Mirabai Chanu 4th place: పారిస్ ఒలింపిక్స్ 2024 భారత ఆటగాళ్లు మరిచిపోరు.. ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. గెలుస్తామని భావించిన ఆటగాళ్లపై వేటు వేసింది. మరికొందరు అనూహ్య పరిణామాలతో వెనుదిగిరారు. ఏళ్ల తరబడి తాము కష్టపడిన కష్టమంతా పోయిందని మరికొందరి ఆవేదన.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. బుధవారం రాత్రి జరిగిన 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను కాంస్య పతకం కోల్పోయింది. కేవల ఒక్క కేజీతో పతకానికి దూరంగా నిలిచిం ది. మణిపూర్‌కి చెందిన మీరాబాయి మొత్తం 199 కేజీలు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది.
స్నాచ్‌లో 88 కేజీలెత్తిన చాను, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోలు బరువు ఎత్తింది. టోటల్‌గా 199 కేజీలు ఎత్తింది మీరాబాయి. ఇదే పోటీలో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ హౌజిహుయి 206 కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని దక్కించుకుంది. రొమేనియా వెయిట్ లిఫ్టర్ మిహేలా వాలైంటీనా 205 కేజీలు, థాయ్‌లాండ్‌కు చెందిన సురోచనా 200 కేజీలు ఎత్తి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.
ALSO READ: సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫొగట్
మనుబాకర్.. 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ల్లో దేశానికి రెండు కాంస్య పతకాలు తీసుకొచ్చింది.
అర్జున్ బాబుట.. పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిం చాడు, అతడు కేవలం నాలుగో స్థానంలో 20 షాట్ల తర్వాత బాబుటా మొత్తం 208.4 పాయింట్లు మాత్రమే సాధించాడు.
ధీరజ్-అంకిత.. ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో ఈ జోడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరు కాంస్య పతకం పోరులో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్-కేజీకౌఫ్ జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు.
అనంత్ జీత్-మహేశ్వరి.. షూటింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఈ జోడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వీరిద్దరు 43 పాయింట్లు సాధించగా, చైనాకు చెందిన జియాంగ్-జియాన్లిన్ జోడి 44 పాయింట్లు సాధించి కాంస్య పతకం ఎగురేసుకుపోయారు.
లక్ష్యసేన్.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మలేషియాకు చెందిన ఆటగాడి లీజి జియాతో తలపడ్డాడు సేన్. తొలి సెట్‌ను గెలుచు కున్న సేన్, రెండో సెట్‌లో తడబడ్డాడు. ఫలితంగా మూడో సెట్‌కు దారి తీసింది. అందులోనూ ఓటమిపాలయ్యాడు లక్ష్యసేన్.