారు. ఆమె రాజకీయ ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. మరి అదే మహిమో కాని రోజా టీడీపీ లో చేరగానే ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. 2004 ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసిన రోజా ఓడిపోవడంతో పాటు టీడీపీ పరాజయం పాలైంది. లీడర్లను తయారు చేసే ఖార్కానాగా పేరున్న టీడీపీలో రాజకీయ శిక్షణ పొందిన రోజా.. 2009 ఎన్నికల సమయానికి దివంగత వైఎస్ ఆశీస్సులు సంపాదించుకుని కాంగ్రెస్ బాట పట్టారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో సారి గెలిచినప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ ఏడాదిలోపే అమరులై విషాదం మిగిల్చారు. ఆ ఎఫెక్ట్‌తో రోజాకి.. ఐరెన్ లెగ్ అన్న బ్రాండ్ పడిపోయింది. ఇక తర్వాత జగన్ పంచకు చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఏపీఐఐసీ చైర్మన్‌గా తర్వాత మంత్రిగా పనిచేసిన ఆమె.. తన కుటుంబ సభ్యులతో కలిసి పెద్దఎత్తున దందాలు చేసి పెద్దఎత్తున వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అదీకాక గడిచిన పదేళ్లు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుని రాజకీయంగా నష్టపోయారన్న విమర్శలున్నాయి. జగన్ మెప్పుకోసం అన్నట్లు ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు రోజా స్థాయిని దిగజార్చాయి. మరోవైపు సొంత పార్టీలోనే ఆమె శత్రువులను ఆమె పెంచుకుంటూ పోయారు. నగరి వైసీపీ శ్రేణులకు లేడీ విలన్‌గా మారారు.

ఎన్నికల ముందు జగన్ ఆమె వ్యతిరేకులను పిలిపించుకుని స్వయంగా పంచాయతీ పెట్టి బతిమలాడినా.. ఆమెకు మద్దతివ్వడానికి ప్రత్యర్థులు ఇష్టపడలేదంటే వారి ఆగ్రహం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మనకు తిరిగే లేదు అన్న భ్రమల్లోకి వెళ్లిపోయిన రోజా.. సొంత పార్టీలో వ్యతిరేకులను ఏ మాత్రం లెక్కపెట్టలేదు. ప్రతిమండలంలోని వ్యతిరేక గ్రూపులు తయారవుతున్నా పట్టించుకోలేదు. వాళ్లు తనను ఏం చేయలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో రోజా ఎవరినీ కేర్ చేయలేదు. పార్టీ బలాన్ని, అధికార బలాన్ని సొంత బలమనుకుని.. తిరిగి గెలిచేస్తామని ధీమాకు పోయారు.

Also Read : ఎడారి దేశాల్లో తడారిపోతున్న బతుకులు.. నరకానికి నకళ్లుగా గల్ఫ్ దేశాలు

చివరికి కుటుంబసభ్యులు, సోకాల్డ్ సలహాదారుల సలహాలతో ఘోరంగా ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో భర్త, సోదరుల పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు పట్టించుకోలేదు. ప్రత్యర్థులపై మితిమీరిన విమర్శలు, సొంత పార్టీలో వ్యతిరేక కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం, విలాసవంతమైన జీవితం, విదేశీ ప్రయాణాలు.. ఇవే రోజాకు శాపాలుగా మారాయంటారు. టూరిజం శాఖ మంత్రిగా కనీసం చిన్న ప్రాజెక్టు కూడా తన నియోజకవర్గానికి తీసుకురాలేక పోయారామె. ఏ రోజూ తన శాఖ గురించి అమె రివ్యూ నిర్వహించలేదు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత తన మకాం నగరి నుంచి చెన్నైకి మార్చారు. వీలున్నప్పుడల్లా ఆలయాలు సందర్శింస్తూ సదరు ఫొటోలను సోషల్ మీడియాలో హైలెట్ చేసుకున్నారు. మీడియాకు ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇంటా బయట తనపై సాగుతున్న ప్రచారంతో మరీ పరువు పోతుండటంతో.. ఫలితాల తరువాత సైలెంట్ గా ఉన్న రోజా సోషల్ మీడియాలో పొలిటికల్‌గా కాస్త యాక్టివ్ అయ్యారు. టూరిజం మంత్రిగా తన హయాంలో నిర్మితమైన రుషికొండ ప్యాలెస్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. రుషికొండపై పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా.? అని ప్రశ్నించారు.

రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారని ఆమె పెట్టిన ట్వీట్‌కు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ కొత్త బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు మరోసారి వివాదాస్పదమైంది. తనతో కరచాలనం చేయడానికి ముందుకొచ్చిన ఆలయ పారిశుద్ధ్య సిబ్బందిని.. దూరంగా ఉండమని రోజా నిలువరించడం విమర్శలకు దారితీసింది. రోజా చర్యను తమిళ మీడియా ఎండగట్టింది.

ఎన్నికల తరువా‌త చాలా రోజులకు జగన్‌ను కలిసిన రోజా ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ సైతం రోజాకు వార్నింగ్ ఇచ్చారు. నగరి పాదిరేడు భూముల స్కామ్ సహా భూకబ్జాలు, అన్నదమ్ములతో కలసి దోచుకున్న భూములు , చేసిన అవినితి అన్నిటినీ బయటకు తీస్తామని.. ఆడుదాం ఆంధ్రాలో అందనంత అవినీతి చేశారని వాటిపై విచారణ జరిపిస్తామని రోజాను వదిలి పెట్టే ప్రశ్నలేదంటున్నారు. ఇలా ఎటు చూసినా సమస్యలు చుట్టుముడుతుండటంతో.. ఆమె సైలెంట్ గా సైడ్ అయ్యారంటున్నారు.

అయితే మొన్నటి కదా ఆలయాలను దర్శిస్తూ తిరిగిన ఆమెను ఎక్కడా ఎవరు తప్పుపట్టలేదు కానీ.. తాజాగా ప్యారీస్ లో రోజా ఫ్యాన్సీ డ్రస్‌తో పర్యటిస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో.. పార్టీలోని సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారట. ఇక నగరిలో అయితే ఆమె అనుచరులు మరింత గుర్రుగా ఉన్నారట. రోజా ను నమ్ముకొని సర్వం కోల్పోయామని.. ఎన్నికల తరువాత కనీసం పలకరించకుండా.. విదేశాల్లో అలా తిరుగుతూ పబ్లిసిటీ చేసుకోవడమేంటని తెగ ఫీల్ అవుతున్నారట.

అదలా ఉంటే రోజా సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో చెప్తున్నాయి. ఏలాగూ రెండు సంవత్సరాలు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పడు బలమైన నియోజకవర్గాన్ని జిల్లాలో ఎంపిక చేసుకుంటే సరిపోతుందని.. అంతేగాని ఇప్పుడే వచ్చి ఎందుకు ఇబ్బందులు పడాలని రోజా భావిస్తున్నారంట

ఇక మరో మాజీ మంత్రి అనిల్‌కూమార్‌యాదవ్ కూడా ఇప్పుడు ఏపీలో అడ్రస్ లేరు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉంటూ.. ప్రమోషన్ పేరుతో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన ఆయన.. ఆ రెండు జిల్లాల్లోనే కాదు.. అసలు రాష్ట్రంలోనే కనిపించడం లేదు. నెల్లూరు నుంచి బిచాణా ఎత్తేసిన అనీల్ తమిళనాడులోని మహాబలి పురంలో సేద దీరుతున్నారంట. చొక్కా చేతులు మడిచి ప్రత్యర్ధులకు వార్నింగులు ఇచ్చిన ఆయన ఇప్పుడు సైలెంట్‌గా పక్కా రాష్ట్రంలో టైం పాస్ చేస్తున్నారంట. వైసీపీలో ఫైర్‌బ్రాండ్లుగా ఫోకస్ అయిన ఆ మాజీ బూతు మంత్రుల పరిస్థితి అలా తయారైందిప్పుడు.

YouTube Thumbnail Downloader FULL HQ IMAGE

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×