Big Stories

Peddireddy Vs Kiran Kumar Reddy: కాళ్ల బేరం.. నల్లారి Vs పెద్దిరెడ్డి..

Peddireddy Vs Kiran Kumar Reddy: వివిధ సెగ్మెంట్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే అయిదు సెగ్మెంట్లలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్ధులను పక్కనపెట్టింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో చింతమనేనికి టికెట్‌పై సస్పెన్స్ వీడింది. బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటును టీడీపీ కోరడంతో కాషాయసేన దెందులూరుపై కన్నేసింది. అయితే అనపర్తిలో రెండు పార్టీలకు సామరస్యపూర్వక పరిష్కారం దొరకడంతో దెందులూరు నుంచి చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. అనపర్తి, దెందులూరు అభ్యర్ధులను బీజేపీ, టీడీపీలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహా యావత్తు రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం.. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి బద్దశత్రువుల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పాత ప్రత్యర్థుల మధ్య ప్రత్యక్ష పోరాటం మొదలైంది. పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట నుంచి పట్టుబట్టి మరీ బరిలోకి దిగారు కిరణ్.. ఆ క్రమంలో వారి మాటల తూటాలతో సెగ్మెంట్లో యుద్ద వాతావరణం కనిపిస్తోంది.

- Advertisement -

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బద్ద శత్రువుల్లా వ్యవహరించాయి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాలు వారి మధ్య ఆధిపత్య పోరు దశాబ్దాలుగా కొనసాగుతోంది… ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చిట్టి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సియం కిరణ్ కూమార్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్షరాజకీయాలకు దూరం అయ్యారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కూమారుడు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపిగా చేయడంతో పాటు వైసీపీలో నెంబర్ టుగా ఎదిగారు.

Also Read: ఆర్ఆర్ఆర్ కి లైన్ క్లియర్.. అనపర్తి, దెందులూరు లో హై టెన్షన్

కిరణ్ దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ నల్లారి వర్గానికి పెద్దదిక్కుగా నిలిచారు ఆయన తమ్ముడు కిషోర్ రెడ్డి అయన 2014లో సోదరుడు కిరణ్ రెడ్డి స్థాపించిన సమైక్యాంద్ర పార్టీ తరపున పీలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో టిడిపి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ సారి కిరణ్ రెడ్డి బిజెపిలో చేరి కూటమి అభ్యర్ధిగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగడంతో జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది.

రాజంపేట పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత నియోజక వర్గంలోకి వచ్చిన కిరణ్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ చేస్తుందని గతంలో కాంట్రాక్టు పనుల ద్వారా ప్రభుత్వాన్ని దోపిడీ చేసిందని , ఇప్పుడు భూములు లాక్కోవడం, పాడి రైతులు, మామిడి రైతులను దోచుకుంటున్నారని. దానికి అడ్డకట్ట వేయడమే లక్ష్యమని విమర్శలు గుప్పించారు. అదే రోజు రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి కిరణ్ రెడ్డి సూటుకేసులతో వచ్చి వాటితో తిరిగి పోతాడని  కిరణ్‌రెడ్డిని ఓడించి తన తండ్రికి విజయాన్ని కానుకగా ఇస్తానని సవాల్ విసిరారు.

పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రతిచోటా కిరణ్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హత తనకు ఉందంటున్న పెద్దిరెడ్డి చిదంబరం లాంటి వాళ్ల కాళ్లు పట్టుకుని కిరణ్ సీఎం అయ్యారని  విమర్శలు గుప్పిస్తున్నారు. తన కొడుకు మిధున్ రెడ్డి విజయం కంటే నల్లారి కిరణ్ ఓటమే తనకు ముఖ్యమని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

మొదటి రెండు రోజులూ పెద్దిరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోని కిరణ్ తన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భారీ జనసందోహం ముందు ప్రత్యర్ధిని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు.పెద్దిరెడ్డి తాను సీఎంగా ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్ష పదవి కోసం తన కాళ్లు పట్టుకున్నారని తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ ఒకటి రెండు సార్లు కాళ్లు పట్టుకుని బతిమలాడారని యద్దేవా చేశారు. మాజీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్ అవుతున్నాయి.

Also Read: జగన్‌పై ఆగ్రహం, ఇంకెన్నాళ్లు.. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే..!

పెద్దిరెడ్డి అర్హతల గురించి ప్రశ్నిస్తున్న నల్లారి కిరణ్ పక్కా వ్యూహంతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వైసీపీ ఈ సారి టికెట్ ఇవ్వలేదు. కిరణ్ ఇప్పుడు మేడా వర్గం మొత్తాన్ని టిడిపిలో చేర్పించారు. దాంతో పాటు రైల్వేకోడూరులో ఉన్న టిడిపి గ్రూపులను కలసి కట్టుగా పనిచేసేలా చక్రం తిప్పారు. మరో వైపు మదనపల్లిలో టిడిపి మైనార్టీ అభ్యర్థికి ఇబ్బందిగా మారిన అసమ్మతి ని తగ్గించడానికి చర్చలు జరుపుతున్నారు. తంబల్లపల్లిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ అభ్యర్థి మార్పునకు పావులు కదుపుతున్నారు.

పుంగనూరు, రాయచోటిల్లో బూత్ క్యాప్చరింగ్ జరగకుండా సెంట్రల్ బలగాలను రంగంలోకి దింపే పనిలో పడ్డారు. గతంలో తనతో ఉన్న నాయకులందరని యాక్టివ్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి సైతం కిరన్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుంగనూరులో తనకు ఓట్లుతగ్గినా ఫర్వాలేదని. తన కూమారుడి మెజార్టీ ఏమాత్రం తగ్గ కూడదని క్యాడర్‌ను అలెర్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాజంపేట పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలోని ముఖ్యులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి తండ్రి కొడుకులు రాజంపేట లోక్‌సభ సెగ్మెంట్‌కే పరిమితమవ్వాల్సి వస్తోందిప్పుడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News