BigTV English

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Former BRS MLAs big shock to ktr: బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వారి దూకుడు ఒక రేంజ్లో ఉండేది. దానిక తగ్గట్లే ఆ పార్టీ ఆ జిల్లాలో బలంగగా ఉండేది. దాంతో పార్టీ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని సదరు నేతలు హడావుడి చేశేవారు. ప్రతి రోజు ఎదో కార్యక్రమంలో పాల్గొంటూ బిజీబిజీగా కనిపించే వారు. అన్ని కార్యక్రమాల్ని ముందుండి నడిపించేవాదు. అలాంటి నేతలు ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు కేడర్‌కు కనిపించడమే మానేశారు.ఇంతకీ ఎవరా నాయకులు? ఏ జిల్లాకు చెందిన వారు?


మొన్నటి ఎన్నికల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. గతంలో బిఆర్ఎస్ బలంగా ఉండేది. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనబడేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయాయి. జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు.. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఛాన్స్ దొరికినా వదలకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

అయితే కరీనంగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం.. అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంథని నుంచి పోటీ చేసి ఓడిపోయిన పుట్ట మధు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తి గా సైలెంట్ అయ్యారు. ఎప్పుడు శ్రీధర్ బాబుఫై ఫైర్ అయ్యే మధు ఇప్పుడు నోరు విప్పడం లేదు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు.ఇటీవల కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన సమయం లో ఆయన జాడ లేదు.. ఎంతో దూకుడు గా ఉండే.. ఈ నేత పూర్తి గా సైలెంట్ అవ్వడం పార్టీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తుంది.


అధికారంలో ఉన్నంత కాలం దూకుడుగా వ్యవహరించిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు.. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. అంతేకాదు హుస్నాబాద్‌ వాసులకు కూడా నల్లపూస అయ్యారంట. దాంతో అక్కడ నడిపించే నాయకుడు లేక బిఆర్ఎస్ శ్రేణులు పక్క చూపులు చూస్తున్నాయంటున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.. ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ముఖం చూపించడం మానేశారు. ఆ క్రమలో హుస్నాబాద్‌లో అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చే నాయకుడే లేకుండా పోయాడు.

Also Read:  తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు

ఇక మరో నేత, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి .. ఆయన కనీసం సొంత కేడర్‌కి కూడా టచ్‌లో లేరంట. కేటిఆర్ పెద్దపల్లి మీదుగా వెళ్లినా.. ఆయనకు ఫ్లెక్సీ కట్టించి స్వాగతం పలకడం కాదు కదా.. ఆయన్ని కలవడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఓడిపోయిన తరువాత..ఈ ముగ్గురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది ఎప్పుడు యాక్టివ్ గా ఉండేనేతలు సైలెంట్‌గా ఉండటంతో.. పార్టీ వర్గాలు పూర్తిగా ఢీలా పడిపోతున్నాయి.

కేటిఆర్ ప్రభుత్వాన్ని పదేపదే టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపులు ఇస్తున్నా.. ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తరచూ నియోజకవర్గంలో పర్యటించిన నేతలు .. ఇప్పుడు నియోజకవర్గం వైపు కూడా చూడటం లేదు.. అంతేకాదు కాంగ్రెస్ ఎంఎల్ఎలపై కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఆ క్రమంలో వారి ఫ్చూచర్ ప్లాన్స్ వేరేగా ఉన్నాయేమో? అన్న చర్చ మొదలైంది.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×