BigTV English
Advertisement

Bigg Boss Telugu 8: సోనియా ఆకుల నాలుగు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే..?

Bigg Boss Telugu 8: సోనియా ఆకుల నాలుగు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే..?

Bigg Boss Telugu 8:  బుల్లి తెరపై భారీ క్రేజ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్. హిందీలో 18 సీజన్లు జరుపుకున్న ఈ షో తెలుగులో మాత్రం 8 వ సీజన్ జరుపుకుంటుంది. ఈ సీజన్ మొదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగో వారం ఈరోజు ఎలిమినేషన్ తో పూర్తి కాబోతుంది. ఈ వారం కు గాను సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొదటి నుంచి హౌస్ లో ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ తో అందరితో గొడవలు పెట్టుకుంది. అదే ఆమెకు మైనస్ అయ్యింది. అందుకే జనాలకు చిరాకు తెప్పించింది. తక్కువ ఓటింగ్ తో హౌస్ లోంచి బయటకు వస్తుందని టాక్. మరి ఈరోజు సోనియా హౌస్ నుంచి బయటకు వెళ్తుందేమో చూడాలి..


బిగ్ బాస్ 8 వ సీజన్‌లోకి ముందుగా 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వీళ్లంతా తమ తమ రంగాల్లో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు.. వారిలో సోనియా కూడా ఒకటి. తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. అలా ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్ మొదలై కొత్త కంటెంట్ తో రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. ఈ వారం టాస్క్ లు కూడా దారుణంగా ఉన్నాయి. టాస్క్ పేరుతో హౌస్ పెద్ద యుద్ధమే జరిగిందని ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఈ వారం సోనియా హౌస్ హైలెట్ అవుతూ వస్తుంది. అదే ఆమెకు మైనస్ అయ్యింది.

పృథ్వి, నిఖిల్ తో పులిహోర కలుపుతూ మిగిలిన వారి పై మొదటి నుంచి నోరు పారేసుకుంటూ వస్తుంది. ఎదుటి వారిపై పర్సనల్ ఎటాక్ చేయడం, లవ్ ట్రాకులు నడపడంతో విమర్శలు తెచ్చుకుంది. దీంతో ఎన్నో గొడవల్లో భాగం అయింది. ఎప్పుడూ వేరే వాళ్ల పై మాటలు వదులుతూ ఇబ్బంది పెట్టడం ఆమెకు మైనస్ అయ్యింది. దాంతో ఆమె ఈ వారం తక్కువ ఓటింగ్ తో హౌస్ నుంచి బయటకు రాబోతుందనే వార్త ఒకటి లీక్ అయ్యింది. ఇదే నిజమైతే ఆమె నాలుగు వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి చూసేద్దాం.. ఈమె రోజుకు రూ. 28 వేల చొప్పున వారానికి రూ. 2.00 లక్షలు చార్జ్ చేసిందట. అలా 4 వారాల పాటు ఉన్న సోనియా మొత్తంగా రూ. 8 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందని టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ వీక్ ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి.. ఇక మరోవైపు డబుల్ ఎలిమినేషన్ ఉండనే వార్తలు కూడా వినిపించాయి . సోనియా వెళ్తూ ఎవరిని సేవ్ చేసి వెళ్తుందో చూడాలి.. ఈ సీజన్ కు విన్నర్ గా నబీల్ అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎవరు విన్నర్ అవుతారో తెలియాలంటే మరో రెండు నెలలు వెయిట్ చెయ్యాల్సిందే ..


Related News

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Big Stories

×